(రూయా ఆసుపత్రి, ఎదురుగా పెద్దక్షరాల్తో బుర్న్స్ వార్డ్ అనే బోర్డు. రఘురాం తాత,నానమ్మ, వంశీ లోనికి పోతున్నారు) నర్స్:- తాత !అబ్బాయిని బయటే పెట్టి మీరు మాత్రం లోనికి రండి . నానమ్మ :- అమ్మ, వీడి స్నేహితురాలు కాలిన గాయాలతో లోపాలుండి, చూద్దామని. నర్స్:- చిన్నపిల్లలు బుర్న్స్వార్డులోకి రారాదమ్మ, చూసి వాళ్ళు తట్టుకోలేరు. ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా వుంది. (వంశీని బయటనే కూర్చోబెట్టి, తాత, నానమ్మ వాళ్లిద్దరూ వార్డులోనికి వెళ్ళారు ) (ముప్పైకి పైగా మంచాలు వేసున్నాయి అక్కడ , తెల్లని దోమతెరల లోపల కాలిన గాయాలతో పేషంట్లు కన్పిస్తున్నారు.) నర్స్:- అవ్వరు కావాలి మీకు ? తాత :- విజిత అని ఆరేళ్ళమ్మాయి ..? నర్స్:- ఓ ..! నిన్న రాత్రి అగ్నిగుండంలో పది పోయిందని తీసుకొచ్చారే...! నానమ్మ :- ఆ ! అవునమ్మ! ఎలా వుంది పాపకు ? (నర్స్ వారిని తీసుకొని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు నడుస్తుంది ) నర్స్:- థర్డ్ డిగ్రీ బుర్న్స్! మూడు రోజులు గడిస్తే కానీ ఎం చెప్పలేం ..! నానమ్మ:- అయ్యో! భగవంతుడా ...! నర్స్:- ఇంతకు ప్రమాదం ఎలా జరిగింది ? తాత:- గ్రామదేవత జఠరని, ఊర్లోనే నిప్పుల గుండం తొక్కడానికి వెళ్ళింది. పావడ కళ్ళకు అడ్డుపడి నిప్పుల్లో పడిపోయింది. నర్స్:- పసిపిల్లతో నిప్పులు తొక్కించడం ఏమిటి?మూర్ఖత్వం కాకపోతే ? నానమ్మ :- అది ఆచరమమ్మా! నర్స్:- ఆచారమే! గ్రహచారమా ? తాత:-బతికుంటే వాడే భగవంతుడు. బ్రతకాలి తపనే భగవత్ భావన,బలికోర్ ఇలాంటి ఆచారాలనే మనాలి? నర్స్:- మూఢాచారాలంటే ఇవేగా! వీటివల్ల మహూన్నతమైన మన భరత సంస్కృతి అనాగరికమనే మచ్చ తెచ్చుకొంటుంది. మంచంపై అచేతనంగా విజిత,ప్రక్కనే నెల పై విజిత తల్లి కామాక్షి. ఏడ్వటానికి కన్నీరు మిగలలేదేమో, నిర్లిప్తంగా చూస్తూ వుంది. నర్స్ :-(దోమ తెర తీసి చూపుతూ )కుడివైపు పెద్దగా కలలేదు, ఎడమవైపు నిప్పులో పడినట్లుంది. ఆ వైపు గాయాలు చాల తీవ్రంగా వున్నాయి. ''౯థ్రఒంగి చుసిన రఘురావు గారికి కాలిన అమ్మాయి చెవి దొప్ప మాత్రం మాంసపు ముద్దలా, గోధుమ రంగులో కన్పించింది. నీటి సుడులతో మసక బారడంతో కళ్ళు తుడుచుకొంటూ ...!) తాత:- విజ్జి!నొప్పిగా వుందా తల్లి? నర్స్:- కాలిన గాయాల తీవ్రతకు, నాడిపోగులు దెబ్బతిన్నట్లు వున్నాయి. అందుకే పాపకు నొప్పి తెలియడం లేదనుకొంటాను. తాత:- పాపా కన్ను పైన గాజు క్లాత్ కప్పి వుంచారెందుకు? నర్స్:- కన్ను పైన కూడా పెద్ద బొబ్బలున్నాయి. బహుశా వేడి బుడిదో, నిప్పు రేణువులో పడినట్లున్నాయి..! తాత:- కార్నియా దెబ్బ తినలేదు కదా? కామాక్షి:- (శోకం కట్టలు తెంచుకొంది, రెండు చేతులతో తలనుబాదుకుంటు) తాత దానీఙ్కి చూపు రావటం కష్టమని, డాక్టర్ ఇప్పుడే చెప్పి వెళ్లారు. నేనేం పాపం చేశాను తాత?(గట్టిగ అరవసాగింది ) (కామాక్షిని పొదివి పట్టుకొని బయటకు తీసుకొని వెళుమా...!) తాత:- నర్సమ్మ ! నా భార్యకు, పాపను కనిపెట్టుకొని ఉండమని చెప్పమ్మా! (అరగంట పైనే కామాక్షి దుఃఖం ఆగలేదు ఆపై నెమ్మదిగా లేచి, రఘురాం గారివైపు చూస్తూ...!) కామాక్షి:- తాత!నా బిడ్డ చచ్చిపోతే మేలేమో తాత! తాత:- ఛ! అవేం మాటలు, తల్లిగా ఆలా కోరుకోవచ్చా? కామాక్షి:- చూపులేకుండా! వికారమైన ఆకారంతో లోకంలో ఆలా బతుకుంది? (కామాక్షి మనస్సులో ఏ మూలకో ఆశ తన కూతురు తిరిగి ఇంటికి వస్తుందని) తాత:- ప్లాస్టిక్ సర్జరీ, కార్డియా రిప్లేసెమెంట్ ద్వారా విజిత ఇంటికి ఆరోగ్యాంగా వతుంది ధైర్యంగా వుండు! ఇద్దరు లేచి డాక్టర్ గదివైపు నడుస్తున్నారు.) కామాక్షి:- డాక్టర్ గారు, ఆయన రఘురాం గారు నాకు తండ్రిలాంటి వారు. డాక్టర్:- కూర్చోండి! ప్రమాదం జరిగిన వెంటనే పాపకు ప్రథమచికిత్స చేసింది మీరే కదా! తాత:-ఔనండీ! డాక్టర్:- కాలిన గాయాలకు నూనె పూయక పోవడం గుడ్డతో కానీ, దూదితో కానీ తుడవడం లేదా కప్పకుండా, గాయాలపై చల్లని నీరు పోయడం వలన మీరు పాపప్రణాలను నిలిపారని మీకు తెల్సునా? తాత:- కాలిన గాయాలపై చల్లని నీరు పోస్ట్ బొబ్బలు రావని చదివాను. పాపా పరిస్థితి ఎలా వుంది? డాక్టర్;- ప్రస్తుతానికి క్రిటికల్ అనే చెప్పాలి. కాలిన గాయాలతో సెకండరీ ఇన్ఫెక్షన్ లు రాకుండా యాన్తి బయాటిక్స్ వాడుతున్నాము. కామాక్షి:- అంటూ, మైలో తగిలుంటుంది సార్! వేల మంది గుండం తొక్కుతుంటే నా బిడ్డకే ఇలా జరిగింది. తాత:- అంటూ మైల అనేవి మనం పెట్టుకున్న కట్టుబాట్లు మాత్రమే కామాక్షి! పెద్ద వాళ్ళు కాబట్టి మిగిలిన వారికీ కాళీ వుండదు. డాక్టర్:- సాధారణంగా ఒక వస్తువు కలడం, మూడు విశాలపై ఆధారపడుతుంది. అవి 1 ) మండే పదార్థం 2 ) మండించే పదార్థ స్వభావం 3 ) జ్వలనోష్టం. తాత:- పదాలతో చర్మ మందంగా ఉండటం, స్నానం చేసి రావడం వల్ల తేమగా ఉండటం వల్ల కాళీ వద్ద చర్మం తొందరగా కలదు. డాక్టర్:- అవునండి. కర్రబొగ్గులో పై పోరా మాత్రమే మండుతుంది. లోపలి భాగానికి ఆక్సిజన్ అందుబాటులో లేక చల్లగాలి ఉంటుంది. కాబట్టి తేమ తగలగానే నిప్పుకణిక పై పొరలోని జ్వలనోష్టం పొందే లోపుగా మనం పాదాలను లేపేస్తాం కదా! తాత:- ఇలాంటి సైన్స్ చిట్కాలను వాడుకొని, ప్రజలను మూఢనమ్మకాల వైపు మార్చడం దారుణమంది! కామాక్షి:- చదువురాని మాకివ్వాన్ని ఎలా తెలుస్తాయి. నా చిట్టితల్లిని నాకెవరు తిరిగి తెచిస్తారు?(ఏడ్వసాగింది ) డాక్టర్:- అమ్మ! ప్రమాదం దగ్గరకు పోరాదు,నీవు నీ బిడ్డకు ధైర్య చెప్పు, పలుచటి పానీయాలు ఎక్కువగా తప్పుతూ వుండు. మీ అమ్మాయిని కాపాడే భాద్యత నేను తీసుకుంటాను. తాత:- (నమస్కరిస్తూ ) అందుకేనండి ' వైద్యో నారాయణ హరి ' అన్నారు. (కామాక్షి, రఘురాం తాత బుర్న్స్ వార్డు వైపు నడవసాగాడు) ఆధారము: చెకుముకి