కెరీర్‌కి ఢోకాలేని రంగాల్లో టెక్స్టైల్స్ ఒకటి. విస్తృతమైన అవకాశాలున్న ఈ రంగంలో అభిరుచికి తగిన స్టడీస్ ఆప్షన్ని ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి ప్రొడక్షన్, డిజైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, డైయింగ్...ఇలా నచ్చిన ఏరియాలో కెరీర్‌ని మలుచుకోవచ్చు. విద్యార్హతలు టెక్స్టైల్ డిజైనింగ్‌లో డిగ్రీ పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 55ు మార్కులు సాధించి ఉండాలి. ఒకవేళ ఈ రంగంలో సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్సు చేయాలనుకుంటే 10వ తరగతి పాసైతే సరిపోతుంది. 10వ తరగతి తర్వాత: నేరుగా నాలుగేళ్లపాటు సాగే డిగ్రీ ఇన్ టెక్స్టైల్ డిజైన్ అండ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వొచ్చు. క్లాస్రూమ్ లెక్చర్స్‌తోపాటు స్టూడియో ల్యాబ్స్ కలిపి ఉండే ఈ కోర్సులో ఫ్యాబ్రిక్ రకాలు, తయారీ పద్ధతులు, డిజైనింగ్, డెవలపింగ్, కలర్ డైస్, అల్లికలలో శిక్షణ ఉంటుంది. ఈ డిగ్రీ పూర్తి చేస్తే పొందే ఉద్యోగాలు...ఫ్యాషన్ టెక్స్టైల్ డిజైనర్ ప్రొడక్ట్ డెవలపర్ ఫర్ ఇంటీరియర్ డిజైన్ హోమ్ ఫర్నిషింగ్ టెక్స్టైల్ డిజైనర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇన్స్పెక్టర్ ఫర్ టెక్స్టైల్ వీవర్స్ ఫ్రీలాన్స్ టెక్స్టైల్స్ ఆర్టిస్ట్ టెక్స్టైల్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక మాస్టర్ డిగ్రీ కూడా చేయొచ్చు. ఈ డిగ్రీ పూర్తి చేస్తే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవెల్ నుంచి మేనేజ్మెంట్ లెవెల్ పొజిషన్‌కు త్వరగా చేరుకోవచ్చు. మాస్టర్ డిగ్రీతో పొందే ఉద్యోగాలు... టెక్స్టైల్ సప్లై చైన్ మేనేజర్ టెక్స్టైల్ మార్కెటింగ్ మేనేజర్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ ఆఫ్ టెక్స్టైల్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ అనలిస్ట్ టెక్స్టైల్స్ ప్రొడక్షన్ మేనేజర్. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో... టెక్స్టైల్స్ రంగంలో డిప్లొమా లేదా కోర్సులకు విద్యార్హతలు ఇంటర్ లేదా డిగ్రీ. ఇంటర్ తర్వాత నేరుగా టెక్స్టైల్స్ డిజైనింగ్‌లో డిప్లొమాను అందించే కాలేజీలు కూడా ఉన్నాయి. అయితే ఈ కోర్సులో చేరటానికి ముందు ఎంట్రెన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. ఆ పరీక్షలేవంటే. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సిఈఈడి) నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (ఎన్ఈఈడి) ఎన్ఐడి ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఐఎఫ్టి (నిఫ్ట్) ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ (ఎన్ఎల్ఏటి) ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాసైనవాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో టెక్స్టైల్ డిజైనింగ్ కోర్సుల్లో చేరటానికి అర్హులు. పొందే ఉద్యోగాలు: ఇంటర్ విద్యార్హతతో టెక్స్టైల్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసినవారు...ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంబ్రాయిడరీ డిజైనర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్యాబ్రిక్ డిజైనర్స్ ఫ్యాకల్టీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీల్యాన్స్ డిజైనర్స్ హోమ్ స్టయిలిస్ట్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ మర్చండైజింగ్ అసిస్టెంట్ టెక్స్టైల్ డిజైన్ అసిస్టెంట్. టెక్స్టైల్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్‌లో కూడా 4 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు: ఇంటర్ తర్వాత మూడేళ్లపాటు సాగే డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ/ టెక్స్టైల్ ఇంజనీరింగ్. ఈ కోర్సులో చేరటానికి జెఈఈపి, ఏఐజీఈఈ, గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించటం తప్పనిసరి. యుజి డిగ్రీ కోర్సు: ఇంటర్ తర్వాత నాలుగేళ్లపాటు సాగే బి.టెక్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. దీన్లో జాయిన్ అవటానికి జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అర్హత పొందాలి. ఎమ్.టెక్: యుజి డిగ్రీ తర్వాత రెండేళ్లపాటు సాగే టెక్స్టైల్ ఇంజనీరింగ్. దీన్లో జాయిన్ అవాలంటే గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాసవ్వాలి. పిహెచ్.