మెజిషియన్ సుబ్బు కెమిస్ట్రీ మేజిక్ కు సిద్ధమయ్యారు. విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెజిషియన్ వేదిక మీదకి రాగానే అంతా లేచి నిలబడ్డారు. టేబుల్ మీద క్రొవ్వొత్తి, ఊదా రంగు ద్రావణం ఉన్నాయి. మెజీషియన్ ముందు వరుసలో కూర్చున్న భరత్ చేతిలో ఉన్న సైకిల్ తాళంచెవిని అడిగి తీసుకున్నాడు. నీపేరు భరత్ కదూ. నీ సైకిల్ తాళం చెవి మీద నీ పేరు చెక్కుతాను చూడు అని చెప్పాడు. రసాయనాలతో పేరు ఎలా చెక్కుతారు? అని అంతా అనుకున్నారు. మెజీషియన్ ఆ తాళంచేవిని ముందుగా పాలిష్ చేశాడు. టేబుల్ మీద ఉన్న కొవ్వొత్తిని వెలిగించి కరిగిన మైనాన్ని తాళం చెవి మీద పడేలా చేశాడు. తర్వాత తాళంచెవిని కొద్దిగా వేడిచేసి, ఒక సూదితో దాని ఏదో రాసినట్లు అందరికీ కన్పించింది. తర్వాత టేబుల్ మీద ఉన్న సీసాలో డ్రాపర్ ముంచి, ఆ ద్రవాన్ని కొన్ని చుక్కలు తాళంచేవి మీద పడేట్లు చేశాడు. ఇలాగే మరో పడేట్లు చేశాడు. ఇలాగే మరో ఇద్దరి దగ్గర నుంచి కూడా వారి దగ్గర ఉన్న కీచైన్ రింగు, తాలంచేవిని తీసుకొని వాళ్ళ పేరు రాస్తానన్నాడు. ఇంతకు ముందు చేసినట్టుగానే చేశాడు. కొంతసేపు విద్యార్థుల్ని కొన్ని ప్రస్నలడుగుతూ వారికి కెమిస్ట్రీ లో అవగాహన కలగజేశాడు. ఇలా కొతసేపు చర్చ జరిపిన తర్వాత, మొదటి తాళంచేవిని తీసుకొని దాని మీదున్న మైనం పొరను తీసివేశాడు. తాళంచెవి మీద భారత్ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ చప్పట్లు కొట్టారు. మిగితా వాటి మీద కూడా ఇలాగే వారి పేర్లు కన్పించాయి. ఇదొక కెమిస్ట్రీ మేజిక్. ఇది చేయడం చాలా సులభం. ఇందుకు కావల్సినవి కొవ్వొత్తిని కరిగించి కరిగిన మైనంను దాని ఉపరితలంపై పడేలా చేయాలి. ఆ ఇనుప వస్తువును కొద్దిగా వేడిచేస్తే దానిపై మైనం ఒక పల్చని పొరలాగా ఏర్పడుతుంది. మైనం చల్లారిన తర్వాత ఒక సూదిలో లోహాన్ని తాకేలా ఏదైనా బొమ్మ లేదా కొన్ని అక్షరాలు రాయాలి. ఇప్పుడు ఈ గీత లేదా రాత వల్ల మైనం పొరలో గాట్లు ఏర్పడ్డాయి. ఈ గాట్లలో ఒక డ్రాపర్ తో అయోడిన్ ను చుక్కలుగా పోయాలి. కొన్ని క్షణాల్లో అయోడిన్ వివర్ణమవుతుంది. ఒక గంట తర్వాత మైనం పొరను తొలగించి చూడాలి. మీరు గీసిన బొమ్మ లేదా రాసిన కీ చైన్ రింగు మీద కూడా మీ పేరు చెక్కినట్లుగా రాసుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక రసాయన చర్య ఇందుకు కారణం. అయోడిన్ ఇనుముతో చర్య జరిపినప్పుడు ఫెర్రస్ అయోడైడ్ ఏర్పడుతుంది. ఇది ఒక చూర్ణం కాబట్టి వస్తువు ఉపరితలం నుంచి రాలిపోతుంది. లోహం మీద చెక్కినట్లుగా మైనం అడుగున గీసిన బొమ్మ లేదా రాసిన పదం కనిపిస్తుంది. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం