మన ఇంట్లోని పనికిరాని వస్తువులతో మనం రకరకాల అలంకరణ సామాగ్రిని తయారు చేసుకోవచ్చును. అందులో (ఫిలమెంటు కాలిపోయిన) ఎలక్ట్రిక్ బల్బుతో కుందేలును తయారు చేయడం కూడా ఒకటి. ఒక ఎలక్ట్రిక్ బల్బు, దూది, జిగురు, మిరియాల గింజలు, కత్తెర, ఇంకా కొన్ని బందీలు ముందుగా బల్బుని తీసుకొని జిగురు సాయంతో దానిపై అంతటా దీనిని అతికించండి. ఇలా చేసేటప్పుడు బల్బు మీద కొద్దిపాటి ప్రదేశాన్ని కూడా విడిచిపెట్టకండి. కుందేలు ముఖంలాగా మార్చే భాగంలో కొంచెం ఎక్కువగా దూదిని అతికించండి. ఆ తరువాత కత్తెర సాయంతో కుందేలు చెవుల ఆకారంలో ఒక రెండు దూది ముక్కలను (పట్టీలను) కత్తిరించండి. ఈ పట్టీలను కుందేలు చెవుల స్థానంలో అతికించండి. ఇదయ్యాక కుందేలు తాలూకూ కాళ్ళస్థానంలో ఓ నాలుగా దూదివుండలను అతికించండి. అలాగే దానితోక స్థానంలో కూడా ఒక దూదివుండను అతికించండి. ఒకవేళ మీరు మీ కుందేలుకి మీసాలు కూడా పెట్టదలుచుకున్నట్లయితే ముఖం ముందరిభాగంలో అటూఇటూ ఓ రెండేసి సన్నని చీపురుపుల్లలు గుచ్చండి. ఇక కళ్ళకోసం రెండు మిరియాలు గింజల్ని అతికించాల్సి వుంటుంది. ఒక చిన్న నలుపు లేదా ఎరుపు రంగు కాగితాన్ని మూతి భాగంలో అతికిస్తే కుందేలు నోరు కూడా తయారైపోతుంది. ఇంకే ముందని ఇవన్నీ చేసేసరికి మీకు మీరుగా సృష్టించిన ఓ అందమైన కుందేలు మీ కళ్ళముందు ఉంటుంది. ఇకదాన్నిమీ గదిలో లేదా మీ ఇంట్లో ఎక్కడ ఉంచుకుంటారనేది పూర్తిగా మీ ఇష్టం.