డి: పిజి తర్వాత సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు సాగే డాక్టొరల్ డిగ్రీ కోర్సు. టెక్స్టైల్ ఇంజనీరింగ్‌తో.. టెక్స్టైల్ డిప్లొమాలు సాధించిన వారికి స్వదేశీ సంస్థల్లో, మల్టినేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు కొదవే ఉండదు. మన దేశంలో ప్లాంట్లు నెలకొల్పుతున్న విదేశీ కంపెనీలకు టెక్స్టైల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థుల అవసరం ఎంతో ఉంటోంది. ఈ ఫీల్డ్‌ను ఎంచుకున్న వారికి ఈ కంపెనీల్లో క్వాలిటీ కంట్రోల్, సేల్స్ టెక్నికల్, ఆర్ అండ్ డి, ప్రొడక్షన్ కంట్రోల్, ప్రాసెస్ ఇంజనీరింగ్, కార్పొరేట్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అండ్ మెయిన్‌టైన్స్ అఫ్ టెక్స్టైల్ మిషనరీస్లలో విస్తృతమైన అవకాశాలుంటాయి. ఉద్యోగ సంస్థలు టెక్స్టైల్ ఇంజనీర్స్కు ఉద్యోగావకాశాలను కల్పించే ప్రముఖ సంస్థలు ఇవే! మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ, గ్రాసిం ఇండసీ్ట్రస్, బాంబే డైయింగ్, ఫ్యాబ్ ఇండియా, అరవింద్ మిల్స్ లిమిటెడ్, జెసిటి లిమిటెడ్, లక్ష్మి మెషిన్ వర్క్స్, లక్ష్మి మిల్స్, భిల్వారా గ్రూప్, రిలయన్స్ టెక్స్టైల్స్, రాజస్థాన్ పెట్రో సింథటిక్స్. ‘బొటిక్’లతో స్వయం ఉపాధి టెక్స్‌టైల్స్‌కు ఫ్యాషన్‌కు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి టెక్స్‌టైల్స్‌తోపాటు ఫ్యాషన్ డిజైనింగ్ కలిపి ఉండే కోర్సులను నేర్చుకుంటే స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ కోర్సులను అందించే కాలేజీల్లో చేరటానికి ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత. మూడేళ్ల కోర్సును అందించే కాలేజీల వివరాలు.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్: మాదాపూర్‌లో ఉన్న ఈ సంస్థ అన్నామలై యూనివర్శిటీ గుర్తింపు పొందింది. ఇక్కడ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ ఫుల్ టైమ్ కోర్సు పూర్తిచేయొచ్చు. హామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్: హిమాయతనగర్‌లో ఉన్న ఈ సంస్థలో డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ రెండేళ్ల డిప్లొమా చేయొచ్చు. లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్: బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థలో రెండేళ్ల ఎమ్మెస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్తి చేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: మాదాపూర్‌లో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేయొచ్చు. స్వయం ఉపాధి ఇలా ఈ ఇన్స్టిట్యూట్లో కోర్సులు పూర్తి చేస్తే ఫ్యాబ్రిక్స్ రకాలు, వాటి కాండినేషన్, కలర్ కాంబినేషన్స్, డ్రెస్సింగ్ స్టయిల్స్, డిజైనింగ్‌ల మీద పట్టు వస్తుంది. సొంత బొటిక్ పెట్టాలనుకునేవారు మొదట తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేసి డిజైన్లు గీసుకుని వాటి ఆధారంగా డ్రెస్‌లు కుట్టించి ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేయాలి. దీన్లో మోడల్స్ చేత డ్రెస్‌లను ప్రదర్శించాలి. దాంతోపాటు ప్రచారం తప్పనిసరి. సొంత బ్రాండ్‌తో బొటిక్ ఓపెన్ చేయటంతోపాటు నూతన ట్రెండ్లకు తగిన దుస్తుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. సీరియల్స్, సినిమాలు డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకోగలిగితే టీవీ సీరియల్స్, సినిమాల్లో నటీనటులకు దుస్తులు డిజైన్ చేసిచ్చే అవకాశాలు కూడా పొందవచ్చు. అలాగే క్రమంతప్పకుండా కొత్త ట్రెండ్స్‌కు తగ్గట్టుగా కొత్త డిజైన్లతో ఫ్యాషన్ షోలు కండక్ట్ చేస్తూ ఉంటే రెగ్యులర్ కస్టమర్లు కూడా ఏర్పడతారు. డిజైనర్‌గా సక్సెస్ కావాలంటే వార్తల్లో వ్యక్తులుగా మారాలి. ఇందుకోసం ఫ్యాషన్ ట్రెండ్స్‌ను గమనిస్తూ దుస్తుల డిజైనింగ్‌లో ఆధునికతను, సంప్రదాయాన్ని సమంగా బ్యాలెన్స్ చేస్తూనే ప్రత్యేక స్టయిల్స్‌ను క్రియేట్ చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దుస్తుల్లో ఏ రకం దుస్తులు మీకు ఆసక్తి కలిగిస్తారో ఆలోచించి ఆ రకాన్ని ఎంచుకుంటే కెరీర్లో ఎదగటం తేలికవుతుంది. డే వేర్, నైట్ వేర్, క్యాజువల్, స్పోర్ట్స్ వేర్, బ్రైడల్ వేర్, ఉమెన్స్ లింగరీ, పిల్లల దుస్తులు, స్కూల్ యూనిఫార్మ్స్...ఇలా దేన్లో మీకు ఆసక్తి ఉందో ఆలోచించి దాన్లో ముందుకు సాగాలి. అలాగే మార్కెటింగ్ మెలకువలు కూడా అలవరుచుకోవాలి. అలాగే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సెల్లింగ్ కూడా చేయగలగాలి. ఆధారము: ఆంధ్రజ్యోతి