మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం కదా. ఇప్పుడు సెల్ నెంబర్లు గుర్తించుకొనట్లు కేవలం పన్నెండు అంకె కోడ్ తో 2012 కేలెండర్ మెత్తం చెప్పే తమాషా చూద్దాం రండి! 0 3 4 0 2 5 0 3 6 1 4 6 పై నెంబర్ లో అంకెలు వరుసగా జనవరి, ఫిబ్రవరి,.... డిసెంబర్ వరకు అన్వయించుకోండి. 1234560 నంబర్ లో అంకెలు వరుసగా ఆది, సోమ, మంగల, బుధ, గురు, శుక్ర, శని వారాలకు గుర్తించుకోండి. ఇప్పుడు (2012) కేలెండర్ మీకు వచ్చినట్లే. ఏలాగో చూద్దాం! ఇచ్చిన తేదిని ఆయా నెల కోడ్ నంబర్ కు కలుపండి. వచ్చిన మెత్తాన్ని 7 తో భాగించే శేషం తెలిసికోండి. శేషం సూచించే అంకెనుబట్టి అది సూచించే వారాన్ని తెల్పండి. ఉదాహరణకు: 4 జూన్ 2012 ? జూన్ కోడ్ 5. తేదీ 4 కు కలుపగా 5+4=9 9ని 7తో భావిస్తే శేషం 2. అంటే సోమవారం. 31 మార్చి 2012 ? మార్చి కోడ్ 4 తేదీ 31కు కలుపగా 4+31=35 35ని 7తో భావిస్తే శేషం సున్న అంటే శనివారం 23 సెప్టెంబర్ 2012 ? సెప్టెంబర్ కోడ్ 6 తేదీ 23కు కలుపగా 6+23=29 29ని 7 తో భావిస్తే శేషం ఒకటి. అంటే ఆదివారం.