జూలై-3-1928: లండన్ లో జూన్ లాగీ బయర్డ్ అధ్వార్యంలో మొట్టమొదటి సారిగా కలర్ టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమైన రోజు. జూలై-4-1934: రెండుసార్లు నోబెల్ బహుమతిని అందుకున్న మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ మరణించిన రోజు. జూలై-6-1929: వార్నర్ బ్రదర్స్ చే రూపొందించబడిన పూర్తి నిడివి మాటలు గల చలనచిత్రం లైట్స్ ఆఫ్ న్యూయార్క్ లోని స్ట్రాండ్ ధియేటర్లో విడుదలైన రోజు. జులై-7-1960: అమెరికా శాస్త్రవేత్త ధోడర్ మైమన్ రూబి కడ్డి మీద మొటమొదట రూపొందించిన లేజర్ (Light Amplification by Stimulated Emission of Radiation) ను ప్రదర్శించిన రోజు. జూలై-9-1819: అమెరికాలోని మసాచెసేట్స్ లో ఇలియాస్ హువే కుట్టు మిషన్ ను రూపొందించారు. జూలై-12-1854: ఫోట్రోగ్రఫిక్ చెందిన రోల్ ఫిల్మ్ ను తయారు చేసిన జార్జి ఈస్ట్ మన్ జన్మించిన రోజు. జూలై-14-1867: ఆమెరికా సర్రిలోని రెడ్ పిల్స్ లో ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనోమైట్ కున్న ప్రేలుడు శక్తిని ప్రయోగాత్మకంగా విజయవంతంగా నిరూపించిన రోజు. జూలై-20-1937: వైర్ లెస్ తేలిగ్రఫిని రుపొందించినందుకు 1909 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన మార్కోనీ మరణించిన రోజు జూలై-18-1635: బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ జన్మదినం . సుక్షదర్శిని సహాయంతో మొక్కల కణాలను పరిశీలించి వాటికి సేల్స్ అని పేరు పెట్టడమేకాక స్ధితిస్ధాపకత ను వివరించంది కూడా ఈయనే. జూలై-27-1844: డాల్టన్ అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ మరణించిన రోజు. జూలై-19-1993: బహుళార్ద సాధక ఉపగ్రహం ఇన్ శాట్ – 2బి ని భారతదేశం ఫ్రెంచ్ గయానా నుండి విజయవంతంగా ప్రయోగించిన రోజు. జూలై-21-1969: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు మేపిన చారిత్రాత్మక దినం. జూలై-22-1822: జన్యుశాస్త్రానికి పునాది వేసిన ఆస్ట్రియా మాట గురువు వృక్షశాస్త్రవేత్త గేగ్రర్ జోహనన్ మెండల్ జన్మదినం. జూలై-29-1973: ఆమెరికాకు చెందిన అంతరిక్ష స్ధావరం స్కైలాబ్ ప్రయోగింపబడిన రోజు. 1979 అక్టోబర్ లో ఇది తన కక్ష్య నుండి బయటికి వచ్చి హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. జూలై-25-1978: ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి లాయిస్ బ్రౌన్ ఇంగ్లండ్‌ల లో జన్మించిన రోజు. ఆధారం: బి. మొక్షానందం