నైజీరియా ఆఫ్రికా ఖండంలో పడమటి ప్రాంతంలో గల దేశం. 3 లక్షల 56 వేల మైళ్ళ విస్తిర్ణం ఉండే ఈ దేశం జనాభా 15 కోట్లు. నైరుతి దిక్కులో ఈ దేశానికి అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన నైజర్ నది, పడమట రిపబ్లిక్ అప్ బెనిన్, తూర్పున చాడ్, కామెరూన్ లు సరిహద్దులుగా ఉన్నాయి. “అబుజా” ఈ దేశపు రాజధాని కాగా అతి పెద్ద పట్టణం లాగోస్. ఈ దేశపు “ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా” అని పిలుస్తారు. క్రి.పూ. 9000 సంవత్సరాల నాడే మానవుడు ఈ దేశంలో నివసించిన ఆధారలున్నాయి. ఇక్కడి ప్రజలు ప్రధానంగా మోసా, ఇగ్ బో, యొరుబా తెగలకు చెందిన వారు. ప్రస్తుతం జనాభాలో చెరిసగం ఇస్లాం, క్రైస్తవ మతాలను అనుసరిస్తూన్నారు. అధికారిక భాష ఇంగ్లిష్. మన దేశం లాగానే బ్రిటిష్ వలసగా ఉండిన ఈ దేశం 1960 అక్టోబరు 1న స్వాతంత్రం పొందింది. “గుడ్ లుక్ జోనాధన్” ప్రస్తుత అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నైజీరియా సంతతికి చెందినావాడే అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది.