మంచినేస్తాలు అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక పంట కాలువ ప్రవహిస్తూ ఉంది. పంట కాలువ అంటే తెలుసు కదా. పొలాలకు నీరు అందించే కాలువ. వర్షాకాలంలో అదనపు నీటిని సముద్రాలకు, చెరువులకు, నదులకు కలిసేది. అయితే ఆ పంటకాలువ ఒడ్డున ఒక పెద్ద వేపచెట్టు ఉంది. ఆ చెట్టుమీద ఎన్నో రకాల జీవులున్నాయి. అందులో ఒక గండుచీమ కూడా ఉంది. అయితే ఆ గండు చీమ అంటే వేపచెట్టుకు చాలా చాలా ఇష్టం. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. రాత్రిపూట చీమ చెట్టు మొత్తం తిరుగుతూ ఎన్నో విషయాలు వేపచెట్టుకు చెబుతుండేది. వేప ఆకులపై తిరుగుతూ చెప్పే సంగతులను కొమ్మలను ఊపుకుంటూ ఊ కొడుతూ వినేది వేపచెట్టు. అలా కాలం జరుగుతూ ఉంది. చెట్టు మీదున్న అన్ని జీవులు ఎక్కడెక్కడికో వెళ్లి ఆహారాన్ని సేకరించుకుని తిని వచ్చేవి. చీమ మాత్రం చెట్టుపై గూళ్లు కట్టుకుని నివసించేవి కొన్ని పక్షులు. అయితే చీమ మాత్రం అన్నిచోట్లకు వెళ్లి ఆహారాన్ని సేకరించి తెచ్చి చెట్టు ఆకుల మధ్య దాచేది. దాచిన ఆహారాన్ని చెట్టు మీదున్న చిన్న చిన్న జీవులకు ముసలి జీవులకు, ఆరోగ్యం బాగాలేని వాటికి కొద్ది కొద్ది తన శక్తికొద్దీ ఆహారాన్ని అందించేది. అందుకే ఆ చీమ అంటే అంత ఇష్టం వేపచెట్టుకి. ఆ చీమకు కూడా వేపచెట్టంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్నో రకరకాల జీవులు ఆ చెట్టుపై జీవ వైవిధ్యాన్ని జరుపుతున్నాయి. ఎన్నోరకాల జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ కలసిమెలసి జీవిస్తూ ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటారు. వేపచెట్టు ఎన్నో జీవులకు ఆవాసాన్నిచ్చింది. అన్ని జీవులను ప్రేమగా చూసుకుంటుంది. వేపచెట్టు. కొన్ని జీవులు కాండాన్ని కొరుకుతూ ఉంటాయి. కొన్ని జీవులు కొమ్మలను విరిచేస్తున్నాయి. కొన్ని జీవులు ఆకులను కొరికి తింటున్నాయి. కొన్ని జీవులు పువ్వులను, కాయలను, పండ్లను, చిగుళ్లను తింటున్నాయి. అయినా ఆ పనులన్నిటినీ ఆహ్లాదంగా స్వీకరిస్తుంది వేపచెట్టు. అవన్నీ తన పిల్లలే అనుకుంటుంది. అందుకే గండుచీమకు వేపచెట్టంటే అంతిష్టం. ఇలా కొంతకాలం గడిచింది. వర్షాకాలం వచ్చింది. 2 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పంటకాలువ నిండుగా నీటి ప్రవాహంతో ఉంది. ఉధృతంగా ప్రవహిస్తుంది. చీమకు ఆహారాన్ని తెచ్చి చెట్టుపై జీవులు అందించాలి. కొన్నిటికి 2 రోజుల నుంచి ఆహారం లేదు వర్షం వల్ల కొంచెం తెరపి రావడంతో ఎలాగైనా ఆహారాన్ని సేకరించడానికి బయలుదేరాలనుకుంది. కింద కాలువ ప్రవాహం వేగంగా ఉంది. కానీ తప్పక వెళ్లాలి. వేపచెట్టు వారిస్తున్నా వినకుండా కాలువలోకి