అత్యాశపరుడు సి.బెళగల్ గ్రామంలో రామయ్య ఉండేవాడు. అతనికి కూరగాయల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం.ఒకరోజు అడవిలోకి కట్టెలకు వెళ్తున్నాడు. రామయ్య వెళ్ళుతూ ఉండగా ఒక ఋషి కనిపించాడు. ఆ ఋషి "రామయ్యా ఇలా రా.." అని పిలిచాడు.అప్పుడు రామయ్య ఋషి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ఆ ఋషి రామయ్యకి బంగారు టమోటా విత్తనాలు ఇచ్చాడు. ఆ ఋషి రామయ్యతో ఇలా అన్నాడు. "ఈ విత్తనాలు నీ తోటలో నాటు. వాటి నుంచి వచ్చిన బంగారు టమోటాలతో ఎవరైనా ఆపదలో ఉన్నవారికి ఆ టమోటాలు అమ్మి సహాయం చేయి" అని చెప్పాడు."సరే" ఋషి గారు అని ఆ విత్తనాలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు రామయ్య. రామయ్య ఇంటికి వెళ్ళాక ఋషి ఇచ్చిన విత్తనాలను తన కూరగాయల పొలంలో నాటాడు. కొన్ని రోజుల తర్వాత చెట్టు మొలిసింది. అలాగే బంగారు టమోటాలు కూడా కాసింది.ఆ బంగారు టమోటాలను తీసుకొని బజార్లో రెండు లక్షలకు అమ్మాడు. వచ్చిన డబ్బులతో పేదవాళ్ళకి సహాయం చేయకుండా తాను పెద్ద భవనం కొనుక్కున్నాడు. అత్యాశ మరింత ఎక్కువైంది. తాను ధనవంతుడు కావాలని ఆలోచనతో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు కాసిన టమోటాలను తీసుకొని మల్లా నాటితే, మరో చెట్టు వస్తుందని అత్యాశపడ్డాడు రామయ్య.టమోటా విత్తనాలు మొలకెత్తాయి. చెట్లు పెరిగాయి. కానీ టమోటాకు బదులుగా వింతైన టమోటా కాసింది. అప్పుడు రామయ్య 'ఏంటి బంగారు టమోటాలు కాస్తాయి అనుకుంటే వింత వింత టమోటా కాసింది.' అనుకుంటాడు రామయ్య.కానీ రామయ్య దాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు వింతైన టమోటాలలో నుండి రామయ్యకు బంగారు టమోటా విత్తనాలు ఇచ్చిన ఋషి ఆత్మ అందులో నుంచి బయటికి వచ్చింది. ఆ ఋషి ఆత్మ రామయ్యతో ఇలా అంటాడు. "ఒరేయ్ దుర్మార్గుడా..! నేను ఇచ్చిన బంగారు టమోటా విత్తనాలు నాటి వాటిల్లో నుండి వచ్చిన బంగారు టమోటాలతో ప్రజలకు సహాయం చేయమని చెబితే నువ్వు ప్రజలకు సహాయం చేయకుండా నీ అత్యాశ కోసం వాడుకుంటావా..? కాబట్టి నేను ఇచ్చిన బంగారం టమోటా చెట్టును, అలాగే నీ ఇంటిని, నువ్వు బంగారంతో కొనుక్కున్న వస్తువులన్నీ తీసుకొని వెళ్తాను" అని చెప్పి ఋషి అన్నీ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.అప్పుడు రామయ్య రోడ్డున పడతాడు. రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు .మనం ఎవరినైనా మోసం చేస్తే ఆ మోసం మనకే జరుగుతుందని తన తప్పుని తెలుసుకుంటాడు రామయ్య. ఆధారం: మన బడి మాస పత్రిక