వీర నారి రాణి అవంతీబాయి లోధీ - ఆత్మత్యాగానికి సిద్ధపడ్డ తలవొంచని ధీర వనిత దేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి, బ్రిటీష్ అణచివేతను నిరోధించడానికి పోరాడిన వారిలో రాణి అవంతీబాయి లోధీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1857 తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన రాణి అవంతీబాయి సుపరిపాలనకు ఒక ఉదాహరణగా నిలవడమే కాకుండా, తన జీవితకాలమంతా మాతృభూమి గౌరవానికి కట్టుబడి ఉంది. ఆమె జీవిత కథ ఎల్లప్పుడూ దేశానికి గర్వకారణంగా నిలుస్తూనే ఉంటుంది. జననం : 16, 6 1831 మరణం : 20, 2 1858 'దేశం గర్వించదగ్గ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధురాలు అవంతీబాయి, మధ్యప్రదేశ్ లోని సీయోనీలో 1831 ఆగస్టు 16న జన్మించారు. అమె చిన్నతనం నుంచే తన తండ్రి జుఝార్ సింగ్ వద్ద కత్తిసాము, గురిచూసి కాల్చడం, గుర్రపు స్వారీలలో శిక్షణ పొందారు. ఆమె రామ్‌గఢ్ రాజైన లక్ష్మణ్ సింగ్ లోధీ కుమారుడైన యువరాజు విక్రమాదిత్యను వివాహం చేసుకున్నారు. రాజు అనారోగ్యం పాలుకావడం. వారసులు చిన్నవారు కావడంతో, రాణి రాజ్య బాధ్యతలను స్వీకరించి, తనను తాను సమర్థురాలైన పాలకురాలిగా నిరూపించుకున్నారు. ఆ సమయంలో, బ్రిటీష్ వారు దేశంలోని సంస్థానాలను ఆక్రమించుకోవడానికి వివిధ విధానాలను రూపొందిస్తున్నారు. 'దత్తత సిద్ధాంతం కింద, రామగడ్ ను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటీష్ వారు ఒక 'కోర్ట్ ఆఫ్ వార్డ్స్'ను ఏర్పాటు చేశారు. దీనికి నిరసనగా, రాణి అవంతీబాయి తిరుగుబాటు బాకా ఊదారు. పొరుగు రాజులు, జమీందార్లను ఏకం చేయడానికి ఆమె గాజులతో కూడిన లేఖలను పంపారు. ఈ చర్య విప్లవంలో ఒక ప్రత్యేకమైన సంకేతంగా మారింది. ఆమె తన లేఖలో ఇలా రాసింది: "బ్రిటీష్ వారితో పోరాడటానికి సిద్ధంగా ఉందండి, లేదా గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోండి." 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి యువతను సన్నద్ధం చేసి ఆమె అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఖైరీ యుద్ధంలో, ఆమె తన వ్యూహాత్మక చతురతను ఉపయోగించి బ్రిటీష్ కమాండర్ వాడింగ్ట న్ ను వెనక్కి తగ్గేలా చేసి, తన ప్రాంతాన్ని విముక్తి చేశారు. అంతేకాకుండా, ఆమె మరికొన్ని ప్రాంతాలను విముక్తి చేయడం ద్వారా తన శౌర్యాన్ని, దృఢ సంకల్పాన్ని నిరూపించుకున్నారు. బ్రిటీష్ వారి భారీ సైన్యం చుట్టుముట్టినప్పుడు, ఆమె దేవహద్ద్ కొండలలో వీరోచితంగా పోరాడారు. 1858 మార్చి 20న, బ్రిటీష్ వారికి చిక్కిపోతానని గ్రహించి, తన సొంత కత్తితోనే ప్రాణత్యాగం చేసి దేశం కోసం అత్యున్నత బలిదానాన్ని అందించింది. దేశ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని సాధించడానికి సర్వస్వం త్యాగం చేసిన అవంతీబాయి 'భారత జోన్ ఆఫ్ ఆర్మ్ 'గా పేరు ఘటించారు. ఆమె మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. ఆమె గౌరవార్థం తపాలా శాఖ ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఆమెకు నివాళిగా ఇంలూర్లోని బార్గి డ్యామ్‌కు 'రాణి అవంతీబాయి సాగర్' అని నామకరణం చేశారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్