ప్రతి” పదార్ధం (Anti Matter) దొరికింది మనకు కనిపించే అన్ని వస్తువులు, మనతో సహా అన్నీ పదార్థంతో నిర్మింపబడి ఉన్నాయి. పదార్థాన్ని మ్యాటర్ అంటారు. కానీ దీనికి వ్యతిరేకమయిన ప్రతి పదార్థం” “అంటిమ్యాటర్” కూడా ఉండితీరాలని. కొంతకాలంగా పరిశోధకులు వాదించారు. స్విట్జర్లాండ్, జెనీవాలోని, సిఈఆర్ఎన్ అనే పరిశోధక సంస్థ వారు ఈ మధ్యన 'యాంటిహై(డ్రోజన్ను” పట్టుకోగలిగారు. యాంటిమ్యాటర్ గురించి అర్థం చేసుకునే దిశగా ఇది మరొక అడుగు అని ప్రపంచశాస్త్రవేత్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రంగంలో పరిశోధన ముందుకుసాగితే, గురుత్వాకర్షణ గురించి మరెన్నో వివరాలు తెలుస్తాయి. నిజానికి విశ్వంలో ఆవరించి ఉండవలసిన ప్రతిపదార్థం” (యాంటిమీటర్) సంగతి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వంలో యాంటిమాటర్ పదార్థాలు వస్తువులు ఉన్న దాఖలాలు లేవు. యాంటి మ్యాటర్ కూడా మ్యాటర్ లాంటిదే. కానీ మామూలు పదార్థం అణువులకు వ్యతిరేకమయిన “చార్జ్” ఈ ఆంటిమాటర్ అణువులలో ఉంటుంది. ఒక ఎలెక్ట్రానుకు నెగిటివ్ ఛార్జ్ (రుణ ఆవేశం) ఉంటుంది. దానికి వ్యతిరేకమయిన పాజిట్రాన్‌ను పాజిటివ్ ఛార్జ్ (ధనావేశం) ఉంటుంది. ఇవి రెండూ ఒక చోట చేరితే ఒక దాన్ని మరొకటి నాశనం చేసుకుంటాయి. ఈ ప్రయోగాన్ని అన్బిహిలేషన్ (Annihilation) అంటారు. ఎలక్ష్రాను, పాజిట్రాన్లు ద్రవ్యరాశి మొత్తానికి సరిపడిన శక్తి అయన్స్టీన్ గారి E=mc2 సూత్రం ద్వా నిర్జశితమైన మోతాదులో లభ్యమవుతుంది. ఇక్కడ m అంటే ఎలక్ట్రాన్, ప్రోట్రాన్ల సంయుక్త ద్రవ్యరాశిగా గమనించగలరు. 2002 నుండి చాలా సందర్భాలలో యాంటిహైడోజెన్ పరమాణువుల్చి తయారుచేసుకోగలిగారు. కానీ అవేవీ మైక్రో సెకండుల కన్నా ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే అవి గామా కిరణాలుగా వివుటనం చెందాయి. ప్రస్తుతం మాత్రం పరిశోధకులు, యాంటిహైడ్రోజెన్లో ఉండే సూక్ష్మమయిన అయస్మాంతగుణాన్ని గుర్తించారు. ఈ కారణంగా ఉదజని పరమాణువు ఒక “చాలా చాలా చిన్న అయస్మాంతంగా పనిచేస్తుంది. మాగ్ఫెటిక్ మిర్రర్స్ అనే పద్ధతి సాయంతో ఈ విషయాన్ని వీరు కనుగొనగలిగారు. మొత్తానికి ప్రతి ఉదజని కణాలను కొంతకాలం వరకు ఆయా ప్రాంత క్షేత్రంలో బందీ చేసి ఉంచగలిగారు. ఈ పని జరగడానికి అక్కడి వాతావరణం అబ్బల్యూట్ జీరోకు అరడిగ్రీకి చేరువలో ఉ౦డాలి. ఈ పరిస్థితులన్ని కల్పించడం నిజంగా అద్భుతం. ఒకేసారి ఒక కోటి యాంటి హైడ్రోజన్ ఆటమ్స్‌ను తయారుచేశారు. విఘటన చెందగా చివరకు 88 అణువులు మాత్రం పరిశీలనకు మిగిలాయి. పరమాణుటిటుకలు (Bricks of Materials) పిల్లలు ఆడుకోవడానికి లేగో (బ్రిక్స్ అని ప్లాస్టిక్ ముక్కలు దొరుకుతాయి. అవి వివిధ రంగులు, ఆకారాలలో ఉంటాయి. జిగురు అవసరం లేకుండానే, వాటిని, ఒకదానికి