డిజిటల్ పాదముద్రలు రక్షించాలి 30 సంవత్సరాల క్రితం ‘కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ అఫ్ ది చైల్డ్’ తో పా World Wide వెబ్ కూడా పుట్టింది. ఆ ఆవిర్భావం ఈరోజటి ప్రపంచపు రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. అలాగే బాల్యానికి, యుక్తవయస్కతకు కొత్త రూపాన్నిచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముగ్గురిలో ఒక పిల్లవాడు రోజూ ఇంటర్నెట్ వాడుతున్నాడు. ఇక ఈ తరంపెరుగుతున్నకొద్దీ, ఆ నిష్పత్తి కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాలను పిల్లలు వాడడంలోని లాభనష్టాలపై చర్చలు మనకు విదితమే. అయితే, పిల్లలు ప్రమాదకరమైన విషయాల జోలికి వెళ్ళకుండా చూడడం, అవతలివారు వారిని బెదిరించకుండా చూడడం లాంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పిల్లలు, తల్లిదండ్రులు తమ స్వవిషయాలను ఈ మాధ్యమాల్లో ఎక్కువగా వెల్లడి చేయడం పట్ల ప్రమాదాలను గుర్తిస్తున్నారు. కానీ నిజానికి, సామాజిక మాధ్యమాల్లో పిల్లలు తమ ప్రొఫైల్స్ లో చూపించే విషయాలు కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. పిల్లల గురించి అంతులేని సమాచారం సేకరించబడుతున్నది. ఆ విషయ సేకరణ ఎందుకు జరుగుతున్నది అనే విషయంపై పూర్తి వివరాలు తెలియక పోయినా, అది చాలా ముఖ్యమైన సమాచారంగా గుర్తించాలి. పిల్లలు వారి ఆన్లైన్ జీవితాల్లో భాగంగా రోజూ సామాజిక మాధ్యమాలను, సెర్చ్ ఇంజన్లను, ఈ-కామర్స్, ప్రభుత్వ వెబ్సైట్లు వినియోగిస్తున్నారు. ఆటలు ఆడుతున్నారు. ఆప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వారు జియో లొకేషన్ సర్వీసెస్ కూడా వాడుతున్నారు. ఇదంతా చేసినప్పుడు వారి సమాచారం కొన్ని వేల శకలాలుగా, డిజిటల్ పాదముద్రలుగా వారి చుట్టూ ప్రోగుపడుతున్నది. పిల్లల సమాచారం కొంత వారు పుట్టకముందే సేకరించబడి, దానిని ఎవరు, ఎలా వాడాలో అనే విషయంలో వారు అనుమతి ఇవ్వకముందే ప్రోగుచేయబడి ఉంటున్నది. "బిగ్ డేటా" యుగంగా పిలువబడుతున్న ఈ సమాచార సేకరణ విధానం. పిల్లలకు సమర్థవంతమైన, వ్యక్తిగతమైన, వేగవంతమైన సేవాసౌకర్యాలను వారి బాగోగుల కోసం అందించగల అవకాశం ఉన్నది. కానీ, అదే సమయంలో అది వారి భద్రత, గుప్తత, స్వతంత్రతలతో పాటుగా వారి భావిజీవితంలో వారు తీసుకోవాల్సిన నిర్ణయాలను దెబ్బతీయగల ప్రతికూల స్వభావం అధికంగా కలిగి ఉంది. మూడవ వ్యక్తులతో లేదా సంస్థలతో మనం పిల్లల చిన్నతనంలో పంచుకుంటున్న సమాచారం తమ లాభాల కోసం వారు ఇతరులకు అమ్ముకోవడమో లేదా యువతి యువకులను ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల పిల్లలను దోపిడికి గురిచేసే అవకాశం ఉన్నది. ఈలోగా మన గుర్తింపు సమాచారం దొంగిలించే వారు, హ్యాకర్లు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో పెద్దలను, పిల్లలను ఏ రకంగా మోసపుచ్చవచ్చో లేదా కొల్లగొట్టవచ్చో అనే విషయం తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడే వారు ఏ వయసు వారైనా సరే వారి ప్రతి కదలికను సెర్చ్ ఇంజన్లు వెంటాడుతున్నవి. అలాగే కొన్ని ప్రభుత్వాలు కూడా ఆన్లైన్లో