ప్రశ్నః మనం జాయింట్ వీల్‌ను నడుపుతున్నపుడు లేదా విమానాలలో ప్రయాణించేటపుడు మన చెవులలో గాలి లాక్కుపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకు? జవాబు: మనకు చెవులు శ్రవణ సెన్సార్లు. మనము 20 Hz నుండి kHz వరకు పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీల) శబ్దాలను వింటాము. ముఖంపై ఎడమ, కుడి స్థానాల్లో ఒక్కో చెవి ఉండటం వల్ల ధ్వని వచ్చే దిశను గుర్తించి స్టీరియోఫోనిక్ దాల్చీ సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తున్నాము. చెవిలో మూడు ప్రధాన భాగాలుంటాయి. అవి 1. బయటచెవి (ఇది చెవిగా కనిపించే భాగం), 2. మధ్య చెవి, 8. లోపలి చెవి. బయటచెవి, మధ్య చెవి, మధ్యలో కర్ణభేరి, శంకాకారపు పౌర (సెప్టం) ఉంటుంది. ఇది బయటి చెవి, మధ్య చెవిల మధ్య ఒక పలుచని సరిహద్దులా ఉంటుంది. బయటి చెవి బయటి వాతావరణానికి బహిర్గ్ణతమవుతుంది. మధ్య చెవి యూన్గావైన్ కెనాల్ అని పిలువబడే ఒక కుహరం ద్వా నోటిలోని సప్తపద (ఫిరింజయల్) ప్రాంతానికి అనుసంధానం అయి ఉంటుంది. విమానంలోను లేదా ఎత్తైన ప్రౌంతంలోను మన చెవికి రెండు వాతావరణాలుంటాయి. ఒకటి బాహ్య్మవాతావరణ పీడనంతో బయటి చెవి ఉండగా నోటి కుహరం నందున్న పుపుస నాళం (శ్వాసనాళం)లో సాధారణ పీడనంతో మధ్య చెవి ఉంటుంది. ఈ రెండు ఒత్తిళ్లు (ఒత్తిడి విలువలు, చుట్టూ ఉన్న పరిస్థితి) ఉంటే ఆ కర్ణభేరి ఐసోబారిక్ (సమపీడన) స్థితిలో ఉందంటారు. సాధారణంగా మన నోటిలో పీడనం వాతావరణ పీడనం లాగానే ఉంటుంది. ప్రయాణసమయాల్లో మామూలుగా మనం నోరు మూసుకుని ఉంటాము. నోరు మూసుకున్నప్పటికీ శ్వాసక్రియ కోసం నాసికా రంగ్రాలు గొంతుతో అనుసంధానించి ఉంటాయి. అందువల్ల బాహ్య చెవి, మధ్య చెవి సాధారణంగా ఐసోబారిక్ స్థితిలో ఉంటాయి. మనం ప్రయాణంలో ఉన్చప్రుడు ముఖ్యంగా విమాన ప్రయాణ సమయంలో, నోటి అంతర్గత (ఊపిరితిత్తుల సాధారణ పీడనం) బాహ్య పీడనానికి భిన్నంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా లోపలికి గాలి రాకుండా కిటికీలు మూసి ఉన్న వాహనాలలో, లోపలి పీడనాల్లో అడపా దడపా మార్పులు వస్తాయి. ఇలాంటి సమయాల్లో కర్ణభేరికి అటు ఇటు పీడనాలు వేర్వేరుగా ఉండడం వల్ల అధిక పీడనం వైపు నుంచి అల్ప పీడనం వైపునకు పలుచని కర్ణభేరిపై వత్తిడి ఏర్పడి శబ్దం వస్తుంటుంది. మనం నోరు తెరువగానే తిరిగి రెండు వైపులా పీడనాలు సమానం కావడంతో తిరిగి కర్ణభేరి యథాగస్తానానికి వస్తుంది. అపుడు కూడా క్రిక్మన్చట్లు సున్చితంగా చెవిలో శబ్దం వస్తుంది. జలుబు లేదా ఇతర శ్వాసకోశ సంబంధిత కారణాల వల్ల కూడా చెవిలో శబ్దం రావడానికి వీలుంది. ఈ పరిస్థితిలో మధ్య చెవిలో, బయటి చెవిలో ఉండే పీడనం ఒకేలా ఉండకపోవచ్చు. ఇలాంటి అనుభవాల వల్ల ప్రమాదమేమీ లేదు. ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒకసారి నోరు తెరిచి ఏదో మింగినట్లుగా ప్రయత్నిస్తే చెవులలో ఈ ఇబ్బంది వెళ్లిపోతుంది. ఆధారం : Vigyan Prasar