సుందర భారత దేశం మనది విశాల సంస్కృతి నిలయమిది. హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవ కాలవాలమై వెలుగొందే జైనం బౌద్ధం ధర్మ పథాల్నే వెలిగించే జాతులు మతములు సహకారంపై సహజీవనమై నడయాడ స్వయంసమృద్ధం స్వయంసంపూర్ణం సంఘహితముకై నిర్వాణం సాగుతున్నదిట కలకాలం తిలక్, ఫేష్, అల్లూరి, భీం, సింగ్, బోస్ లది వీరావేశం గాంధీ, నెహ్రు, ఆజాద్, పటేల్ వెలిగించారోయ్ అఖండదీపం రాయ్, సాగర్, కందుకూరి గురజాడల బాట కల కల విరిసే కిలకిల పాట కొత్త మార్పుకై అడుగు జాడలై పూలే, అంబేద్కర్, జాషువా గోరాలు సాగినారిట చరితార్థులై. ఆధారం: డా. కాసర్ల రంగారావు