ఎక్కడ, ఎప్పుడు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మరింత సూక్ష్మంగా నిఘా చేసే అవకాశాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొంటున్నవి. అంతేగాక, చిన్నారుల సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం ద్వారా వారికి భవిష్యత్తులో కల్పించవలసిన విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల అవకాశాలను ప్రభావితం చేయగల సామర్థ్యం పెరుగుతున్నది. పెద్దవారి సమాచార సేకరణ, దాని వాడకం వారి అనుమతులు, గోప్యతల మధ్య సంబంధం క్లిష్టమైనదే కానీ పిల్లల విషయంలో అది రెట్టింపు అవుతుందని మాత్రమే సమాచారాన్ని పంచుకోవడంలోనూ, దానిని గోప్యంగా ఉంచడంలోనూ గల క్లిష్టతను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా స్పందించగలిగిన సామర్థ్యాన్ని కలిగివున్నారు. చాలా తరచుగా, పిల్లలకు వారి స్వంత సమాచారం పైన వారికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, దాని వాడకం వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి, అది వారిని ఎలాంటి ప్రమాదాల్లోకి నెడుతుంది అనే విషయాలు తెలియవు. సామాజిక మాధ్యమాల్లో గోప్యతకు సంబంధించిన నియమనిబంధనలు పిల్లలను వదిలివేసినా బాగా చదువుకున్న పెద్దలకే అవగాహన చేసుకోగల పరిస్థితి లేదు. ది న్యూయార్క్ టైమ్స్ చేసిన ఒక విశ్లేషణలో తేలిందేమంటే సామాజిక మాధ్యమాల్లో గోప్యత పాలసీలు చదవడానికి ఒక సగటు కాలేజీ విద్యార్థికి గల గ్రహణసామర్థ్యం కన్నా ఎక్కువ స్థాయి ఉండాలి. దాని అర్థం. ఎంతోమంది వాడకందారులు ముఖ్యంగా పిల్లలు, యువతీయువకులు వాటిని అర్థం చేసుకోకుండానే వారి అనుమతి ఇస్తున్నారు. ఎందుకు ఆశావహంగా ఉండాలి ఈరోజు మన ముందున్న పెద్ద సవాలు ఏమిటంటే సమాచార భద్రత విషయాలలో ప్రజలందరికీ ముఖ్యంగా పిల్లలకు వారి హక్కులను వినియోగించుకోవడంలో వారు సాధికారత సాధించగల పద్ధతులను రూపొందించి. బిగ్ డేటా, కృత్రిమ మేధస్సుల లాభాలను సంపూర్ణంగా పొందేవిధంగా తగిన హామీ ఇవ్వాలి. ఈ చర్యలు ఆరంభమైనట్లు మనము గమనిస్తూనే ఉన్నాము. ప్రభుత్వాలు నియమనిబంధనల చట్టాలను మెరుగుపరుస్తున్నవి; ప్రైవేటు సంస్థలు వారివారి పాత్ర ఏమిటో గ్రహిస్తున్నవి; ఇంటర్నెట్ ప్రపంచాన్ని సురక్షితంగా వాడడానికి పిల్లలను ఏవిధంగా సమాయత్తం చేయవచ్చో వారు ఆలోచిస్తున్నారు. అయితే, ఇది ఆరంభం మాత్రమే. పిల్లలకు గల ప్రత్యేక గోప్యత హక్కు గురించి 'కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ అఫ్ ది చైల్డ్' స్పష్టంగా చెప్పింది. దానిని ఆన్లైన్ కి కూడా తప్పనిసరిగా వర్తింపజేయాలి. అన్ని హక్కులలోనూ పిల్లల శ్రేయస్సు, అప్పుడే వికసిస్తున్న వారి ఆలోచనాక్రమం మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే పిల్లల సమాచార గోప్యత దాని పరిధిలోనూ, దానిని అమలు పరచడంలోనూ పెద్దవారి సమాచార గోప్యత కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ విషయంలో పిల్లలకు మరింత దుర్భేద్యమైన రక్షణ అవసరము అనే బలమైన వాదన ఉన్నది. పిల్లలు సామాజిక మాధ్యమాలను వాడుతున్నప్పుడు ఇంటర్నెట్లో సేవలు అందించేవారు లేదా