మాళవ రాజుకు పురుషోత్తముడనీ కొడుకు ఉన్నాడు. పురుషోత్తముడిలో అంతగా చురుకుతనం లేదు. అమాయకంగా నెమ్మదిగా వుండేవాడు రాజకుమారుడు అలా వుంటే భవిష్యత్తులో రాజ్యపాలకుడు ఎలా అవుతాడని రాజుగారికి దిగులు పుట్టుకుంది. అందుకని రాజుగారు దేశములో గొప్ప గొప్ప పండితులను పిలిపించి తన కొడుక్కి విద్యాబుద్ధులు నేర్పించమన్నాడు. పండితులు రాజుగారి ఆజ్ఞని శిరసావహించి పురుషోత్తముడిని తమతో పాటు తీసుకెళ్ళారు. ఆ పండితులు ఎన్నో శాస్త్రాలను చదువుకున్నారు. ఆరు నెలల తరువాత గురువులు పురుషోత్తముడిని రాజుగారి వద్దకు తీసుకొని వచ్చారు. తమకు తెలిసిన విద్యలన్నీ నేర్పించామన్నారు. కావాలంటే రాజుగారిని పరీక్షించమని చెప్పారు. రాజుగారు తమ కుమారుడిని ఎన్నో ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పడు. రాజ కుమారుడు రాజుగారు ఎంతో సంతోషించి పండితులను సత్కరించి పంపివేశాడు. కానీ వృద్ధుడైన ఒక మంత్రి రాజుగారి దగ్గరకు వచ్చి మహారాజా యువరాజు గారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం వుంది అన్నాడు. రాజుగారు ఆ విద్య తెలిసిన పండితుని గురించి మీరే చెప్పండి అన్నాడు. వృద్ధ మంత్రిగారు రాజుగారితో రాజా ఈ భవిష్యత్తు జ్ఞానం అన్నది పండితుల నుంచీ నేర్చుకునేది కాదు. లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం. మాధవుడు అనే సామాన్యుడు వున్నాడు. అతడు వివేకాన్ని, విచక్షణను రాజకుమారునికి నేర్పగల సమర్థుడు అన్నాడు. రాజుగారు మాధవుణ్ణి పిలిపించి రాజకుమారుడికి జ్ఞానాన్ని బోధించమన్నాడు. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. మూడు నెలల తరువాత రాజకుమారుడిని తీసుకు వచ్చి తనకు తెల్సినదంతా నేర్పానని అన్నాడు.రాజుగారు వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలింపించి మేరే రాకుమారిడిని పరీక్షించండి. అన్నాడు. పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి. మహారాజా అన్నాడు. పురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా వుంగరం అన్నాడు. రాజు సభలో వున్న అందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి ఆశ్చర్యంతో ఎలా చెప్పగలిగావు యువరాజా అన్నాడు. యువరాజు ఏమీ లేదు మంత్రివర్యా మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి వుంగరం వుంది. మీరు గదిలోకి వెళ్ళి వచ్చిన తరువాత వుంగరం మీ వేలికి లేదు అన్నాడు. మంత్రి సంతోషించాడు. పరిశీలన వుంటే భవిష్యత్తును పసికట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజుగారికి ఇప్పడు సంపూర్ణంగా వుంది. అన్నాడు. మంత్రి. తన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందగలిగినందుకు రాజుగారు ఎంతో సంతోషించారు. రచయిత -వంగీపురం శ్రీనాథాచార్య.