మాయాజాల ప్రదర్శన ఆసక్తికరంగా సాగుతోంది. మరో మేజిక్కు మెజీషియన్ సుబ్బు సిద్ధమౌతున్నారు. అక్కడ ఆయనకు ఎదురుగా ఒక టేబుల్ ఉంది. దాని మీద కొన్ని గాజు బీకర్లు వాటిలో కొన్ని ద్రావణాలు కనిపిస్తున్నాయి. మెజీషియన్ చేతిలో ఒక మరుగునాలళిక (పెద్ద పరీక్షనాలిక) ఉంది. తన చేతిని పైకెత్తి ఆ గాజు నాలికను అందరికీ చూపించాడు. “మీకందరికీ విద్యుత్ బల్ఫ్ తెలుసు. స్విచ్ వేస్తే విద్యుత్తు ప్రవహించి బల్బు వెలుగుతుంది. నా దగ్గరున్న గాజు నాలికను చూడండి. నా తెలివితేటలతో ఈ నాలికనే ఒక విద్యుత్తు దీపంగా మారుస్తాను. విద్యుత్తుతో గాని, నూనెలాంటి ఇంధనంతో గాని, నిప్పుతో గాని పనిలేకుండానే అద్భుతమైన కాంతితో ఈ నాలిక వెలిగేలా చేస్తాను చూడండి” అన్నాడు. ప్రేక్షకుల్లోను ఆసక్తి పెరిగింది. మెజీషియన్ చెప్పేది నిజమేనా అని అందరిలో అనుమానం మొదలైంది. మెజీషియన్ మరుగునాలికలో (దాదాపు) సగం దాకా అక్కడ ఉన్న ఒక బీకరులోకి రంగులేని ద్రావణాన్ని పోశాడు. మరో వీకరులో ఉన్న రంగులేని మరో ద్రావణాన్ని అదే నాలికలో కొంచెం పోసి గాజుకడ్డీతో గిలాగిలా కలియబెట్టడం ప్రారంభించాడు. గది తలుపులు మూసేయమని అక్కడున్న వాలంటీరుకు చెప్పాడు. ఇపుడు గదిలో చీకటి. అంతలోనే అద్భుతం! నాలిక ఒక విద్యుద్దీపంలా వెలుగులు చిమ్ముతోంది. నీలం రంగు కాంతిలో మెరిసిపోతోంది. విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. మెజీషియన్ చెప్పింది చేసి చూపించాడు. ఈ మేజిక్ మనం కూడా చేయగలం. చాలా సులువు కూడా. ఇందుకు ముందుగా రెండు ద్రావణాలను తయారుచేసుకోవాలి. ద్రావణం A: 4 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్‌ను 100 మి.లీ, స్వేదన జలంలో కరిగించి ఒక మోలార్ (1M) NaOH ద్రావణాన్ని తయారుచేసుకోవాలి. ఇంకో బీకరులో ఈ ద్రావణం 5 మి.లీ.ను తీసుకొని, 100 మిల్లీగ్రాముల లూమినాల్తో కలిపి కరిగించాలి. ఈ ద్రావణాన్ని స్వేదనజలంతో 1 లీటరుకు విలీనం (dilute) చేయాలి. ద్రావణం B: సుమారు 250 మి.గ్రా. పొటాషియం ఫెర్రిసయనైడ్ (K3Fe(cN)6) ను ఒక బీకరులోకి తీసుకొని కరిగించాలి. దానికి 10 మి.లీ. 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కలిపి గాజుకడ్డీతో కలియబెట్టాలి. స్వేదన జలం కలిపి 1 లీటరుకు విలీనం చేయాలి. ఒక మరుగునాలిక లేదా శాంఖవకుప్పె (Conical Flask) తీసుకొని 100 మి.లీ. ద్రావణం & కు 100 మి.లీ. ద్రావణం B ని కలపాలి. గాజుకడ్డీతో బాగా కలియచబెడితే రసాయన చర్చ జరిపి నీలంరంగు కాంతితో వెలువడుతుంది. ఈ దృగ్విష యాన్ని రసాయన దీప్తి (Chemiluminescence) అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? కొన్ని ఉష్ణమోచక రసాయన చర్యల్లో ఉష్ణం బదులు శక్తి కాంతి రూపంలో వెలువడుతుంది. కాంతి వెలువడే ఇలాంటి కొన్ని రసాయనచర్యలో ఉష్ణం వెలువడదు. దీన్నే చల్లనికాంతి (Cold Light) అంటారు. రసాయన దీప్తి (Chemiluminescence) కేవలం ఉష్ణమోచక చర్యల్లోనే జరుగుతుంది. 3-ఎమైనో థాలోయిల్ హైడ్రొజైడ్ను లూమినాల్ అంటారు. ఇది లేత పసుపు రంగు ఘనపదార్ధం, నీటిలో కరగదు. కాని చాలా కర్బన ద్రావణుల్లో కరుగుతుంది. క్షారం సమక్షంలో లూమినాల్, ఎమైనో థాలేట్ అనే అయాన్‌ను ఇస్తుంది. పొటాషియం ఫెర్రిసయనైడ్ ఏర్పరిచే హెక్సాసయనో ఫెర్రేట్ అయాన్ హైడ్రాజన్ పెరాక్సైడ్ విఘటనానికి ఉత్ప్రేరకంగా పనిచేసి సూపర్ ఆక్సైడ్ రాడికల్ ఆనయాన్ (02)ను ఏర్పరుస్తుంది. ఇది లూమినాల్ను ఆక్సీకరణం చేస్తుంది. ఈ ఉష్టమోచక ఆక్సీకరణ చర్య రసాయనదీప్తిని ప్రదర్శిస్తుంది. వేర్వేరు రసాయనాలను కలిపి వే్వేరు రంగుల కాంతిని రాబట్టుకోవచ్చు. లూమినాల్ బదులు ఉదాహరణకు ఫ్లోరోసిన్తో పసుపురంగు, రోడమిన్-బితో పర్పుల్ రంగు పొందగలము. విశ్తానవని పాఠకులకు విజ్ఞప్తి - రచనలకు ఆహ్వానం శాస్త్ర ప్రచార సవాశయం ఉన్న పాఠకులు, సైన్సుకు సంబంధించిన కథలు, కవితలు, కార్టూన్లు, డ్రాయింగ్డ్, సమకాలీన శాస్త్ర సామాజికపుటంశాలు, శాస్త్రవేత్తల జీవితచరిత్రలు, విజ్ఞానవిశేషాలు, సైన్స్ ప్రయోగం, సైన్స్ మ్యాజిక్, గణిత ఫజిల్స్ తదితర వైజ్ఞానిక రచనలను పంపించగలరు. పోస్టుద్వారానైతే ఎడిటర్, విజ్ఞానవని, టి.ఎల్.ని. భవన్, నిట్, వరంగల్, హన్మకొండ -506004కు లేదా ఇ-వపెయిల్ ద్వారా నైతే < vijnanavani@nitw.ac.in > లేదా వాట్సప్ 8332969704 రచనకు తగిన పారితోషకము ఉంటుంది. విజ్ఞానవని పత్రిక ప్రస్తుతం ఇ-మాస పత్రిక (ఆన్లైన్ మ్మాగజైన్). పూర్తిగా ఉచితం. పాఠకులు ఈ పత్రికను చదవడంతో పాటు, మరింత మందితో చదివించగలరని, విస్తృత ప్రచారం అందించగలరని మనవి. మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, సద్విమర్శలకు ఆహ్వానం. ఆధారం : Vigyan Prasar