మరొకటి అతికించే వీలు ఉంటుంది. ఆ ్రిక్స్ను కలుపుతూ పిల్లలు రకరకాల బిల్డింగ్స్, నిర్మాణాలు, ఆకారాలు తయారు చేస్తుంటారు. బ్రిక్స్‌ను కలపడానికి రాపిడి ఆధారంగా పనిచేసే బుడిపెలు, గుంపలు పరమాణువులు మాత్రం వాటిలోని విద్యుదయాస్కాంత ధర్మాల ఆధారంగా ఒకదానికి ఒకటి అంటుకుంటాయి. తద్వారా అణువులు ఏర్పడుతాయి. పరమాణువు మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. అందులో పాజిటివ్ ఛార్జ్గల ప్రొటాన్స్, ఛార్జ్ ఏమీ లేని న్యూట్రాన్స్ కలిపి ముద్దగా ఉంటాయి. దాని చుట్టూ నెగెటివ్ ఛార్జిగ ఎలక్ష్రానులు తిరుగుతూ ఉంటాయి. అవి మరీ మరీ చిన్నవి. పరమాణువులో ఒక్కొక్క మూలకానికి ఒక రకంగా ఉంటుంది. పరమాణువులో ఎలక్ష్రానులు, కేంద్రకం చుట్టూ, వలయాలలో తిరుగుతూ ఉంటాయి. వాటిలో అన్నింటికన్నా వెలుపలి వలయంలోని ఎలక్ట్రానులు, మరో మూలకపు పరమాణువుతో బంధం ఏర్పరుచుకుంటాయి. అప్పుడవి రెండూ కలిసి అణువుగా ఉంటాయి. ఇలా రెండేకాక, ఎన్నో పరమాణువులు ఒక చోట చేరి ఉండే పరిస్థితి కూడా ఉంది. ఒకే మూలకం పరమాణువులు కలిసినా రకరకాల మూలకాల పరమాణువులు కలిసినా అణువు ఏర్పడుతుంది. ఈ రెండవ రకంతో ఏర్పడ్డ అణువును కాంపౌండ్ ల్ని (సమ్మేకనం) అంటారు. సమ్మేళన అణువుల నిర్మాణంలోని బంధనాల, నీటి అణువు కారణంగా వాటికి రకరకాల లక్షణలు ఉంటాయి. గ్రాఫైటు, వజ్రం రెండూ కార్బన్ పరమాణువులతో తయారయినవే కానీ వాటి లక్షణాలు పూర్తిగా వేరు! రకరకాల రసాయన అణువులు, ఒకదానితో ఒకటి కలిస్తేనే చర్యలు జరుగుతాయి. ఇందుకు సులభమయిన ఉదాహరణ అగ్గి మంట! కర్రలోగానీ, మరో ఇంధన రసాయనంలో గానీ ఉండే ఎలక్ష్రానులు, ప్రోటానుల సంఖ్య సమానంగా ఉంటుంది. అవి పరస్పర ఆకర్షణతో ఉంటాయి కనుక, పరమాణువు స్థిరరూపంలో నిలిచి ఉంటుంది. ఎలక్ష్రానుల ప్రవర్తనను మనం అర్థం చేసుకోవాలి. వీటి ఆకర్షణ, తమ అణువులోని (ప్రొటానుల మీదనేగాక, మరో పరమాణువు లేదా అణువు మీదకు కూడా మళ్లుతుంది. ఆ రకంగా వేరు వేరు రకాల అణువులు ఒకచోట చేరుకుంటాయి. అణువులు, వేరే అణువులతో కలవడానికి గల శక్తి, వాటిలోని బంధనాలు (ఛార్జ్) ఏర్పడే వీలు మీద ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి రసాయన సమ్మేళనాలు, వాతావరణంలోని ఆక్సిజెన్‌తో కలిస్తే మంట మొదలవుతుంది. అణువులు, పరమాణువులు ఉన్నాయని తెలియని కాలం నుంచీ, మానవుడు వాటిని వాడుతున్నాడు. మన శరీరం కూడా అణువులు, పరమాణువులు, వాటి మధ్య చర్యల ఫలితమే! సైన్సు అనే భావన కలిగిన తర్వాత కొత్త అణువులను కనుగొంటున్నారు. అణువును చీల్చి అందులోనుంచి శక్తిని తీసి వాడుకుంటున్నారు. పరమాణువులోని తెలిసిన అంశాలకన్నాా చిన్న బోసానులు, లెప్టానులు, క్వార్ముల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధారం : Vigyan Prasar