రామానుజన్ సంఖ్య 1729 అని మీకు తెలుసుగదా. ఈ సంచికలో 1729 యొక్క ప్రత్యేకతలు చర్చిద్దాం. రెండు ఘనాల మొత్తంగా రెండు విధాలుగా వ్రాయగల్గిన సహజ సంఖ్యలలో కనిష్ఠ సంఖ్య 1729 1729 = 13+123 = 93+103 ఇలాంటి సంఖ్యలు 50,00,000లో 101 మాత్రమే ఉన్నాయి. 1729 తరువాత ఈ విధంగా వ్రాయగలిగిన సంఖ్య 4104. 4104 = 23+163 = 93+153 1729 ను రెండు వర్గ సంఖ్యల భేదంగా కూడ వ్రాయవచ్చును. 1729 = 552-362 = 732-602 = 1272-1202 = 8652-8642 1729 లోని అంకెల మొత్తము 19. 1729 ను 19 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇలాంటి సంఖ్యలనే హర్షద్ సంఖ్యలు అందురు. మరి కొన్ని హర్షద్ సంఖ్యలు 874, 1387 మరియు 1558. ఇది పరిశీసించండి ఎంత ఆసక్తిదాయకంగా ఉందో. 1729 = 18x81+17x71-15x51-14x41+13x31 1729 = 1x7x13x19 = 1 (6+1) (6+6+1) (6+6+6+1) ఇలాంటి ధర్మాలు మరి కొన్ని మీరు తయారుచేసి, ఆనందించండి. ఆధారం: శ్రీ కృష్ణసాయి