ఆడపిల్ల చదువు - అవనికి వెలుగు మాధవరం అనే గ్రామంలో రంగయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే పేద కుటుంబం. రంగయ్య కూతురు సీత. సీతకు చిన్నతనం నుండి కూడా చదవడం అంటే చాలా ఇష్టం. కూతురు ఇష్టాన్ని గమనించిన రంగయ్య కూడా తనను బాగా చదివించాలని ఆశపడతాడు. కానీ తన వద్ద సరిపడ డబ్బులు ఉండేవి కావు. సీతను చదివించడానికి ఊర్లో కొన్ని అప్పులు కూడా చేశాడు. ఊర్లో వాళ్లంతా రంగయ్య ఆడపిల్లకు ఎందుకు చదువు అని నానారకాలుగా అంటుండేవారు. అలాంటి మాటలు విన్నప్పుడు సీతకు వాళ్ళ నాన్న చదివించడేమో అని భయపడుతుండేది. కానీ రంగయ్య మాత్రం ఊర్లో ఎవరి మాటలు వినేవాడు కాదు. తన కూతురు పైన తనకు బలమైన నమ్మకం ఉంది. ఎలాగైనా సీత బాగా చదివి తన లక్ష్యాన్ని చేరుతుందని రంగయ్య విశ్వాసం. అనేక రకమైన కూలి పనులు చేసి రంగయ్య కష్టపడి కూతుర్ని చదివించాడు. సీత కూడా అంతే స్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడి బాగా చదివి కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత సీత ఉన్నత చదువులు చదవాలని తన ఆలోచనను తండ్రితో చెబుతుంది. తలకు మించిన భారం అయినా రంగయ్య సీత కోరికను తప్పకుండా తీరుస్తానని చెప్పాడు. కానీ నువ్వు బాగా చదివి జిల్లా కలెక్టర్ అవ్వాలని రంగయ్య కూతురుతో చెబుతాడు. అది నా ఆశ అని కూతురితో చెబుతాడు. తండ్రి కోరిక ఎలాగైనా తీర్చాలని సీత బాగా కష్టపడి చదివి జిల్లా కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. ఊర్లో వాళ్లంతా ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్నారు కానీ సీత బాగా కష్టపడి తన తండ్రి ఆశలు తీర్చింది. ఆడపిల్లలుకు చదివెందుకని చిన్నచూపు చూడకూడదు. ఆడపిల్లల్ని కూడా చదివించాలి. ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు. ఆధారం: మన బడి మాస పత్రిక