“పిల్లలూ! ప్రాచీన కాలంలో గ్రీసు, రోమ్ దేశాల్లోనే కాదు భారతదేశంలోనూ మహా శాస్త్రవేత్తలుండేవారు. వారిని గూర్చి, వారి ప్రతిభా విశేషాల్ని గూర్చి, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడం యంలో వారి పాత్ర గురించి మనమందరం తప్పక తేసుకోవాలి. మొదటగా గణిత, ఖగోళ శాస్త్రాల్లో గొప్ప శాస్త్రజుడైన ‘ఆర్యభట్టను’ గూర్చి తెలుసుకుందాం. సాయిజ్యోతీ! ఆర్యభట్టను గూర్చి నీవు చెప్పమ్మా!” అన్నాడు సైన్సు మాస్టారు శ్రీనివాస్. "అలాగే మాస్టారూ!” అంటూ మొదలు పెట్టింది సాయిజ్యోతి. "ప్రాచీనకాలపు ఖగోళ శాస్త్రవేత్తలలో అత్యంత గొప్పవాడుగా ఆధునిక శాస్త్రవేత్తలచే ఆర్యభట్ట కీర్తించబడుతున్నాడు. ఈయన క్రీ.శ. 5వ శతాబ్దంలో కూసుమపురంలో అంటే నేటి పాట్నాలో జీవించాడు. ఈయన 'ఆర్యభట్టీయం' అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఆర్యభట్ట భూమికి సంబంధించిన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రకటించాడు. అదేమిటంటే, ‘భూమి ఒక గోళాకారంలో ఉన్నది. అది దాని స్వంత అక్షం పై బొంగరం లాగా తిరుగుతున్నది’ అని. అంతేకాదు, గ్రహణాలకు సంబంధించి, సూర్యచంద్రులను రాహువు మింగితే సూర్య, చంద్రగ్రహణాలు వస్తాయనే మతాచార్యుల వాదనల్ని ఖండించి, గ్రహణాలు సూర్యచంద్ర భూములు ఒకే రేఖ పైకి వచ్చినప్పుడు సూర్యకాంతికి చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణమని, సూర్యకాంతి చంద్రుని మీద పడకుండా భూమి అడ్డం వస్తే చంద్రగ్రహణమనీ శాస్త్రీయ వివరణ ఇచ్చాడు. అంతేకాదు చంద్రుడెప్పుడూ కరీ గ్రహమనీ, సూర్యకాంతి చంద్రునిపై పడ్డప్పుడే చంద్రుడు ప్రకాశిస్తాడని కూడా చెప్పాడు. మరో ముఖ్య విషయమేమంటే ఈయన పరిచక్ర సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. దీన్నే ఇంగ్లీషులో ‘థియరీ ఆఫ్ ఎపీసైకిల్స్’ అని కూడా అంటారు. దీని ద్వారా గ్రహాల చలనాన్ని వివరించాడు. ఇన్ని విషయాలను 1600 ఏళ్ళ క్రిందటనే చెప్పడమే ఆర్యభట్ట గొప్పతనం మాస్టారూ.” “ఆర్యభట్ట ఇతర పరిశోధనలను గూర్చి ఏమైనా చెప్పగలవా? అమ్మా!” అన్నాడు మాస్టారు. "గణితంలో ఐక్తంలో ఆయన అనేక సమస్యలు వరిష్కరించాడు మాస్టారూ! p(పై) విలువను 3.1416గా కనుగొని, దాని ద్వారా వృత్త వైశాల్యానికి నంబంధించిన గణిత సూత్రాన్ని కనుగొన్నాడు. స్వేర్రూట్లు, క్యూబ్ రూట్లను కనుగొనే సూత్రాన్ని కనుగొన్నాడు. ట్రిగొనామెట్రీ సూత్రాలయిన సైన్, కొసైన్లను నిర్వచించి, వాటి ద్వారా త్రికోణ సమస్యలను పరిష్కరించాడు.” అన్నది సాయిజ్యోతి. “సాయిజ్యోతి! బాగా చెప్పావమ్మా! ఆర్యభట్టకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని చెబుతాను. అదేమిటంటే ఆయన మహోన్నత గ్రంథం ‘ఆర్యభట్టీయం’ 1847 వరకూ, అంటే దాదాపు 1300 సంవత్సరాల పాటు, అసలు శాస్త్రవేత్తలకెవరికీ దొరకలేదు. ఆయనను సమర్థిస్తూ లేక విమర్శిస్తూ, రాసిన గ్రంథాల నుండి మాత్రమే ఆయన నిరూపించిన విషయాలు ప్రజలకు తెలిశాయి. పురాణ గ్రంథాలకు నకళ్ళు తీసి అనువాదాలు చేసి, వాటిని కాపాడుకున్న మన పండితుల శాస్త్రీయ విషయాలంటే ఎంత నిర్లక్ష్యం చేసే వారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.” అని ఒక నిట్టూర్పు విడిచి “తర్వాత మనం మరో ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త వరావమిహిరుడిని గూర్చి తెలుసుకుందాం. అభినంద్! నీవు చెప్పు.” అన్నారు మాస్టారు. “వరాహ మిహిరుడు 6వ శతాబ్దం వాడు మస్టారూ! ఈయనను ఖగోళ శాస్త్రజ్ఞులూ, చరిత్రకారులూ ‘ఖగోళ శాస్త్ర విజ్ఞాన సర్వస్వం'గా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఈయన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులైన పైతామహ, వశిష్ఠ, పౌవిస, రోమక, సూర్యులు రచించిన సిద్ధాంత గ్రంథాలన్నింటి సారాన్నీ మధించి ‘పంచ సిద్ధాంతిక’ అనే పెద్ద గ్రంథాన్ని రచించాడు. విశేషమేమంటే పైన పేర్కొన్న పంచసిద్ధాంతాలలో పైతామహ, వశిష్ట సిద్దాంతాలు ఖగోళ శాస్త్ర సత్యాలకు చాలా దూరంగా ఉన్నాయని వరాహమిహిరుడే పేర్కొన్నాడు. భూమి స్వరూపాన్ని గూర్చి వరాహమిహిరుడు వివరిస్తూ, “అన్ని అంశాలూ భూమి గోళాకారంగా ఉన్నదని నిరూపిస్తున్నాయి. పర్వతాలు, నదులు, చెట్లు, మనుష్యులు, అన్ని వస్తువులు భూమికి పైనా కింద అన్ని వైపులావున్నాయి. కాని, అందరూ ఎవరికి వారు నేను భూమిపైన ఉన్నాను. మిగిలిన వారు వేరే వైపు ఉన్నారు.” అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే భూమి అందరినీ ఆకర్షిస్తున్నది అని తెల్పాడు. ముఖ్యమైన విషయం ఏమిటం భూమి చలనానికి సంబంధించి వరాహమిహిరుడు, ఆర్యబట్టతో విభేదించాడు. ఆయన భూమి ఈ విశ్వానికి కేంద్రంలో ఉన్నదని, దానికి చలనం లేదని అన్నాడు. దీనికి కారణ మతమౌఢ్యం కాదు. ఆయనకున్న లౌకికజ్ఞానం మాత్రమే. భూమి తన చుట్టూ తాను తిరగటం వాస్తవమే. పడమర వైపుగా బయలుదేరిన పక్షి తన గూటికి తాను ఎన్నటికీ చేరుకోలేదు అని ఆయన వ్రాశాడు.” అలా ముగించాడు అభినంద్. “వరాహమిహిరుడిని గూర్చి ఇంకేమైనా తెలుసా?” అడిగాడు మాస్టారు. అభినంద్ మౌనం వహించాడు. “నేను చెబుతాను.” మాస్టారు చెప్పడం మొదలెట్టాడు. “ఈయన ఖగోళశాస్త్రంలోని గ్రహాల చలనా గణించి, వాటి ద్వారా మానవుల జాతకలను ‘జ్యోతిష్యము' అనే అంశాన్ని వివరిస్తూ ‘బృహత్ జాత్’ అనే జ్యోతిష గ్రంథాన్ని వివరించాడు. దీనిలోని విశేషాలేమిటంటే, భూమికి చలనం లేదనే అంశం మొదటిది. భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, అంగాకారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనే గ్రహాలే తిరుగున్నాయని పేర్కొన్నాడు. ఆయన గ్రంధంలో రాహు, కేతువుల ప్రస్తావనే లేదు. ఇలా చలనమున్న భూమిని చలనం లేనిది భూమి చుట్టూ చంద్రుడు తప్ప సూర్యుడు గానీ ఇంద్రుడు, వంటి గ్రహాలు గానీ తిరగకపోయినా తీరుగుతున్నట్లు ప్రకటించిన బృహత్ జాత్ శాస్త్రీయమా? అశాస్త్రీయమా?” మరల అడిగారు మాస్టారు. “అశాస్త్రీయ గ్రంథమే!” అన్నారు పిల్లలందరూ. “వరాహమిహిరుడు భూమి చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నాయంటాడు. నేటి జ్యోతిష పండితులు తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయంటారు. వీటిలో సూర్యుడు ఒక గ్రహమే కాదు, అది ఒక నక్షత్రం. ఇలా పరస్పర విరుద్ద విషయాలు, అజ్ఞానంతో కూడిన విషయాలూ కలిగిన అంశం శాస్త్రమా?” "శాస్త్రం కానే కాదు” అన్నారు పిల్లలందరూ. “మంచిది. అనేక ఖగోళ శాస్త్ర గ్రంథాలను మధించి, ఒక బృహత్ గ్రంథాన్ని రాసిన వరాహమిహిరుడిని ప్రాచీన కాలపు మహా శాస్త్రవేత్తలలో ఒకడైన ఖగోళ శాస్త్రవేత్తగా అంగీకరిద్దాం. ఆయన వ్రాసిన అశాస్త్రీయ విషయాలను తిరస్కరిద్దాం. ఏమంటారు?” అడిగారు మాస్టారు. “అలాగే మాస్టారూ.” అన్నారు గట్టిగా పిల్లలందరూ. “మంచిది. తర్వాతి క్లాసులో మరో భారతీయ ప్రముఖ ఖగోళ, గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడిని గూర్చి తెలుసుకుందాం'' అంటూ లేచారు మాస్టారు. పిల్లలు ఆయనను అనుసరించారు. ఆధారం : కె. ఎల్. కాంతారావు