సోనియట్ దేశంలో పిల్లలకు, యువజనులకు కలిపి 250 పైగా పత్రికలున్నాయి. అందులో 'పయనీర్ స్కాయా' అనే పిల్లల పత్రిక సర్క్యులేషన్ 95 లక్షలు. ఇన్ని ప్రతులు అమ్ముడయ్యే పత్రిక ప్రపంచంలో మరోటి లేదు. మొట్టమొదటిసారి పిల్లలే నిర్వహించిన పిల్లల వారపత్రిక పేరు'లిటిల్ రివ్యూ', దానిని పోలెండ్ దేశస్థుడైన డాక్టర్ కోరాక్ కృషితో వార్సాలోని అనాధ బాలలు వెలువరించారు. 1930నుంచి ధారావాహికంగా వెలువడి 1939లో నాజీలు వార్సాను ఆక్రమించే వరకు పత్రికారంగంలో 'లిటిల్ రివ్యూ' తన ప్రత్యేకతను నిలుపుకుంది. “బాలల్ని వ్యక్తులుగా గౌరవించండి. వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి!" అనేది కోరాక్ తపన. దాని ఫలితమే 'లిటిల్ రివ్యూ’. ఒకప్పుడు భారతి, గృహలక్ష్మి, జనవినోదిని, కృష్ణ పత్రిక మొదలైన తొలితరం పత్రికలు ఇచ్చిన ప్రోత్సాహం బాలలకు ప్రత్యేకమైన పత్రికలు ప్రారంభించటానికి మార్గం ఏర్పడింది. ఆ ఉత్సాహంతో మేడిచర్ల ఆంజనేయమూర్తి 1940లో 'బాలకేసరి’ ప్రారంభించారు. ఆ తరువాత న్యాయపతి రాఘవరావు 1945లో 'బాల', చక్రపాణి 1947లో 'చందమామ' ప్రారంభించి బాలల పత్రికలకు శుభారంభం చేశారు. ఆ స్ఫూర్తితో బాలల కోసం అనేక పత్రికలు వచ్చాయి. 1979లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురించిన 'బాలచంద్రిక' విభిన్న శీర్షికలతో వెలువడి బాలలకు విజ్ఞాన వినోదాలను పంచింది. ఈ 69 ఏళ్లలోనూ 90పైగా పిల్లల పత్రికలు వచ్చాయి. నాకు తెలిసిన వివరాల మేరకు 1940 నుండి తెలుగులో బాలల పత్రికలు, వాటి సంపాదకుల వివరాలు: బాలల్లో చదివే అలవాటును ఆసక్తిని పెంచటం కోసం, కొత్త విషయాలు తెలియజేయడం కోసం పత్రికలు ఎంతగానో తోడ్పడతాయి. బాలల్లోని రచనాసక్తి పఠనాశక్తి, భాషానురక్తి, జ్ఞాపకశక్తి, భావాల అభివృద్ధికి పిల్లల పత్రికలు ఎంతో దోహదం చేస్తాయి. ఆ లక్ష్యంతోనే పిల్లల పత్రికల ప్రచురణ ప్రారంభమయ్యింది. క్ర. సం. పత్రిక పేరు ప్రారంభమయిన సంవత్సరం సంపాదకులు 1. బాలకేసరి 1940 మేడిచర్ల ఆంజనేయమూర్తి 2. బాలమిత్ర 1941 ఎల్.ఎ. బెయిన్ 3. కుమారమిత్ర 1942 పి.బి. కృష్ణమాచార్యులు 4. బాల 1945 న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి 5. ఆంధ్రవిద్యార్థి 1947 6. చందమామ 1947 చక్రపాణి 7. బాలబంధు 1947 8. బాలమిత్ర 1949 బి.వి. రాధాకృష్ణ 9. పాపాయి 1949 డి. అప్పారావు 10. పాప 1949 11. బొమ్మరిల్లు 1949 జె. రాజారావు 12. బాబు 1949 విశ్వేశ్వర రావు 13. బాలవినోదం 1950 గోటేటి రామారావు 14. బాలప్రభ 1952 పాటిబండ్ల మాధవశర్మ 15. ఉదయబాల 1952 16. మనసంఘం 1952 లవణం 17. బాలభారత్ 1952 18. శిశువిద్య 1954 ఎన్ పేర్రాజు 19. బొమ్మరిల్లు 1954 20. జాబిల్లి 1954 21. గుజ్జనగూళ్లు 1955 22. తెలుగు విద్యార్థి 1955 కె. కోటెశ్వర రావు 23. బాలానందం 1956 న్యాయపతి రాఘవరావు 24. బాలప్రభ 1957 జి. మునిరత్నం నాయుడు 25. బాలబంధు 1962 ఆర్.ఎస్. మూర్తి 26. చంద్రభాను 1962 కోటపాటి, యం.వి. శేషయ్య 27. బాలరాజ్యం 1963 గోటేటి రామారావు 28. బాలనందం 1964 ముదునూరి వెంకటేశ్వరరావు, ముదునూరి రామారావు 29. నందన 1965 వై.బి. వెంకటరాజు 30. రఘుబాల 1965 ఎ. ఎల్లయ్య 31. బాలప్రతిభ 1969 ముదునూరి వెంకటేశ్వర రావు 32. పసిడిబాల 1969 చింతా హనుమంత రావు 33. బాలప్రపంచం 1970 మండా సూర్యనారాయణ 34. ఆనందబాల 1967 బి.కె. విశ్వేశ్వరరావు, ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు 35. బొమ్మరిల్లు 1972 విజయబాపునీడు 36. బాలానందం 1972 సాయి కుమారి 37. పాలవెల్లి 1974 గిరిజ శ్రీభగవాన్ 38. వసంతబాల 1974 విశ్వ ప్రసాద్ 39. పాదరిల్లు 1974 జి.వి. రంగాచార్యులు 40. బుజ్జాయి 1975 జి. అప్పారావు 41. స్నేహబాల 1976 నాయుని కృష్ణమూర్తి 42. బాల 1977 న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి 43. బాలానందం 1977 వై.బి. వెంకటరాజు 44. బేబి 1977 సి. నాగేశ్వర రావు 45. మిక్కీమౌస్ 1977 46. చంపక్ 1977 విశ్వనాథ్ 47. ఊహాశక్తి 1978 పి. పద్మనాభ రావు 48. బాలభారతి 1978 వి.వి. సరసింహారావు, శశిభూషణ్ 49. ప్రమోద 1978 ధనికొండ హనుమంతరావు 50. మాబడి 1978 నాయుని కృష్ణమూర్తి 51. పాఠశాల 1978 నాయుని కృష్ణమూర్తి 52. బాలచంద్రిక 1979 బుడ్డిగ సుబ్బరాయన్, చొక్కాపు వెంకటరమణ 53. బాలవాణి 1979 54. విద్యాబాల 1979 కంవుల అంజనేయ శర్మ 55. మిలియన్ జోక్స్ 1979 ఎల్. వెంకటేశ్వర్లు 56. బాలజ్యోతి 1980 నండూరి రామమోహన రావు, శశికాంత్ శాతకర్ణి 57. విస్డమ్ 1982 కె.వి. గోవిందరావు 58. జాబిలి 1982 కె.వి. గోవిందరావు 59. బాల 1982 సుగుణ కేశవులు (కేశి) 60. బాలభామ 1982 61. బాలలోకం 1982 రాజవీరు 62. యంగ్ హీరో 1983 వినుకొండ నాగరాజు 63. చంద్రసీమ 1984 లక్ష్మీ 64. చంద్రలోకం 1984 విశ్వేశ్వర రావు 65. బాలరంజని 1985 కె. రాజేశ్వర రావు 66. చిన్నారిలోకం 1985 కె. రాజేశ్వర రావు 67. బాలకిరీటం 1985 68. చిన్నారి 1986 ఎ. సాయి కుమార్ 69. చంద్రబింబం 1986 బి.కె. మోహన్ 70. చిరుమువ్వలు 1986 బి.వి. నరసింహ రావు 71. సరదాబడి 1989 72. నవ చిత్రకథ 1989 గుమ్మనూరు రమేష్ బాబు 73. బాలచెలిమి 1990 వేదకుమార్, చల్లా శ్రీనివాస్ 74 చెకుముకి 1990 ఎ. రామచంద్రయ్య 75. బాలమందిరం 1990 76. బాలవెన్నెల 1992 వి. భూపతి రెడ్డి 77. బాల ప్రపంచం 1993 జి.ఎ. రావు 78. ఊయల 1998 చొక్కాపు వెంకటరమణ 79. లీలాబాల 2000 వి. శ్రీహరి 80. బాలజోజో 2000 బుర్రా సుబ్రహ్మణ్యం 81. బాలతేజం 2000 నందూరి సీతారామారావు 82. చిన్నారులు 2002 జె. గయత్రి 83. ఆటవిడుపు 2002 మతుకుపల్లి మాధవరావు 84. చిట్టి వికటన్ 2002 85. బాల-ది-కిడ్ 2005 కిశోర్ 86. సిసింద్రీలు 2006 కె. బాపిరాజు 87. మామయ్య 2007 అరిబండి ప్రసాద రావు 88. చిన్నారి 2007 ఎ. సాయి కుమార్ 89. నాని 2007 ఎన్. కృష్ణబాబు 90. బాలబాట 2008 కె.ఎస్.వి. రమణమ్మ 91. కొత్తపల్లి 2008 నారాయణ 92. బాలబాట 2008 కె.ఎస్.వి. రమణమ్మ 93. చంద్రబాల 2009 శక్తిదాస్ 94. బాలభారతం 2009 రామేజీ రావు 95. మొలక 2013 వెదంటసూరి 96. శ్రీవాణి పలుకు 2014 ఎం.వి.వి. సత్యనారాయణ 97. బాలల బొమ్మరిల్లు 2014 డార్ల బుజ్జిబాబు 98. చంద్రప్రభ 2015 డార్ల బుజ్జిబాబు ఆధారం: చొక్కాపు వెంకటరమణ