అప్పారావు, సుబ్బారావు ఇద్దరూ తోడు దొంగలు. ఆడవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉండే సమయం చూసి మీ దగ్గర బంగారు నగలేమైనా ఉంటే ఇవ్వండమ్మా మెరుగుపెడతాం. అని నమ్మించే వాళ్ళు. ఆ ఆడవాళ్లు నగలు ఇస్తే మెరుగు పెడుతున్నట్లుగా నటుస్తూ మాటల మద్యలో మంచినీరో, పాతగుడ్డో కావాలని అడిగేవారు. తేవడానికి లోపలికి వెళ్ళగానే నగలతో పారిపోయేవారు. ఒసారి వాళ్ళ దృష్టి సుందరయ్య కాలనీ లో ఉన్న బామగారి మీద పడింది. ఆవిడ కొడుకు కోడలు ఇద్దరికీ ఉద్యోగాలే. పొద్దున వెళ్ళితే రాత్రిగానీ వచ్చావారు కాదు, అది గమనించి దొంగలిద్దరూ ఓరోజు మధ్యాహ్నం వెళ్ళి తలుపుతట్టారు. ఆవిడ తలుపు తీయగానే “బంగారానికి మెరుగు పెడతాం బామ్మగారు! మీ కళ్లెదుట కొత్తవాటిలా చేస్తాం” అన్నారు. “లేకేం? మా ఇంట్లో మా పుట్టింటి వారిచ్చినవి లెక్కలేనన్ని వున్నాయి. సరే తెస్తాను కూర్చోండి” అంటూ బామ్మగారు వాళ్ళని అరుగుమీద కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి నగలు తీసుకొచ్చారు. వాళ్లకి అందిస్తూ...”ఒరేయ్... పెద్దదాన్నని మోసం చేస్తారేమో, నా ముందు దీని బరువు తూచండి. మెరుగు పెట్టాక కూడా బరువు అంతే ఉండాలి. తేడా వస్తే నా చేతిలో చచ్చారన్నమాటే!” అంది. “అబ్బే... మేమలాంటి వాళ్ళం కామండీ!” అంటూ దొంగలు బరువు తూచారు. పది తులాలు తూగింది. ఇద్దరి కల్ళూ మెరిశాయి. మెరుగు పెట్టడానికి ఎంతవుతుందో ముందే చెప్పండి అనక పేచీ పెడితే ఉరికోను అన్నారు బామ్మగారు. మూడొందలండీ, అన్నారు. దొంగలిద్దరూ. మరి నా దగ్గర చిల్లర లేదర్రా మీ దగ్గర ఏడొందలుంటే ఇవ్వండీ. లోపలికి వెళ్ళి వెయ్యి నోటు తెస్తా అన్నారు బామ్మగారు. ఆవిడ లోపలికి వెళితే చాలనుకున్న దొంగలిద్దరూ వెంటనే ఉబ్బు తీసిచ్చారు. ఆవిడ వెళ్ళగానే ఈ హారం ఎంత లేదన్నా రెండు లక్షలు తక్కువుండదు. పిచ్చి బామ్మ తొందరగానే వలలో పడింది అనుకొని ఇద్దరూ ఆ నగ పట్టుకొని పారిపోయారు. పిచ్చి దొంగలు ఎం దుకూ పనికిరాని రోల్డ్-గోల్డ్ హారం కోసం ఏడొందలు వదులుకున్నారు. అయినా ఈ రోజులలో ఇలాంటివి ఎన్ని చూడ్డం లేదు అనుకుంటూ బామ్మ పనిమనిషి మంగని పిలిచి “ఉదయానే కొడుకు ఫీజు కట్టాలన్నావుగా ఇందా” అంటూ మంగ చేతిలో పెట్టింది. రచన: జి. హరికృష్ణ