ప్రపంచంలో పౌష్టికాహారలోపం గల ప్రతీ ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలోని పౌష్టకాహారలోపం గల పిల్లలలో సగం మంది భారతదెశం, బంగ్లాదేశ్, పాకిస్ధాన్లలోనే ఉన్నారు సబ్ సహారా - ఆఫ్రికాల సరాసరితో పోల్చినప్పుడు ఆహారలోపం గల పిల్లలశాతం భారత, పాకిస్ధాన్లలోనే ఎక్కువగా ఉంది. 5సం||లలోపు పిల్లలలో 47 శాతం మంది బరువు తక్కువ 5సం||లలోపు పిల్లలలో 45 శాతం ఎదుగుదలలేని పిల్లలు 6సం||లలోపు పిల్లలలో 66 శాతం మందికి పైగా పౌష్టికాహారలోపంతో ఉన్నారు. (జిల్లాస్ధాయి శీఘ్ర(రేపిడ్) ఇంటింటి సర్వే వివరాలు డి.ఎల్.హెచ్.ఎస్. 2002 - 05) పూర్వప్రాథమికవిద్య పిల్లలలో, కౌమారబాలికలలో, గర్భిణీస్త్రీలలో 90 శాతం మందికి పైగా రక్తహీనత కన్పిస్తొంది. (డి.ఎల్.హెచ్.ఎస్. 2002 - 05) 2002 - 03 సం|| మధ్యకాలంలో పిల్లలపైన జరిగేనేరాలు 11.1 శాతం పెరిగాయి 6-14 సం||ల మధ్య గల పిల్లలలో 1.26 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు (2001 జనాభా లెక్కల ప్రకారం) 1.34 కోట్లు లేదా 6.94 శాతం మంది *6-14 సం||ల వయస్సు గల వారిలో బడిబయట పిల్లలు ఉన్నారు. మధ్యలోబడిమానేసిన పిల్లలు 62-68 శాతం మంది ఉన్నారు ( 1 నుండి 10 తరగతులవరకు) ( మానవవనరుల విభాగవార్షిక నివేదిక 2005-06) 15సం||లలోపు గల బాలికలు దాదాపు 300000 కనీసం ఒకబిడ్డను కన్నారు (2001 జనాభాలెక్కల ప్రకారం) భారతదేశంలో అప్పుడే పుట్టిన ప్రతీ మూడవ శిశువు హనికరమైన ఆరోగ్య సమస్యలతో అభివృద్ధి చెందని మెదడుతో ఉంటున్నారు. 0-6 సంల మధ్యగల వారిలొ స్త్రీ పురుష శాతం ( సెక్స్ రేషియో ) 927:1000 అయోడిన్ లొపంతో మెదడు దెబ్బతిన్న పిల్లలు 66 లక్షల మంది ఉన్నారు. ఎన్.ఎఫ్.హెచ్.ఎ్‌స ప్రకారం చాలా రాష్ట్రాలలో ఇనుము లోపంతో బాధపడ్తున్న పిల్లలు 70 శాతం కంటె ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విటమిన్ ఎ లోపంతో బాధపడ్తున్న 4 కోట్లమంది పిల్లలలో 15 లక్షల మంది భారతదేశంలోనే గలరు. 4 కోట్ల 70 లక్షల మంది పిల్లలు కచ్చాఇళ్ళలోనే నివసిస్తున్నారు. 7 కొట్ల 70 లక్షల మంది పిల్లలు కొళాయి (నల్లా) మంచినీటిని ఉపయోగించడంలేదు. 8కోట్ల 50 లక్షల మంది పిల్లలు వ్యాధినిరోధకశక్తి లేనివారు. 2 కోట్ల 70 లక్షల మంది అతితక్కువ బరువుతో ఉన్నారు. కోట్ల 30 లక్షల మంది అసలే బడికి వెళ్ళనిపిల్లలు. 18 సం||లోపు జనాభా 42 కోట్ల, 7లక్షలు. ఆధారము: యునిసెఫ్ 2005 నివేదిక మరియు ఇతర యునిసెఫ్ సమాచారంలో ప్రపంచ బాలల స్దితిని “బాల్యం ఆపదలోఉంది” అనే శీర్షిక.