“గాలిబుడగ జీవితం, ఓటి పడవ, యవ్వనం, నిన్న మరల రాదు. రాదు. నేడే నిజం. నిజం. నేడే నిజం” అని ఓ సినీ కవి రాశాడు. మరి ఆ గాలిబుడగ Balloon లోనికి గాలి ఉదాగాలవా? అని మి స్నేహితునీతో పందెం కాయండి. ఓ అదేంత పని పక్క కొరికినంత తేలిగ్గా బెలూన్ లోనికి గాలి ఊదేస్తా! అని అంటాడు మీ స్నేహితుడు. కాదు ఊదలేవు అని మీరు నిరుపించండి. పందెం గెలవండి. ఎలా గుంటారా? రండి చేసి చూద్దాం! కావలసిన పరికరాలు: 1.సీసా 2. రబ్బరు బెలూన్ ఒక సీసా తీసుకోని అందులో బెలూన్ ను సీసా మూతి వద్ద అంచులు మడిచి బెలూన్ ను అమర్చాలి. (పటంలో చూపిన విధంగా) ఇప్పడు మీ స్నేహితుడిని బెలూన్ లోనికి గాలి ఊదమని చెప్పండి. అతగాడు గాలి ఊదాడానికి ప్రయత్నిస్తాడు. కొంచెం గాలి మాత్రమే బెలూన్ లోనికి చేరి, బెలూన్ కాస్త పెద్దదవుతుంది. ఆ పై అతడు ఎంత ఊదినా బెలూన్ అంతకన్నా పెద్దది కాదు. గాలి లోనికి పోదు. అంటే మీ స్నేహితుడు ఓడి పోయాడు. మీరే గెలిచారు. ఇది ఎలా జరిగింద? బెలూన్ సీసా అంచులవద్ద మడిచి వుంది. కావున వెలుపలి నండి గాలి సిసలోనికి పోదు. సీసాలో బెలూన్ క్రింద కొంత గాలి బంధించబడి వుండి. బెలూన్ లోనికి గాలి ఊదినపుడు బెలూన్ కాస్త పెద్దదవుతుంది. అపుడు సీసాలోని గాలి పై వత్తిడి పెరుగుతుంది. ఆగాలి ప్రతిచర్యగా సీసా పై , బెలూన్ పై వత్తిడి చూపుతుంది. బెలూన్ వున్న ఈ వత్తిడి వలన గాలి ప్రవేశించదు. బెలూన్ పెద్దది కాదు. అంతే. ఆధారం: యుగంధర్