గ్రూప్-2 స్థాయి పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే రాతపరీక్షలో 3 పేపర్లుంటాయి. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు, 150 మార్కులు. పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఇది. పేపర్-1 : జనరల్ స్టడీస్ (గెజిటెడ్ సర్వీసెస్) జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి. దైనందిన జీవితంలో సామన్య శాస్త్రం వినియోగం. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర భారత రాజకీయ వ్యవస్థ పాలన, రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి భారత ఉపఖండం – భౌతిక భూగోళశాస్త్రం విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ సహాయంతో విపత్తు అంచనా తార్కిక, విశ్లేషణా సామర్థ్యం, దత్తాంశ అనువర్తన దత్తాంశ విశ్లేషణ ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా విశ్లేషణ. పేపర్-1 :(నాన్-గెజిటెడ్ సర్వీసెస్) జనరల్ స్టడీస్ పేపర్ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక రంగాల్లో సమకాలీన అభివృద్ధి భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారత చరిత్ర స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి భారత ఆర్థిక అభివృద్ధి తార్కిక, విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ అనువర్తన విపత్తు నిర్వహణ సాధారణ విజ్ఞానం (సిబిఎస్ఇ-8, 9 తరగతుల స్థాయి) భారత భూగోళశాస్త్రం- భౌతిక, సాంస్కృతిక జనాభా, ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అంశాలు పేపర్-2: సెక్షన్-1: ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు- చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు – సామాజిక, సాంస్కృతిక సేవ- తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి క్రీ.శ. 11-15 శతాబ్దాల మధ్య సామాజిక- సాంస్కృతిక స్థితిగతులు, తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి, ఆంధ్ర చరిత్ర- సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ. క్రీస్తుశకం 11 నుంచి 16 శతాబ్దం మధ్య ఆంధ్రదేశలో సాంఘిక సంస్కృతిక మతపరమైన పరిస్థితులు. యూరోపియన్ రాక- వాణిజ్య వ్యాపార కేంద్రాలు- కంపెనీ పాలనలో ఆంధ్ర – 1857 తిరుగుబాటు, ఆంధ్రలో బ్రిటిష్ పాలనపై ప్రభావం- సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ/ఆత్మగౌరవ ఉద్యమాలు – 1885- 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం- సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర- జమీందారీ వ్యతిరేక, కిసాన్ ఉద్యమాలు. జాతీయ వాద కవిత్వం.. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి- ఆంధ్ర మహాసభల పాత్ర- ప్రముఖ నాయకులు- 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర. ఆంధ్రప్రదేశ్ అవిర్భావానికి దారితీసిన సంఘటనలు-విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునరవ్యవస్థీకరణ కమిషన్, దాని సిఫార్సులు-పెద్ద మనుషుల ఒప్పందం, 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు. అసఫ్‌జాహీ వంశీయులు- నిజాం రాష్ట్రంలో సామాజిక- సాంస్కృతిక చైతన్యం- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం 1956; 1956- 2014 మధ్య ముఖ్య చారిత్రక సంఘటనలు సెక్షన్-2: భారత రాజ్యాంగం-విహంగ వీక్షణం భారత రాజ్యాంగ స్వభావం- రాజ్యాంగ అభివృద్ధి- భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు- ప్రవేశిక- ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం- ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు- కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు- శాసన, కార్యనిర్వాహక, న్యాయ నిర్వాహక- శాసన నిర్వాహక రకాలు- ఏక శాసనసభ, ద్విశాసనసభ – కార్యనిర్వాహక-పార్లమెంటరీ తరహా, న్యాయనిర్వహణ- న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన నిర్వాహక, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు- రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు- యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు- సంస్కరణల అవసరం- రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచీ కమిషన్, నీతి అయోగ్- భారత రాజ్యాంగ కేంద్ర, సమాఖ్య లక్షణాలు రాజ్యాంగ సవరణ విధానం- కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ- సామాజిక అభివృద్ధి పథకాలు- బల్వంత్రాయ్ మెహతా, అశోక్‌మెహతా కమిటీలు- 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు భారత రాజ్యాంగ పార్టీలు- జాతీయం, ప్రాంతీయం- ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు- ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం- కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్- జాతీయ సమైక్యత- భారత ఐక్యతకు ముప్పు/సవాళ్లు. శ్రీకృష్ణ కమిటీ. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం- ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రొవిజన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు- ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం- జాతీయ రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమిషన్స్- మానవ హక్కుల కమిషన్- సమాచార హక్కు చట్టం- లోక్‌పాల్, లోకాయుక్త పేపర్-3: భారత ప్రణాళికా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు- కేటాయింపులు- ప్రత్యామ్నాయ వ్యూహాలు- లక్ష్యాలు, విజయాలు- వివిధ ప్రణాళికల వైఫల్యానికి కారణాలు – నూతన ఆర్థిక సంస్కరణలు- సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు. భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు- 1986 నుంచి పారిశ్రామిక విధానాలు- ఐటీ పరిశ్రమలు- ఆర్బీఐ అసమతుల్యత, ద్రవ్యలోటు- నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్ అకౌంట్ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సహజ వనరుల లభ్యత- అభివృద్ధి: జనాభా- పరిమాణం, కూర్పు, పెరుగుదల- ధోరణులు, వృత్తిపరమైన శ్రామిక విభజన- మానవాభివృద్ధి సూచి. డెమోగ్రఫిక్ డివిడెండ్ ద్రవ్యం బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా చర్యలు- బ్యాంకులు, పరపతి సృష్టి కారకాలు, పరిష్కారాలు- పన్ను, పన్నేతర ఆదాయం వృద్ధి వివరణ- మాపనాలు: వృద్ధి, అభివృద్ధి, అల్పాభివృద్ధి- అల్పాభివృద్ధి లక్షణాలు- అభివృద్ధి దశలు- మూలధన సమీకరణ వనరులు- వృద్ధి వ్యూహం- అభివృద్ధి-ఎదుగుదల మధ్య తేడా, ఎదుగుదల మాపనం. డిరెగ్యులేషన్, ఎదుగుదల ఆధారము: ఆంధ్రప్రభ లో ప్రచురితమైన కథనం ఆధారంగా