హాయ్ పిల్లలూ ... మొన్న భూమికి చేరువైన కుజుడు - నిన్న చంద్రుని సిగలో మెరిసి, సూర్యుని ముద్దాడిన శుక్రుడు - రేపు శని గుట్టు విప్పనున్న కేసిని స్పేస్ ప్రోబ్ - ఇలాంటి ఖగోళ అద్భుతాల్ని నెమరేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. స్వప్నంలో - వలయాధిపతి శని గిర్రున తిరుగుతూ నా ముందు కొచ్చాడు. నిజంగా ఎంత సుందర స్వప్నం! స్వర్ణ కాంతులీనే శని సౌందర్యం వర్ణనాతీతం! ఆ అనుభూతి శాత్వతంగా వుండాలని నేను చేసిన చిన్న ప్రయత్నమిది. మీరూ చేస్తారుగా ? ముందుగా టేబుల్ టెన్నిస్ బంతిని రెండు అర్థగోళాలుగా జాగ్రత్తగా కట్ చేయాలి. CPU Cooler రెక్కలన్నింటిని విరిచేసి కేవలం button shape లోని మోటార్ ని frame నుండి వేరు చేయాలి. అల్యూమినియం టింగర్ లను ఒక దాలితో ఒకటి కలిపి పొడవైన పట్టీలా వచ్చేట్లు బోల్ట్ లతో బిగించాలి. ఈ పట్టీల ఒక చివర “L” ఆకారంలో వంచి, రెండవ చివరపై Sleeve bearing motor ను దానిపై CD మధ్యభాగాన్ని సరిగ్గా sticker tape ఉపయోగించి అతికించాలి. ఇపుడు ముందుగా కట్ చేసిన బంతి యొక్క ఒక అర్థగోళాన్ని CD పై మధ్య భాగంలో బోర్లించి ఫెవికాల్ తో అతికించాలి. రెండు అర్థగోళానికి ఒక ప్రక్క క్రింది వరకు, టింగర్ పట్టీ వెడల్పున కట్ చేసి m.seal fix తో CD యొక్క క్రింది వైపున టింగర్ కు fix చేయాలి. ఈ అమరిక వలన fan motor క్రింది అర్థగోళంలో ఇమిడిపోతుంది. అయితే ఈ అర్థగోళం CD. కి touth కాకూడదు. సుమా. అంతే .... మన Saturn రెడీ .... Screw తో టింగర్ ను ఏ గోడకో లేదా స్విచ్ బోర్డకో బిగించి motor వైర్స్ కి బ్యాటరీ కనేక్షన్ ఇస్తేసరి. ఎంచక్కా మన ముచ్చటైన Saturn గిర్రున తిరుగుతా అలరిస్తుంది. ఇందులో క్రింది వున్నప్పుడు CD. కి రెండు వైపులా పరిధి వైపు 2 సెం.మీ. వెడల్పున yellow paint తో shading ఇచ్చి bleck marker pen తో lining ఇస్తే అద్భుతంగా కన్పిస్తుంది. నిర్వహణ : - వై. కుమార్, వెంగమాంబాపురం, నెల్లూరు జిల్లా.