ఉద్దేశ్యం: పేపరుతో తయారు చేసిన పాత్రలో నీటిని తీసుకొని పేపరును వేడిచేసి నీటిని మరిగించడం. కావలసిన సామగ్రి: త్రిపాది స్టాండు, పేపరు, క్లిపులు క్యాండిలు. ప్రయోగ విధానం: పేపరును పడవ ఆకారంలో పాత్రలాగా తయారు చేసుకొని, క్లిపులు అమర్చాలి. దాని నిండ నీటిని నింపాలి. నీటితో నింపిన పేపరు పాత్రను త్రిపాది స్టాండుపై ఉంచాలి. క్యాండిలు సహాయంతో నీటిని వేడిచేయాలి. పేపరు కాలకుండా నీరు మరగడాన్ని గమనించండి. పరిశీలనలు: పేపరు కాలకుండా నీరు మరగడానికి గల కారణము పేపరు పాత్ర వేడి చేస్తున్నప్పుడు ఆ ఉష్ణోగ్రతను నీరు స్వీకరిస్తుంది. ఎందుకంటే పేపరుకున్న నీరు మంచి ఉష్ణవాహకము. కాబట్టి నీరు ఉష్ణాన్ని గ్రహిస్తూ 100oC వద్ద మరుగుతుంది. నీరు మొత్తం మరిగే వరకు పేపరు కాలదు, ఎందుకనగా అది కాలాలంటే 400oC పైచిలుకు ఉష్ణోగ్రత అవసరం. అంటే పేపరుకు ఆ ఉష్ణోగ్రత లభించదు. ఉపయోగాలు: నీటిని వేడిచేయడానికి పేపరు పాత్రను ఉపయోగించిన ఎక్కువ శక్తి వృధా కాకుండా యుంటుంది. తద్వారా ఇంధనాన్ని పొదుపు చేసుకోవచ్చు. మీకు తెలుసా? లోహాలు మంచి ఊష్ణ వాహకాలు. ఆధారం: కె. లక్ష్మారెడ్డి