భూమి చరిత్రలో అలో సమూహవినాశనం (mass extinction) దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న జనాభా అతిగా ప్రకృతి వనరుల వినియోగం వన్యప్రాణులు భారీగా అంతరించి పోవడానికి కారణమని వారు వివరించారు. ఇప్పటికే ఎన్నోరకాల ప్రాంతీయ, స్థానిక జీవరాశులు కనుమరుగయ్యాయి. ఈ అధ్యయనం నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్లో ప్రచురితమైంది. తొలి సమూహం వినాశనం 6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం సంభవించినప్పడు డైనోసార్లు అంతమయ్యాయి. ఆ తర్వాత వివిధ దశల్లో మరో నాలుగుసార్లు సామూహికవిధ్వంసంలో ఎంతో జీవజాలం అంతరించిపోయింది.