ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. తన చుట్టు ప్రక్కల వారికి చాలా డబ్బుంది. అయినా అతడు తనకే ఇంకా డబ్బు ఉన్నట్లు గర్వపడతాడు. కాని తనకు ఇంకా డబ్బు కావాలని ఆశపడతాడు. దాని కోసం అతడు డబ్బు ఖర్చు చేయడం మానేస్తాడు. బిచ్చగాండ్లకు దానమివ్వడు. పైగా వారి చేతిలో డబ్బులను లాక్కొంటాడు. పాపం ఆ బిచ్చగాండ్లు ముఖం మాడ్చుకొని వెళ్లిపోతారు. రోజూ అన్నం వండితే డబ్బు అయిపోతుందేమోనని తన ప్రెండ్స్ ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళి భోంచేస్తాడు. రోజూ ఇతనికి అన్నం పెట్టలేక ఆ స్నేహితులు తమ తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోతుంటారు. అయితే ఇతడు ఇంకా డబ్బు సంపాదించడానికి ఏం చేయాలో తెలియడం లేదు? అందుకు తన చుట్టు ప్రక్కల వారిని అడిగితే తీర్థయాత్రలు చేయడం వల్ల దేవుళ్ళు, దేవతలు ప్రత్యక్షమై వరాలు ఇస్తారని చెప్పారు. అందుకు ఇతడు తిరుపతి, అన్నవరం తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు. తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. వెంటనే అతడు కాసేపు ఆలోచిస్తాడు. ఆలోచించి, ఆలోచించి “బంగారు గుడ్డు పెట్టే బాతు, అడిగిన వెంటనే ధనం ఇచ్చే సంచి” ఇమ్మని అడుగుతాడు. వేంకటేశ్వర స్వామి అతనికి “రోజుకు ఒక గుడ్డు పెట్టే బాతును, అడిగిన వెంటనే 1000 రూపాయల ధనం ఇచ్చే సంచిని” ప్రసాదిస్తాడు. అతను వాటితో తిరిగి ఇంటి కొచ్చేస్తాడు. అతని జీవితం సుఖమయంగా సాగిపోతుంది. కాని ఇతనికి ఇంకా డబ్బు కావాలని ఆశ పుడుతుంది. బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుందని, ఆ బాతులో ఇంకా ఎన్ని గుడ్లు ఉన్నయో అన్ని తీసుకుందామని, కత్తితో ఆ బాతుని కోస్తాడు. బాతు చనిపోవడంతో వెంటనే వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. అపుడు అతను “ఈ సంచిలో అడిగిన వెంటనే 1000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే సంచి ఇవ్వు స్వామి” అని అంటాడు. అపుడు వేంకటేశ్వర స్వామి అతని మూర్ఖత్వమును తెలుసుకొని ఆ సంచితో పాటు మాయమైపోతాడు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. అతడు ఆలోచించి లిస్టు రాయడం మొదలెడతాడు. అతడు సాయంత్రం వరకు రాస్తూనే ఉంటాడు. అపుడు సత్యనారాయణ స్వామి “సమయం ఆసన్నమైంది, భక్తులు నన్ను దర్శించుకోడానికి వస్తారు. నేను వెళ్తున్నాను నీవు రేపు మళ్ళీ ఇదే సమాయానికి రావడం మంచిది” అని అంటాడు. ఆ ధనవంతుడు ఇలా పేజీలు, పేజీలు వరాలు రాస్తాడు. అంతలో అతనికి ఉపాయం వస్తుంది. స్వామి ప్రత్యక్షమవుతాడు. అతడు “ప్రక్క ఊరి రాజా గారి ఆస్థికి రెట్టింపు కావాలని అడుగుతాడు. అతడు కోరినట్లుగానే బోలెడంత ఆస్తి వస్తుంది. కాని అతనికి చూడడానికి కళ్లులేవు? కారణమేమిటి? ఆలోచించండి? జవాబు : ధనవంతుడు ప్రక్క ఊరి రాజా గారి ఆస్తికి రెట్టింపు కావాలని కోరాడు. విచిత్రమేమిటంటే ఆ ప్రక్క ఊరి రాజా గారికి ఒక గ్రుడ్డి కన్ను ఉంది. రచన: పితాని నాగరాజు, పి.ఇ. చిన్నాయి పాలెం, తూ,గో.జిల్లా.