ఇందు గలడందు లేదని మీ రెందెందు వెదికినా సజీవ సాక్ష్యంలా సకల జీవుల్లోనూ నేను, మీ తనువులో ఆ తరువులో కంటికి కన్పించకుండా చూపుకందని సూక్ష్మాతి సూక్ష్మజీవుల్లోనూ నేను, నేను లేక నీకు లేదు ఉనికి. ఉలుకు పలుకు లేని రాయిని కాను నేను కష్టంలో సుఖంలో స్పందించే కన్నుల్లో కన్నీటి చెలిమె అంచుల్లో, కేంద్రంలో, హృదయంలో హృదయాంతరాళల్లోనూ నేనే! ఆలోచనకూ, వివేచనకూ విజ్ఞాన సముపార్జనకూ హేతువైన మస్తిష్కంలోనూ నేనే! జీవకోటి పుట్టుటకు ఆరంభమూ నేనే, ఆలంబనా నేనే భూగోళం ముఖచిత్రాన్ని మార్చిందీ నేనే ఆకారంలో, ఆహార్యంలో అన్నింటా నేనే... నేనే... నీ కదలికను నియంత్రించే నీ శాస్వను శాసించే నియంతనూ నేనే! ఒక్కణ్ణే, నేనొక్కణ్ణే అన్నిటికీ, అన్నింటా నేనై బతుకుబండి నడుపగలను అందరితో మమేకమై పదుగురితో కలిసి మెలసి జాతిని నిలబెట్టగలను ఇంతకూ నేనెవర్నో గుర్తించారా? సకల జీవన చర్యలకు వేదికను నేను సర్వజీవోత్పత్తులకు కేంద్రాన్ని నేను మిలియన్ల కర్మాగారాలకు సాధ్యం కాని దాన్ని నాలో పండించగలను ఇంతకూ నేనెవర్ని? నేనొక వేదికను నేనొక నిర్మాణాన్ని నేనొక కదలికను నేనొక జీవకణాన్ని చెకుముకి నేస్తాల కొరకు నా అంతరంగాన్ని నా అనంత జీవన చర్యల యంత్రాగాన్ని ఆవిష్కరిస్తాను నేను. నేనే సకల జీవన చర్యలకు అసలు జీవనానికి ఒక నమూనానైతే నా సూక్ష్మాతిసూక్ష్మ నిర్మాణంలో ఎన్నెన్నో కణంగాలు మీ మెదడులా, మీ నేత్రాల్లా నాలో లీనమై నాతోనే సమ్మిళితమై జీవితాలు సజావుగా సడిపే చక్రంలా చక్రం తిప్పుతూ ఉంటాయి నా కణాంగాలు జీవ ప్రపంచం అంతా వ్యాపించిన ప్రకరణాన్ని జీవ కణాన్ని నేను నేనే మీలో దాగి ప్రతి అవయవాన్నీ ప్రతి కదలికనూ నియంత్రించే సారధిని! నా చెప్పుచేతల్లోనే నా కణాంగాలు వేలాది చక్కెర కర్మాగారాలు నాలోనే సూర్యరశ్మిని ఒడిసి పట్టే కిరణశక్తిని పడి వార్చే హరిత రేణువు నా కణాంగమే గాలిన హరిత రేణువు ఘనత చూడు భూమి పొరలో దాగి వున్న నీటినంతా తోడుకొచ్చి పచ్చపచ్చగా ఆకు పచ్చగా గాలి, వెలుతురు కుమ్మరించి చక్కెరలు పండిస్తే నేను లోకానికంతా శ్వాసలూడే ఆక్సీజన్ నా శ్రమఫలమే అందుకే సకల జీవుల జీవనానికి నేనే ఆధారం! ఆలంబన! ఆధారం: ప్రొ. కట్టా సత్య ప్రసాద్