వ్యాపారసంస్థలు ఆయా పిల్లల సమాచారాన్ని బయటివారికి తెలపాలా వద్దా అనే విషయం నిర్ణయించుకోవడానికి ఆప్షన్స్ ఉండాలి. అలాగే ఆ సంస్థల నియమనిబంధనలు పిల్లలు అర్థం చేసుకోగలిగినంత స్పష్టంగా ఉండాలి. కొంతమంది పిల్లలే వాదించినట్టు సామాజికమాధ్యమాల్లో వారి వ్యక్తిగత వివరాలు లేకుండా కూడా చేయవచ్చును అనేది ఒక ఉదాహరణ. ఆన్లైన్లో పిల్లల ప్రతి కదలికను, వారి సమాచారాన్ని సేకరించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్పష్టమైన, పారదర్శకమైన, సులభసాధ్యమైన గోప్యతా విధానాలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా కీలకమైనది. ఆ చర్యల ద్వారా పిల్లలు వారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో గుర్తెరిగి వారి అనుమతి ఇస్తారు. అలాగే వారి హక్కులు ఏమిటో తెలుసుకుని వారి సమాచారం ఏ విధంగా సేకరించబడుతుందో, ఏ విధంగా వినియోగించబడుతుందో అర్థం చేసుకుంటారు. వారి డిజిటల్ హక్కులు సాధించుకునేందుకు వీలుగా వారికి అవగాహన ఉండేవిధంగా వారిని సమాయత్తం చేయడం చాలా అవసరం. ప్రైవేట్ సామాజిక సేవలు అందించే ప్రైవేటు రంగ ఇంటర్నెట్ సర్వీసులు అందించేవారు, సామాజిక మాధ్యమాల సేవలు అందించే వారు . పిల్లల రక్షణను బలోపేతం చేయడానికి కీలక కీలకమైన పాత్ర వహిస్తారు. పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిపే కదలికల సమాచారం, వారి బ్రౌజింగ్ అలవాట్లు . మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత సమాచార రక్షణ పట్ల వారు పారదర్శకమైన, నైతికమైన ప్రమాణాలను పాటిస్తూ నిరంతర అజమాయిషీ చేస్తూ ఉండాలి. నూతనంగా రూపొందించిన European General Data Protec-tion Regulation (GDPR) లాంటి నిబంధనావళి ఈ విషయంలో ఓ ముందడుగు. దాని ప్రకారం, పిల్లలతో సహా ఇంటర్నెట్ వినియోగదారులు ఎవరైనా సరే వారికి పారదర్శకమైన, స్పష్టమైన, గోప్యత నోటీసు పొందడానికి హక్కు ఉంటుంది. వారి సమాచారం ఎలా వాడబడుతుందో వారికి తెలపాలి. వారి సమాచారాన్ని ఏవిధంగా పొందుపరచారో తెలుసుకునేందుకుగాను, దాని నిజప్రతిని వారు పొందడానికిగాను వారికి వీలు ఉండాలి. అవసరమయితే, వారి సమాచారాన్ని సరిచేసుకునే వీలు వారికి కల్పించాలి. గ్లోబల్ పల్స్ అనేది ఐక్యరాజ్యసమితి కార్యక్రమం. నూతన డిజిటల్ మూలాధారాలు (sources), తక్షణ-విశ్లేషణ సాంకేతికత (real-time analytics technologies) మొదలైన పరిజ్ఞానం మానవ క్షేమాన్ని, కొత్తగా తలెత్తే అవకాశం గల హానికరమైన విషయాలలో మార్పును అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. తద్వారా ఆయా అంశాలలో అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. గోప్యత, సమాచార రక్షణ విషయంలో సహేతుకమైన పట్టింపులకు జవాబుగా గ్లోబల్ పల్స్ నిపుణులతో సంప్రదించి. అసంబద్ధమైన, న్యాయవ్యతిరేకమైన పద్ధతులలో వ్యక్తుల సమాచారాన్ని మార్చి, వారిని వేరే వ్యక్తులుగా గుర్తించే పరిస్థితులను నిరోధిస్తూ గోప్యతను సహేతుకంగా గౌరవించడం, వ్యక్తిగత గోప్యత రక్షణ, వ్యక్తిగత సమాచారాన్ని వాడుకోవడానికి తగిన అనుమతుల నియమావళిని రూపొందించింది. ఆధారం: మన బడి మాస పత్రిక