మెజీషియన్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డ్రస్సు తలకు టోపీ, చేతిలో పొడవాటి ఒక మంత్ర దండలాంటి కర్రతో స్టేజి మీదికి వచ్చాడు. అంతా చప్పట్లు కొట్టారు. పిల్లలూ మీరంతా పార్కుల్లో ఫౌంటైన్ ను చూసే ఉంటారు. రాత్రివెళలో రంగురంగుల దిపకాంతుల్లో ఫౌంటైన్ కన్నులపండుగగా ఉంటుంది కదా. మనం రాసాయనాలతో కూడా ఫౌంటైన్ ను సృష్టించవచ్చు. చూడండి నేను ఇక్కడే అలాంటిది సృష్టిస్తా అన్నాడు. చెప్పినట్లే చేశాడు మేజిషియన్ సుబ్బు. ఒక పెద్ద గాజుప్లాస్క్ దానిలో ఎరుపు రంగు ద్రవం ఉంది. ఈ ద్రవం ఒక గాజుగొట్టం గుండా పైకి లేచి, గొట్టానికి పై భాగంలో బోర్లించి ఉన్న వేరొక ప్లాస్క్ లోకి శబ్దం చేస్తూ ఒక ఫౌంటైన్ మాదిరిగా చిమ్ముతూనే నీలం రంగులోకి మారిపొయింది. మేజిషియన్ హాల్లోని లైట్లను అర్పివేశాడు. స్టేజి మీద టేబిల్ పై ఉంచిన ప్లాస్క్ ల అమరిక వెనుక ఒక లైట్ మాత్రం వెలుగుతూ ఉంది. ఈ వెలుగులో ఫౌంటైన్ లో రంగుల మార్పు మరింత ఆకర్షించింది. ఈ ఫౌంటైన్ ను మనం కూడా సృష్టిద్దాం. ఇందుకు కావలసినవి : ఒక మీటరు పొడవున్న గాజుగొట్టం. ఒంటి రంద్రపురబ్బరు బిరడా రెండు రంధ్రాల రబ్బరు బిరడా రెండు లీటర్ల ప్లాస్కులు – రెండు, ఒక అడుగు పొడవున్న రబ్బరు గొట్టానికి అమర్చిన ఒక పొట్టి 6మి.మీ గాజుగొట్టం. 50మి.లీ లిట్మస్ ద్రావణం 10 మి.లీ సజల హైడ్రైక్లోరికామ్లం రింగ్ స్టౌండ్ క్లంప్ లు వీటితోపాటు ఒక నాలికతో అమ్మోనియా జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. (ఇందుకు ఒక మరుగునాళిక boiling ture) లో సగానికి వచ్చేలా అమ్మోనియం క్లోరైడ్, సోడియం హైడ్రోకైడ్ లను సరిపాళ్ళలో కలిపి తయారు చేసిన మిశ్రమం. దీనికి ఒక బిరడా ద్వారా డెలివరిగొట్టం అమర్చుకోవాలి. ఇదే అమ్మోనియా జనరేటర్. ఎలా చేయాలి ? మీటరు పొడవున్న గాజుగోట్టాన్ని ఒక చివర సన్నని రంధ్రం వచ్చేలా సాగదీయాలి. దిన్ని 10 సెం. మీ దాకా ఒక ఒంటిరంధ్రపు రబ్బరు బిరడాలోకి పైన ఉండే 2 లీటర్లు ప్లాస్క్ కు అమర్చాలి. గాజుగొట్టం రెండో కోన కింద ఉండే 2 లీటర్ల ఫాస్క్ అడుగుకు వచ్చేలా రెండు రంధ్రం రబ్బరు బిరడా గుండా అమర్చి రింగ్ స్టాండ్ కు క్లంప్ లతో బిగించాలి. ఈ బిరడాకున్న రెండో రంధ్రం గుండా రబ్బరు గొట్టానికి అమర్చాలి. పైన అమర్చిన ఫ్లాస్క్ ను బయటికి తీసి దాని గుండా అమ్మోనియా వాయువును నింపాలి అమ్మోనియం క్లోరైడ్ సోడియం హైడ్రోకైడ్ మిశ్రమం ఉన్న నాళికను వేడిచేస్తే అమ్మోనియా వాయువు వేలువడుతుంది. దిన్ని ప్లాస్క్ లోకి సేకరించాలీ. అమ్మోనియా వాయువును నింపేటప్పుడు ప్లాస్క్ లో ఎ మాత్రం తడి ఉండకూడదు. క్రింది ఫాస్క్ లో లిట్మస్ ద్రావణాన్ని ఆమ్లాన్ని ఉంచి ప్లాస్క్ ను నీటితో నింపాలి. అమ్మోనియాతో నింపిన ప్లాస్క్ ను తలక్రిందులుగా గాజుగొట్టం పైన అమర్చాలి. అంటే క్రింది ప్లాస్క్ ను కలపాలన్న మాట. క్రింది ప్లాస్క్ కు అమర్చిన పొట్టి గాజుగోట్టానీకున్న రబ్బరుగొట్టం ద్వారా గాలిని ఊది కొన్ని చుక్కల ద్రవం పై ప్లాస్క్ లోకి చేరేలా చేయాలి. ఇప్పుడు ఫౌంటైన్ మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏదైనా రసాయన చర్య కారణమా ? నీటిలో అమ్మోనియా వాయువు ద్రవనియత చాలా ఎక్కువ. నీరు చాలా తక్కువగా కరుగుతుంది. ఫలితంగా పై ఫ్లాస్క్ లో శూన్యం ఏర్పడుతుంది. గాలిపిడనం వల్ల ద్రావం క్రింది నుంచి పైకి లేచి ఫౌంటైన్ లా చిమ్మతుంది. లిట్మస్ ఆమ్ల ద్రావణంలో ఎరుపురంగు, క్షారద్రావణంలో నీలంరంగులోను, ఉంటుంది కదా! అందుకే పైకి లేచిన ఎరుపురంగులో నున్న ఆమ్ల ద్రావణం అమ్మోనియా ద్రావణాన్ని కలిసినప్పుడు లిట్మస్ ఎరుపురంగు నుంచి నీలం రంగులోకి మారుతుంది. ఎక్కువ బలంతో నీరు ఫై ప్లాస్క్ లోకి చిమ్మినప్పుడు ఆశబ్దం గది అంతా విన్పిస్తుంది. ఆధారం; డా. ఇ. ఆర్. సుబ్రహ్మణ్యం