బాలలపై వేధింపులు పై అధ్యయనం- స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007, ఇండియాలో చేసిన ఒక సర్వేలో బాలలు ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు మరియు అత్యాచారానికి గురౌతున్నారని తెలియజేసింది. ఈ వేధింపులు భౌతిక, లైంగిక మరియు మనస్సుకు సంబందించినవి. ఈ అధ్యయనంలో ఈక్రింది విధమైన వాస్తవాలు వెలుగు చూసాయి భౌతిక వేధింపు ప్రతి ముగ్గురి పిల్లలలో ఇద్దరు శ్రమదోపిడికి గురౌతున్నారు. 69% శ్రమదోపిడికి గురౌతున్న పిల్లలలో 54.68% బాలురే. 50% పైగా పిల్లలు ఒకటి లేదా పలురకాలైన శ్రమదోపిడికి గురౌతున్నారు. కుటుంబపరంగా శ్రమదోపిడికి గురౌతున్న పిల్లలలో 88.60% తమ తల్లితండ్రుల ద్వారానే శ్రమదోపిడికి గురౌతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో స్ధిరంగా ఎక్కువ శాతం పలు రకాలుగా బాలలు శ్రమదోపిడికి గురౌతున్నారు. 50.20% బాలలు వారానికి ఏడు రోజులు పని చేస్తున్నారు. లైంగిక వేధింపులు 53.22% బాలలు ఒకటి లేదా పలురకాలైన లైంగికఅత్యాచారాన్ని ఎదుర్కొన్నవారే. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో బాలలు మరియు బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు. 21.90 % బాలలు తీవ్రమైన లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు మరియు 50.76 శాతము ఇతర లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో అత్యధిక శాతం బాలలు లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు. 50% లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్న వారు మరియు బాధ్యతతెలిసినవారే చేయుచున్నారు. మానసిక వేధింపులు మరియు బాలికల పట్ల నిర్లక్ష్యం ప్రతి రెండవ పిల్లవాడు మానసిక వేధింపు కి గురౌతున్నాడు. మానసిక వేధింపులు విషయంలో బాలబాలికలు సమానస్ధాయిలో ఉన్నారు. 83% కేసులలో తల్లితండ్రులే నిందితులు. 48.40% బాలికలు తాము బాలురుగా పుట్టి వుంటే బాగుండునని కోరుకుంటున్నారు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు