ఒక ఊరిలో గోపి, రాజు, రవి అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. గోపి ఏడవ తరగతి, రాజు, రవి పదవ తరగతి చదువుతున్నారు. వాళ్లు రోజు స్కూల్ కి కలిసి వెళ్లేవారు. అయితే ఒక రోజు ఎదాప్రకారంగా స్కూల్ కి వెళ్లే దారిలో వున్న మామిడి చెట్టు పండ్లు కొన్ని కోసుకు వచ్చాడు గోపి. ఇది చూసిన రాజు నువ్వు తోటమాలిని అడగకుండ దొంగతనంగా కోసుకువచ్చావు. తప్పు చేశావు అని రాజు గోపితో వాదించాడు. రవి మాత్రం మౌనంగా ఉన్నాడు. వాళ్లు ఇంతలోపే స్కూల్ కి చేరుకున్నారు. అప్పుడు మిగితా స్నేహితులతో “గోపి దొంగతనంగా మామిడికాయలు…” అంటు చెప్పబోయాడు రవి. “నువ్వు ఏం చెప్తున్నావు?” అని వారించాడు రాజు. అప్పుడు “ఒక్క నిమిషం ఉండరా.” అని రవి “మీకు తెలుసా! గోపి దొంగతనంగా మామిడి పండ్లు కోసుకువచ్చాడు.” అని చెప్పాడు. అప్పుడు అందరూ గోపిని చూసి హేళన చేశారు. “దొంగ, దొంగ.” అని. గోపికి చాలా బాధేసింది. తన ఏడుపును ఆపులేకపోయాడు. సిగ్గుతో ఇంటికి వెళ్లిపోయాడు గోపి. మరునాడు ఉదయం గోపి స్కూల్ కి వస్తుండగా ఒక బిచ్చగాడు స్పృహ లేకుండా పడిపోవడం చూశాడు. మీద నీళ్లు చల్లి గోపికి జాలేసి ఆ బిచ్చగాడి మొహం స్పృహ తెప్పించాడు. ఏమి తిననందునే ఇలా పడిపోయాడు అని గ్రహించి తన దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ ని ఇచ్చేశాడు. ఇది గమనించిన రాజు పాఠశాలకు వెళ్లింతరువాత క్లాసులు జరుగుతుండగా రవి ఉపాధ్యాయుడికి గోపి బిచ్చగాడికి చేసిన సహాయం గురించి చెప్పాడు. అప్పుడు ఉపాధ్యాయుడు, మిగితా పిల్లలందరూ గోపిని మెచ్చుకున్నారు. అభినందించారు. గోపి చాలా సంతోషంతో ఇంటికి వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు.. స్కూల్ లో ఏం జరిగిందో మొత్తం విన్న వాళ్ల అమ్మ, నాన్న గోపిని అభినందించారు. మంచి పని చేసిన కొడుకును మెచ్చుకున్న వాళ్ల నాన్న గోపితో ఇలా అన్నాడు. “ఏకాంతంలో మందలించి నలుగురిలో పొగిడేవాడే నిజమైన మిత్రుడు, నలుగురిలో మందలించి ఏకాంతంలో పొగిడేవాడే శత్రువు.” రాజు నీ నిజమైన స్నేహితుడు మీ ఇద్దరి స్నేహం ఇలాగే ఉండాలని, 'సజ్జన సాంగత్యం ఎల్లప్పుడు మంచిది' అని చెబుతాడు. ఆధారం: ఆర్. జస్వంత