మెజిషియం సుబ్బు ఎంతో టివిగా వేదిక మీదకి వచ్చాడు. ఎప్పటిలాగే తలకు రంగురంగుల టోపీ, చేతిలో మంత్రదండం లాంటి ఒక కర్ర, మోకాళ్ళ దాకా తెల్లటి కోటు. ఆరోజు మేజిక్ షోకి వచ్చన పిల్లలంతా చప్పట్లు కొట్టారు. టేబుల్ మీద ఒక గాజు తొట్టెను ఉంచాడు . మీ అందరికి పువ్వులంటే ఇష్టమేకదా! ఏదైనా పార్కుకి వెళ్ళినపుడు ఎన్నో రంగురంగుల పువ్వులు చూస్తుంటారు. అలాంటి పూల తోటను ఈ గాజు తొట్టెలో సృష్టిస్తాను చూడండి అన్నాడు. పిల్లలంతా చాలా ఆసక్తిగా వింటున్నారు. రసాయనాలతో పూలతోట, ఇదేదో వింతే అనుకున్నారు. మెజీషియన్ గాజు తొట్టెలో ఒక గాజు బికరులోంచి రంగులేని ద్రవం పోశాడు . అంతా అది నీరే అనుకున్నారు. ఈ నీటిలో నెను కొన్ని విత్తన్నాలు నాటుతున్నా చూడండి అన్నాడు. అవి దాదాపుగా ఒక కంది గింజ పరిమాణంలో వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. ఏవో మంత్రాలు చదువుతున్నట్లు కనిపిస్తూ ఆ గింజల్ని ఒక్కొక్కటిగా గాజుతోట్టేలోని నీటిలో ఉంచాడు. చేతిలో ఉన్న తన మంత్రదండంతో ఆ తొట్టెను తాకి అబ్రకదబ్ర అన్నాడు అంతా చుడండి నేను మంత్రం వేశాను. విత్తనాలు కదా అవి మొలకెత్తడానికి ఒక రోజు పడుతుంది. రేపు మీరంతా స్కూలుకి రాగానే వచ్చి చూడండి అన్నాడు. అంతా అలాగే మర్నాదు వచ్చి చూశారు. ఇంకేముంది? గాజు తొట్టెలో రంగురంగుల పూలతోట కనువిందు చేసింది. అంతా ఔరా ఔరా అనుకున్నారు. ఆ పూలు ‘నీలం’, ‘గులాబి’, ‘ఆకుపచ్చ’, 'లేత ఆకుపచ్చ, ‘లేత గులాబి’ ఇలా వేర్వేరు రంగుల్లో కనువిందు చేశాయి. ఇందుకు కావాల్సిన రసాయనాలు: సోడియం సిలికేట్ (నీటి గాజు), కాపర్ సల్ఫేట్ స్పటికాలు (నిలరంగు), కొబాల్డ్ నైట్రేట్ స్పటికాలు (గులాబీ రంగు), మాంగనిస్ క్లోరైడ్ స్పటికాలు (లేత గులాబీ రంగు), ఫెర్రాస్ సల్ఫేట్ ర్ స్పటికలు (లేత ఆకుపచ్చ). మెజీషియన్ గాజు తొట్టెలో పోసింది మామూలు నీరు కాదు. మంత్ర జలం కూడా కాదు. అది సోడియం సిలికేట్ ను నీటిలో కరిగించి తయారు చేసిన సంతృప్తి ద్రావణం మెజీషియన్ చూపించినవి విత్తనాలెం కాదు. అవి వేర్వేరూ రంగుల్లో ఉన్న లవణాల స్పటికాలే! మెజీషియన్ చేసినట్లుగానే సోడియం సిలికేట్ ద్రావణాన్ని గాజు తొట్టెలో గాని, పెద్ద బికర్ లో గాని తీసుకోవాలి. పైన చెప్పిన రంగు లవణాలు స్పతికాలను తీసుకోని బికర్ అడుగున జాగ్రత్తగా ఉంచాలి. ఒక రోజంతా బికర్ ను కదపకుండా ఉంచి మర్నాడు చూడాలి. వేర్వేరు రంగుల్లో గార్డెన్ లో పూలమొక్కల మాదిరిగా ఆయ స్పితికాలు నుంచి సిలికేట్ జెల్ లు బీకరులో వ్యాప్తి చెందుతాయి. వీటినే సిలికా గార్డెన్స్ అంటారు. మరి ఈ సిలికా గార్డెన్స్ ఏర్పడడానికి కారణం ఏమిటి? మొదటి స్పటికాల చుట్టూ సిలికేట్ షెల్ ఏర్పడుతుంది. ఇది అర్ధ ప్రవేశ్యంగా ఉండే కొల్లాయిడ్. దీని లోపల లవణం గాడ ద్రావణం. బయట సోడియం సిలికేట్ యొక్క విలీన ద్రావణం ఉంటాయి. అందుచేత నీరు షెల్ గుండా ప్రవహిస్తుంది. క్రమంగా పీడనం ఎక్కువై షెల్ బద్ధలౌతుంది. అప్పుడు లవణ ద్రావణం బయటికి పోతు వెంటనే సోడియం సిలికేట్ లో చర్యపొంది అర్ధ ప్రవేశ్య లోహ సిలికేట్ షెల్ ను మరల ఏర్పరుస్తుంది. ఈవిధంగా అనేక సార్లు జరిగి సిలికేట్ ఒక చెట్టులాగా వ్యాప్తి చెందుతుంది. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం