ఎక్కడ చూసినా AI అసలేమిటిదంతా? ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు. A.I. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు కావలసిన సమాచారాన్ని ఖచ్చితంగా ఇస్తోంది. బొమ్మలను తయారుచేస్తోంది . అలాగే మనం కొన్ని కీవర్డ్స్ ఇస్తే మనకు కావలసిన పవర్ పాయింట్ ఇమేజెస్, వీడియోలు, వాయిస్ జనరేట్ అవుతున్నాయి. అదే 30 సెకండ్లలోపే. పాత ఫోటోలలో ఉన్నవారు AI వలన మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. అటు ఇటు కదులుతున్నారు. అసలు ఏమిటి దంతా.. నిజానికి మనిషి కొత్త అంశాలను సృజించడం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. అలెన్ ట్యూరింగ్ అనే కంప్యూటర్ శాస్త్ర వేత్త మరియు గణితవేత్త యంత్రాలతో మాట్లాడించాలని ప్రయత్నించి ట్యూరింగ్ టెస్ట్ ను ఆవిష్కరించారు. అదేవిధంగా జాన్ మెక్ కార్తీ అనే కంప్యూటర్ మేధావి యంత్రాలు ఎందుకు ఆలోచించకూడదు అనే అంశంపై అనేక పరిశోధనలు చేసి కృత్రిమమేథ ఆవిష్కరణకు కృషిచేశారు. అందుకే ఆయనను కృత్రిమ మేథ పిత అంటారు. ఇలా ఎంతో మంది కంప్యూటర్ మేథావులు వివిధ యంత్రాలను రూపొందించి వాటిని ఆలోచింపచేశారు. అందులో డీప్ బ్లూ అనే ఏఐ యంత్రం గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ చెస్ చాంపియన్ను ఓడించి సంచలనం సృష్టించింది. ఇలా అప్పుడుప్పుమా వార్తలలో నిలిచిన ఈ AI 2023 లో ఒక్కసారిగా వెలుగులోనికి వచ్చింది మాత్రం చాట్ జిపిటి ద్వారా! ఓపెన్ AI అనే సాఫ్ట్ వేర్ సంస్థ అమెరికాకు చెందిన శాక్ఆల్డమన్ అనే అమెరికా మేథావి కృషి వలన జనరేటివ్ AIగా పరిచయమైంది. అదే చాట్ జీపీటీ ఇందులో మనకు కావలసిన అంశాన్ని గూర్చి యంత్రాన్ని అడగడం ఆలస్యం దానికి సంబంధించిన సమాచారాన్ని సెకనులలో అందిస్తుంది. గూగుల్ సెర్చ్ కూడా ఇదే పని చేసినప్పటికీ అది అనువైన వెబ్ సైట్ లను మాత్రమే సజెస్ట్ చేస్తుంది. కానీ యిలా ఉపయుక్తంగా సమాచారాన్ని చిటికెలో చాట్ జీపీటీ అందిస్తుంది. DALL. E అనే టూల్ ద్వారా మనకు కావలసి చిత్రాన్ని క్రియేట్ చేయడాన్ని కూడా ఓపెన్ AI సాయం అందిస్తోంది. ఏ ఐని వివిధ సంస్థలు వివిధ పేర్లతో ప్రవేశపెట్టాయి. మైక్రోసాప్ట్-కోపైలట్ మెటా - మెటా ఏఐ గూగుల్ - జెమిని ఓపెన్ ఏఐ -చాట్ జిపిటి కేవలం సమాచారాన్ని అందివ్వడమే కాకుండా అనేక విధాలుగా, అనేక రంగాలలో AI సేవలను ప్రారంభించాయి. లక్షలాది ఈమెయిల్ లను విశ్లేషించి అందులో ఫేక్ మెయిల్ లను గుర్తించడం, ఒక ప్రోడక్ట్ కు వచ్చే రివ్యూలను విశ్లేషించడం, వాతావరణం, బుకింగ్స్, షాపింగ్, రక్షణ యిలా అన్నింటిలోనూ AI ప్రవేశించింది. ఫలితంగా వందమంది కష్టపడి చేసే పనిని ఒక్క AI టూల్ చేస్తోంది. కాబట్టి AI స్కిల్స్ లేని ఉద్యోగులు తమ జాబ్ లను వదులుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇక ఎడ్యుకేషన్లో లెర్నింగ్ కి, టీచింగ్ కి అవసరమైన అనేక టూల్స్ లెక్కకు మించి వస్తున్నాయి. జనరేటివ్ AI ను పెద్ద కంపెనీలే తయారు చేయగలుగుతాయి. ఎందుకంటే అందుకు ఎక్కువ మొత్తంలో డేటా అవసరం. అలాంటి డేటాను విశ్లేషించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిపుణులు కావాలి. అందువల్ల గూగుల్, మైక్రోసాప్ట్, మెటా, ఓపెన్ AI వంటి కంపెనీలు మాత్రమే ఈ పనిని చేయగలవు. AI తో ఏమేమి చేస్తున్నారంటే ఇమేజ్ క్రియేషన్ - డేటా ద్వారా గాని, పాత ఫోటోనుంచి గాని కొత్త ఇమేజ్ లను క్రియేట్ చేయడంవీడియో జెనరేషన్ - కొంత టెక్స్ట్ ఇవ్వడం ద్వారా వీడియో తయారీ, చిత్రాలను, వీడియోలను, కంటెంట్ ను అదే ఎంపిక చేసుకుంటుంది.వాయిస్ జెనరేషన్ - ఆడియో ఫైల్స్ తయారీ పవర్ పాయింట్స్, వెబ్ సైట్, పోస్టర్స్, లోగో, డాక్యుమెంట్లు రెడీ చేసుకోవచ్చుఇలా ఎన్నో పనులకు చేస్తుంది కాబట్టి AIకి అంత క్రేజ్.. ఆధారం: మన బడి మాస పత్రిక