శాస్త్ర సాంతేతిక రంగాలలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని ఆశలో ఆశ్చర్యం లేదు. ముదప పారిశ్రామిక విప్లవానికి మధ్య స్పష్టమైన దీర్చకాలిక వ్యవధి ఉన్నా ఐదవ పారిశ్రామిక విప్తవం మాత్రం 2011లో ప్రారంభమైన నాల్గవ విపష్టవం తర్వాత చాలా త్వరితగతిన పరిణమించింది. పారిశ్రామిక రంగంలో స్వయంచోదకత (Automation) ప్రవేశించిన దరిమిలా పారిశ్రామిక విప్లవాల మధ్య చెప్పుకోదగినంత కాలవ్యవధి ఉండడం లేదు. కృత్రిమ మేధోవంతమైన ఆధునిక యంత్రాలు, విజ్ఞానభరితమైన వ్యవస్థలు, ఉత్పత్తి సేవా రంగాలు తదితర ఎన్నో వ్యవస్థలలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. కృషత్రిమమేధ, జీవవైద్య పరిశోధనలు తదతర ఆధునిక పోకడలు కోవిడ్ వంటి మహమ్మారిని అరికల్టేలా టీకా అభివృద్ధికి దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభానికి గురి చేసినది. అది పూర్తిగా సమసిపోయిందనుకున్న తరుణంలోనే కొంగ్రొత్త వైరస్లు ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల కృషి వల్ల కోవిడ్ వ్యాధిని దీటుగా ఎదుర్కోగల్లుతున్నాము. సైన్స్ ప్రచారం ద్వారా ప్రజానీకంలో వ్యాధి విస్తరణ, నివారణల గురించిన అవగాహన పెంచగలిగాము. గత మే నెలలో పారిశ్రామిక రంగానికి ఎలాగైతే సామాజిక బాధ్యత (Corporate Social Responsibility -CSR) ఉందని నిర్దశించారో అలాగే శాస్త్ర పరిశోధనలో కూడా అదే విధమైన సామాజిక బాధ్యత (Scientific Social Responsibility -SSR) ఉండేలా భారత ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక ప్రయోజనంతో పాటు ఎప్పటికప్పుడు శాస్త్ర పరిశోధనల గురించిన సమాచారం సాధారణ ప్రజానికానికి అందేలా చూడడం SSRలో అంతర్భాగం. సహజంగానే ఇది విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ఒక సవాలు. ఆంగ్లమాధ్యంతో పాటు ఇతర భారతీయ భాషలలో శాస్త్ర ప్రచారానికి ఎంతో ఆవశ్యకత ఉంది. అయితే పప్రజాబాహుళ్యానికి అర్థమయ్యేలా ఆధునిక పరిశోధనా కార్యకలాపాలను, ఫలితాలను అవగతం చేయడం ఏమంత సులభం కాదు. శాస్త్రవేత్తలకు, యువ పరిశోధకులకు ఈ దిశలో శిక్షణ అవసరం. కష్టంతో కూడుకున్నదైనా స్మోప్ ప్రాజెక్టు ద్వార ఈ ఆశయానికి వాస్తవ రూపాన్స్ని ఇవ్వడానికి కృషి చేస్తున్నాము. ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా సైన్స్ ప్రచారానికి ఉపకరించేలా యువతకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నాము. దేశంలోని ప్రతి పరిశోధనా సంస్థలో, ప్రతి ఉన్చత విద్యాసంస్థలో, ప్రతి విశ్వవిద్యాలయంలో స్కోప్ నిపుణులు ఒకరైనా ఉండేలా విరివిగా శిక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. శాస్త్ర ప్రచారంతో పాటు ఉపాధి కల్పనకు కూడా ఈ కృషి దోహదపడుతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా అనేక ఆధునిక వైజ్ఞానికపు టంశాలు ఇతివృత్తంగా 52 ఎపిసోడ్లతో (ఏడాదిపాటు ప్రతివారం) ఆకాశవాణి సహకారంతో రేడియో ప్రసారాలను విజ్ఞాన్ ప్రసార్ కొనసాగిస్తోంది. తాజాగా నడుస్తున్న “కృత్రిమమేధ: భవిష్యత్తుకు స్వాగతం (Artificial Intelligence: Welcome Tomorrow) ” అంశం తొందరలో ముగియనుంది. 19 భారతీయ భాషల్లో సుమారు 120 MW, డజను FM రేడియో కేంద్రాల ద్వారా ఈ అంశంపై విజ్ఞాన్ ప్రసార్ ప్రసారం చేసింది. ఈ అంశంతో పాటు గత 15 సంవత్సరాలుగా తెలుగులో వెలువడ్డ అన్ని రేడియో ప్రసారాలను సమన్వయం చేసిన వారు ప్రొ! కె. లక్ష్మారెడ్డి, ప్రస్తుత స్కోప్ ప్రాజెక్టు ప్రధాన పరిశోధనలు, ఈ పత్రిక సంపాదక వర్ణ సభ్యులు. ఈ ఎపిసోడ్ల నిర్వహణలో జనవిజ్ఞాన వేదిక తెలంగాణా సహకారం వెలకట్టలేనిది. అతి త్వరలో “ఆత్మ నిర్భరత (Self Reliance)” అంశం ఇతివృత్తంగా ప్రసారాలు సాగనున్నాయి. వేచి చూడండి. ఆధారం : Vigyan Prasar