పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడితో బలమైన బంధం వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఉదయాన్నే తూర్పు వైపుకు తిరిగి వుండి ఆ తరువాత సుర్యుడితోపాటు తన దిశను మార్చుకుంటూ వుంటుంది. ఈ దృగ్విషయాన్ని ఫోటోట్రోఫిజం అంటారు. ఫోటోట్రోఫిజమ్ కాంతి ప్రేరణ వల్ల కలిగే పెరుగుదలకు సంబంధించిన ప్రక్రియ. మొక్క కాండంలోని ఆక్సిన్ అనే హార్మోన్ ఈ చర్యలకు మూలం. ఆక్సిన్స్ మొక్కలు పొడుగు పెరగడంలో తోడ్పడతాయి. బీటా ఇండైల్ అసిటిక్ యాసిడ్ (IAA), అమైనో ఆసిడ్స్ నుంచి గానీ, కార్బోహైడ్రేట్ ల విచ్ఛినం వల్ల ఏర్పడే గ్రైకోసైట్స్ నుంచి గానీ ఏర్పడుతుంది. కణకవచంలోని రసాయన బంధాలపై ఆక్సిన్స్ పనిచేసే అది పొడవు పెరిగేట్లు చేస్తాయి. పొద్దు తిరుగుడు మొక్కలో ఒక వైపు నీడ ఏర్పడితే ఆ భాగంలో పెద్దమొత్తంలో ఆక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. మొక్క ఆ భాగం చాలా వేగంగా పొడవు పెరిగేట్లు చేస్తాయి. సూర్య కాంతి లేని వైపు కాండం పొడవు పెరగడం వల్ల సూర్య కాంతి వైపు మొక్క వాలుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది.