యురేకా! యురేకా!!... ఈ మాటలు ఎప్పుడో విన్నట్లు ఉందా? అవును నీవు అనుకున్నది కరెక్ట్. ఆర్కిమడీస్ మహాశయుడు ఉత్సవనం (Bucancy) కనుగొన్నప్పుడు ఆ విధంగా అరుస్తూ స్నానాల గదిలో నుండి వెలుపలికి వచ్చి వీధుల గుండా పరిగెత్తాడట. గ్రీకు రాజు తన బంగారు కిరీటం తయారీలో కల్తీ ఏమైనా ఉందేమోనని ఆర్కిమెడీస్ ను కనుక్కోమన్నాడు. ఎలా కనుగొనాలా అని ఆలోచిస్తూ తన స్నానపు తొట్టి (Bath tub)లో స్నానం చేస్తూ ఉండగా ఆయనకు ఇలా స్పురించిందట. “ఏదైనా వస్తువు నీటిలో తేలియాడుతున్నప్పుడు అది కోల్పోయిన భారము ఆ వస్తువు తొలగించిన నీటి భారమునకు సమానము” అలాగే “ఏదైనా అసౌష్టన (Irregular Body) వస్తువు నీటిలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు అది తొలగించు నీటిని ఘనపరిమానము ఆ వస్తువు యోక్క ఘనపరిమానమునకు సమానము “ దీని ద్వారా కిరీటము కరిగించకుండా దాని ఘనపరిమాణము కనుగొని, దాని ద్రవ్యరాశి తెలుసుకుని, ద్వారా సాంద్రత (సాంద్రత = ద్రవ్యరాశి/ ఘనపరిమానము) లెక్కించవచ్చును. దీనిని బంగారు తో పోల్చి కిరీటంలో కల్తీ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చును అని స్పురించింది. అంతే ఈ విషయం అలాగే లేచి పరిగెత్తాడట మన ఆర్కిమెడీస్ మహాశయుడు యూరేకా అంటూ నగ్నంగా “యూరేకా1” అంటే గ్రీకు భాషలో “తెలిసిందోచ్” అని, మరి దీనికి రుజువేమిటో తెలుసా? పద చేసిచూద్దాం. ఒక గాజు గ్లాసులో కంఠం వరకు నీరునింపి దాని భారం కనుగొనండి. ఒక చెక్కముక్కను నీటిపై ఉంచండి అప్పుడు కొంత నీరు వెలుపలికి చింది చెక్కముక్క నీటి పై తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్లాసు భారం కనుగొనండి. ఈ రెండు భారాలలో తేడా లేకుండా ఒక్కటిగా ఉంటాయి. కారణం ఉత్ ప్లవనము. అంటే చెక్కముక్క కొంత భాగము నీటిలో మునిగి ఉంది కదా. (పటము) ఆ భాగము తొలగించిన నీటి భారం చెక్కముక్క కోల్పోయిన భారమునకు సమానము. ఇదే ఆర్కిమెడీస్ సూత్రము ఓకేనా!