మేఘ సందేశం, హంస సందేశం విన్నారా! రాజులు రహస్య సమాచారం పంపడం కొసం ఉత్తరాలను చారులు ద్వారా (CID), పావురాల ద్వారా పంపేవారు. ఒక్కొక్కప్పుడు ఈ ఉత్తరాలు శతృవుల చేతికి చిక్కి ప్రమాదాలు జరిగేవి. మీరు మీ స్నేహితునికి వ్రాసిన ఉత్తరం అతను మాత్రమే చదివేలా ఇతరులు ఉత్తరం చూచినా వారికంటికి కనిపించకుండా వుండేలా, జ్ఞాన నేత్రం గల మీ స్నేహితుడు మాత్రమే చదువగల సిరా వుంది. ఏమిటా సిరా? ఏమిటా జ్ఞాన నేత్రం ? రండి చేసి చూద్దాం. వ్రాయవలసిన విషయాలు కాగితం రెడీగా వుంచుకోండి. మారి మన అదృశ్య సిరా మాటేమిటి? ఏమి లేదు చాలా సింపుల్. నిమ్మకాయ రసం కానీ, ఎలిగడ్డ (ఉల్లిపాయ, onion) రసం కాని లేక వెనిగర్ కానీ తీసుకోండి. ఈ మూడు ద్రవాలు కూడా అదృశ్య సిరలుగా పనిచేస్తాయి. పై రసాలలో ఏదో ఒక దానిని తీసుకోని దానిలో పుల్లగాని Painting బ్రష్ గాని ముంచి కాగితం పై విషయం వ్రాసి ఎండబెట్టండి. అంతే అక్షరాలు మాయం అవుతాయి. మారి మీ మిత్రుడు దానిని చదవడం ఎలా! అది సులభమే. పటములో చూపిన విధంగా క్రోవ్యోత్తి అంటించి ఆ మంట దగ్గరగా పై కాగితాన్ని పట్టుకున్నట్లయితే కాగితం వేడేక్కి దాని పై గోధుమ రంగు (Brown) లో ఇది వరకు మీరు రాసిన సమాచారం కానబడుతుంది. అసలేం జరిగింది? వెనిగర్ గానీ, నిమ్మరసం కానీ, ఉల్లిపాయ రసం కానీ కాగితంతో చర్య పొంది సెల్లో పెన్ లాంటి పదార్ధం తయారు అవుతుంది. ఈ పదార్ధం యొక్క మండే ఉష్నోగ్రత పేపరు ముక్క మండే ఉష్ణోగ్ర కంటే తక్కువ కనుక పేపరు కాలకముందే రసంతో రాసిన అక్షరాలు వేడెక్కి మనకు గోధుమ రంగులో కనిపిస్తాయి. అదే అదృశ్య సిరా రహస్యం......... ఆధారం: యుగంధర్