కెమిస్ట్రీ మేజిక్ షో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా రసాయనాలతో మేజిక్ లను మేజీషియన్ సుబ్బు ప్రదర్శిస్తూ విద్యార్థుల్లో చాలా ఆసక్తిని కల్గిస్తున్నాడు. తరువాత చూపించే మేజిక్కు స్టేజి మీద ఏర్పాట్లు చేస్తూ వెజీషియన్ చాలా బిజీగా కన్పిస్తున్నాడు. విద్యార్థులంతా మెజీషియన్ చెప్పిన విషయాలన్నింటినీ తమ నోట్ బుక్స్ లో రాసుకుంటున్నారు. మేజిషీయన్ మైక్ ముందుకు వచ్చాడు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదా! దూరంగా ఆకాశం భూమి కలిసినట్లు అగుపడే చోట సూర్యుడు క్రిందికి దిగిపోతున్నట్లు, చుట్టూ ఎరుపు కాంతి ఎంత అద్భుతంగా ఉంటుంది. రసాయనాలతో ఈ సూర్యాస్తమయ దృశ్యాన్ని ఒక తెరమీద మీకందరికీ చూపిస్తా. వేదిక మీద ఒక పొడగైన టేబిల్ దాని మీద ఒక విద్యుత్ బల్బ్ దానికి ఎదురుగా రెండు కటకాలు, V ఆకారపు గాడి ఉన్న స్టాండులో ఉంచాడు. రెండు కటకాలకు మధ్య ఒక బీకరు ఉంచాడు. భీకరులో ఏదో ద్రవం ఉంది. విద్యుత్ బల్బుకు దూరంగా బీకరు వెనకున్న కటకం వెనకవైపున ఒక తెరను ఉంచాడు. కటకాలను కొంచెం అటుఇటు కదిపితే తెరమీద ప్రకాశవంతమైన కాంతి బింబం ఏర్పడింది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మెజీషియన్ మైక్ దగ్గరకు వచ్చాడు. ఇదిగో నా చేతిలో ఉన్న సీసా చూడండి. దీంట్లో ఒక పవిత్రజలం ఉంది. దీంతోనే నేను ఈ తెరమీద సూర్యాస్తమయాన్ని సృష్టిస్తాను. తెరకేసే చూడండి అంటూ ఆ సీసాలోని ద్రవాన్ని బీరులో పోశాడు. హాల్లో లైట్లన్నీ ఆర్పివేయడంతో, అందరి దృష్టి తెరమీదే ఉంది. ప్రకాశవంతంగా ఉండే కాంతిబింబం నెమ్మదిగా మబ్బులు కమ్మినట్టుగా మారుతోంది. అస్తమించే సూర్యునిలో మాదిరిగా వేర్వేరు రంగులు తెరమీద అగుపడుతూ కొంత సేపటికి పూర్తిగా కనుము. రుగయింది. అంతా తప్పట్లు కొట్టారు, హాల్లో లైట్లు వెలిగాయి. ఈ మనోహరమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని రసాయనాలతో మనం సృష్టించవచ్చు. ఇందుకు కావలసినవి! ఒక గాజు బీకరు రెండు కుంభాకార కటకాలు, తెర (స్కీన్), విద్యుత్ బల్బ్, హైపోస్పటికాలు, సజల హైడ్రోక్లోరి కామ్లం ఇలా చేయాలి. రెండుకుంభాకార కటకాలను , V ఆకారపు గాడి ఉన్న స్టాండుల్లో ఉంచండి. ఒక వెలుగుతున్న ఎలక్ట్రిక్ బల్బ్. రెండు కుంభాకార కటకాలను, తెరను ఒకే వరుసలో ఉంచండి. కటకాల స్థానాలను సర్దుబాటు చేసి తెరమీద ప్రకాశవంతమైన ప్రతిబింబం ఏర్పడేటట్లు చేయండి. బీకరులో శుద్ధజలాన్ని తీసుకుని ఆ నీటిలో కొన్ని హైపో స్పటికాలను కరిగించి ద్రావణం తయారుచేయండి. హైపోద్రావణం ఉన్న భీకరును రెండుకటకాలను మధ్య ఉంచండి. ఇప్పుడు హైపోద్రావణానికి కొంచెం హైడ్రోక్లోరికామ్లాన్ని కలపండి. ఇదే మెజీషియన్ మంత్రజలం అని చెప్పిన ద్రవం. ఇప్పుడు తెరమీద సూర్యాస్తమయం దృశ్యం కన్పిస్తుంది. ఇందుకు కారణం ఏమిటి? సోడియం థయోసల్పేట్ (హైపో) ద్రావణంలో సజల హైడ్రోక్లోరికామ్లం చర్యపొందినప్పుడు మొదట - కోలాయిడల్ సల్పర్ ఏర్పడుతుంది. ఈ కోల్లాయిడ్ కణాలు ఎరుపు మినహా మిగతా అన్ని రంగులను శోషణం చేసుకుని, ఎరుపు వర్ణాన్ని మాత్రమే - ప్రసారం చేస్తాయి. అందుచేత ముందుగా తెర మీద ఎర్రని ప్రతిబింబం ఏర్పడుతుంది. క్రమంగా – కోలాయిడ్ కణాలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద కణాలుగా ఏర్పడతాయి. కొంత సేపటికి సల్ఫర్ అవక్షేపించ బడుతుంది. అందుచేతనే, తెరమీద కాంతిబింబం క్రమంగా మసకబారుతూ చివరకు పూర్తిగా కనిపించకుండా పోతుంది. సల్పర్ అవక్షేపం ఏర్పడినప్పుడు అది కాంతిని తన గుండా ప్రసారం కానివ్వవు. ఆధారం: డా. ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం