ఆది మానవుడు ఉపయోగించిన ఒక గొప్ప సాంకేతిక పరికరంగా బుమెరాంగ్ ను చెప్పుకొవచ్చు. ఆదిమానవుడు జంతువులను, పక్షులను వేలాడటానికి ఉపయోగించిన త్రిభుజాకారపు కొయ్యదబ్బను “బుమెరాంగ్” అంటారు. విసిరేసినపుడు అదిలక్ష్యానికి తగలనపుడు సుడులు తిరుగుతూ మరలా వేటగాడి వద్దకు చేరడం “బుమెరాంగ్” ప్రత్యేకత. “బుమెరాంగ్” పటంలో చూపినవిధంగా త్రిభుజాకారంలో వుంటుంది. ఒకవైపున పట్టుకొని దీన్నివిసిరేస్తారు. దీని నిర్మాణంలో కాస్త వంపుతిరిగి వుండటం వల్ల, దీన్ని విసిరేసినపుడు ప్రతిసారీ తనదిశను మార్చుకుంటూ చివరికి విసిరేసిన చోటికే వచ్చి చేరుతుంది. సేకరణ: ఎస్, ఎన్,నశీమ్ బాషా, గోపవరం