దిగడానికి ప్రయత్నించింది. కాలువ దాటి అవతలి ఒడ్డుకు ఆహారం దొరుకుతుంది. చెట్టుపైనున్న కొన్ని జీవులకు ఆహారం అత్యవసరం. కాలువ ఒడ్డుకు చేరి కాలువలోకి దిగిందిచీమ. కొంత లోతుకు దిగాక ప్రవాహ వేగానికి కొట్టుకుపోయే స్థితి వచ్చింది. అంతా చూస్తున్న వేపచెట్టుకు భయమేసింది. చీమకు అపాయం జరగకూడదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. చీమ చెప్పిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. తనకు కదలవద్దని చెప్పింది. కదిలితే కదలలేని జీవులు కింద కాలువ ప్రవాహంలో పడితే ప్రమాదం. అని చెప్పింది.ఇప్పుడు చీమ ప్రవాహ వేగానికి కొట్టుకు పోతుంది. చీమ హెచ్చరికను పక్కనపెట్టి శరీరాన్ని కొద్దిగా కదిలించింది. ఎక్కడో ఎండిన కొమ్మ జారి నీటిలో పడింది. అది కూడా చీమతో పాటు పోతుంది. గమనించిన చీమ చటుక్కున చెట్టు కొమ్మకున్న ఆకును పట్టుకుంది. ఇది చూడని వేపచెట్టు మిత్రుడికి అపాయం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుని మిత్రునికై వేచి చూస్తూ ఉంది. చీమ తను పట్టుకున్న ఆకుపై కూర్చుంది. పడవ ప్రయాణం చేసినట్టు ఆనందం అనుభవిస్తూ ప్రవాహానికి చాలా దూరం వెళ్లిపోయింది. ప్రవాహం తగ్గడానికి ఒక రోజు పట్టింది. వేగం తగ్గి నెమ్మదిగా ఒడ్డుకు చేరింది చీమ. చీమ చాలా వేగంగా ఆహారాన్ని సేకరించింది. వర్షం తగ్గాక జీవులన్నీ బయటకు వస్తున్నాయి. అలా తనకు దొరికిన ఆహారాన్ని చాలానే సేకరించింది. మీకు తెలుసా? చీమ తన శరీరం బరువుకన్నా 10 రెట్లు ఆహారాన్ని మోయగలుగుతుంది. మిత్రుడ్ని చూసి చాలా ఆనందపడింది. చెట్టు నెమ్మదిగా ఆకులను ఊపింది. చల్లగాలికి సేదతీరి తెచ్చిన ఆహారాన్ని జీవులకు పంచడానికి వెళ్లింది. అందరినీ పేరు పేరునా పలకరించి ఆప్యాయంగా ఆహారాన్ని అందించింది. అదంతా చూసిన వేపచెట్టు మిత్రమా అయిందా. నీకు కొంచెం అన్నా ఉంచుకున్నావా' అడిగింది. నవ్వుతూ. నాకు లేకపోయినా ఫర్వాలేదు. నీ ఆకులను పూలను కొంచెం తినేస్తాలే నాకేంటి నీవు ఉండగా అంటూ నవ్వింది. ఆనందంగా చెట్టు మొత్తం తిరిగింది. దాని కాళ్ల స్పర్శకు వేపచెట్టు ఒళ్లంతా చక్కలిగింతలు వచ్చాయి. ఒళ్లంతా వయ్యారంగా తిప్పుకుంది. వెంటనే గండుచీమ ఆకులతో కప్పేసి పడుకుంది. తల్లి తన బిడ్డను హత్తుకున్నట్లు నూరేళ్లు చల్లగా జీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంది వేపచెట్టు. అలా ఆ రెండు నేస్తాలు చాలా రోజులు కలిసి ఉన్నాయి.మనం గమనించాలే కానీ చెట్లు కూడా నవ్వుతాయి. మనతో స్నేహంగా ఉంటాయి. మనం స్పర్శిస్తే అవి మురిసిపోతాయి. చెట్లను పెంచండి. ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందండి. ఆధారం: మన బడి మాస పత్రిక