ఏదైనా ఒక పాము విష సర్పమా కాదా అన్న విషయం తెలుసుకునేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన అంశం ఆ పాము తాలూకూ తలను, తోకను, నోటినీ పరిశీలించడం.. విష సర్పాలు తల భాగం దాదాపుగా ఓ త్రికోణాకృతిలో ఉంటుంది. పెద్దపెద్ద కోరలు ఉంటాయి. కనుపాపలు అండాకృతిలో ఉంటాయి. ఇలాంటి పాములు ఎవరినైనా కాటేసినప్పుడు వారి శరీరం మీద విషపు కోరల గుర్తులు స్పష్టంగా కన్పిస్తాయి. తోక దగ్గరి భాగం చిన్నచిన్న వలయాలతో వుంటుంది. ఈ వలయాలపై నులువుగా ఎలాంటి చీలికా ఉండదు. విషం లేని పాములు తల భాగం గుండ్రంగా లేదా అండాకృతిలో వుంటుంది. విషపు కోరలు వుండవు. కనుపాపలు గుండ్రంగా ఉంటాయి. ఇలాంటి పాములు ఎవరికైనా కాటేసినప్పుడు వారి శరీరం మీద ఆ ప్రదేశంలో చిన్నచిన్న వరుసకు సంబంధించిన గుర్తులు వుంటాయి. తోక దగ్గరి భాగం వలయాలు వలయాలుగా ఉన్నప్పటికీ, అవి రెండుగా చీలి ఉంటాయి. పాము కాటేసినప్పుడు ఎవరికైనా పాము కరిచినప్పుడు ఏం చేయాలంటే... పాము కాటు తిన్న మనిషికి మరేం ఫరవాలేదని ముందుగా ధైర్యం చెప్పండి. కాటేసిన ప్రాంతాన్ని సబ్బుతో రుద్ది నీళ్ళతో శుభ్రంగా కడగండి. పాము కాటు తిన్న మనిషి నడవడం ఏ మాత్రం మంచిది కాదు. అందుకని వెంటనే అతడ్ని పడుకోబెట్టండి, తల, గుండె ఎక్కువ ఎత్తులో ఉండేలా చూడండి. గుండె కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. ఆ మనిషిని అలా పడుకోబెట్టిన పొజిషన్ లోనే ఉంచి, ఆసుపత్రికి తీసుకుపోండి కరచిన పాము ఏ కోవకు చెందినదో పరిశీలించండి. దానికి సంబంధించిన వివరాలను వైద్యుడికి చెప్పండి.