థర్మాకోల్ బాల్స్ సాదారణంగా తేలికగా ఉంటాయి. కాబట్టి వీటిని జండా ఎగురువేసినప్పుడు, పెళ్లి తలంబ్రాలలో ఉపయోగిస్తారు. కానీ మన ప్రయోగానికి కూడా ఉపయోగపడుతాయి. ఇవి ఉన్నట్టు ఉండి ఆశ్చర్యం కలిగేలా ప్రవర్తిస్తాయి. ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలుసుకుందామా. కావల్సిన వస్తువులు: ప్లాస్టిక్ సంచి, థర్మాకోల్ బాల్స్, దారం. చేయు విధానం: కొన్ని థర్మాకోల్ బాల్స్ తీసుకొని పారదర్శకత గల ప్లాస్టిక్ సంచిలో పోసి రెండు చేతులతో వెడల్పు చేసి పటంలో చూపినట్లు, నిండా గాలి ఉండునట్లు దారంతో సంచి మూతని బంధించండి. సంచి మూతిని పట్టుకొని అటు ఇటు బాగా కదల్చిండి. అందులో ఉన్న థర్మాకోల్ బాల్స్ సంచికి బాగా రాపిడి కావించబడ్డాయి. థర్మాకోల్ బాల్స్ సంచికి అంటుకుపోతాయి. మీ చేతి వేళ్ళను ఆ బాల్స్ దగ్గరకు తీసుకువెళ్ళండి. బాల్స్ ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు గంతులేస్తాయి. ఎందుకలా జరుగుతుంది? ఆలోచించండి. ఇదేకృత్యం మీ మిత్రునికి ఇచ్చి చేయడానికి ఇబ్బంది పడడం తనవంతు నవ్వుతూ ఉండడం మీ వంతతవుతుంది. మీ మిత్రునికి ఇచ్చేటప్పుడు మీరు చేసినప్పుడు అందులో నింపిన గాలిని తీసివేయండి. మళ్ళీ దానిలోకి గాలిని నింపాలి కదా, అప్పుడు నోటితో దాని నిండా గాలి ఉది మూతి బిగించి ఇవ్వండి. ఎంత సేపటికి, తను సంచిని అటూ ఇటూ కదిపినా థర్మాకోల్ బాల్స్ మీరు చేసినప్పుడు అంటుకుపోయినట్లుగా సంచికి అంటుకుపోవు. అన్నీ కుప్పగా ఒక దగ్గరకు చేరిపోతాయి. ఎందుకు లా జరుగుతుందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంతకూ థర్మాకోల్ బాల్స్ సంచికి దుకు అంటుకున్నవి? చేయని పెట్టినప్పుడు ఎందుకు గంతులేసినవి? వివరణ: సంచిలో థర్మాకోల్ బాల్స్ ను సంచిలో వేసి అటూ ఇటూ ఉపినప్పుడు రాపిడి జరిగి స్థిరవిద్యూత్ ఏర్పడుతుంది. మన శరీరం కూడా కొంత విద్యూత్ ను కలిగినట్లు చూపుతుంది. అందువలననే ఒక చేటనుండి మరొక చోటకు గంతులేస్తుంది. మీరు మెదటిసారి చేసినప్పుడు చేతులతో వెడల్పు చేసి గాలిని సంచిలోకి పంపించారు. కానీ, మీ మిత్రునికి ఇచ్చినప్పుడు గాలిని నోటితో ఉది ఇవ్వడం వలన దానిలోకి కొంతనీటి ఆవిరి కూడా చేరుతుంది. నీటి ఆవిరి, అందులో ఏర్పడిన విద్యుత్తును గ్రహిస్తుంది. అందుకే థర్మాకోల్ బాల్స్ సంచికి అంటుకుపోవు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆధారం: శ్యామ్ సుందర్ రెడ్డి