అది స్కూల్ గ్రౌండ్. గేమ్స్ పిరియడ్ కావడంతో పిల్లల ఆటలు, అరుపులతో కోలాహలంగా ఉంది. నాల్గవ తరగతి చదువుతున్న చిన్న ఒకమూలగా కూర్చుని నిరసనగా చూస్తూన్నాడు. క్లాసులో చురుకుగా సమాధానాలు చెప్పే చిన్న అలా ఉండటం చుసిన సైన్సు టిచర్ ఏంటి చిన్నూ అలా ఉన్నావ్ అని అడిగింది. చిన్నూ ఏమి మాట్లాడలేదు. ప్రక్కనే ఆడుకుంటున్న ఎనిమిదవ తరగతి చదువుతున్న నితిన్ అది గమనించి , చిన్నూ ఈ రోజు లంచ్ బాక్స్ లోనివి తనకిష్టం లేవంటూ ఏమి తినలేదు టిచర్ అన్నాడు. టిచర్ చిన్నూ లంచ్ బాక్స్ తెరచి చూస్తే కేరట్ రైస్, పేరుగు , పల్లిపట్టి , దానిమ్మగింజలు కనిపించాయి. అవి చుసిన టిచర్ చిన్నూని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇవి ఎందుకు తినలేదు చిన్నూ అని అడిగింది. చిన్ను ఏడుపు ముఖంతో చూస్తూ నాకేమో నూడుల్స్ , కుర్ కురె ఇష్టం... మా అమ్మేమో అవి పెట్టింది అన్నాడు. టిచర్ నవ్వుతూ పిల్లలందర్నీ దగ్గరగా పిలిచి చుట్టూ కూర్చోబెట్టుకుంది. నేను కొన్ని ప్రశ్నలడుగుతాను, ఎవరు చకచకా సమాధానాలు చెబుతారో చూద్దాం అన్నది. పిల్లలందరూ హుషారుగా సరే టిచర్ అన్నారు. టీచర్: మనం రొజూ ఆహారం ఎందుకు తీసుకోవాలి? స్రవంతి: మనం చదువుకోవాలన్నా ఆడుకోవాలన్నా, ఎవరి పనులు వారు చక్కగా చేసుకోవాలన్నా మనకు శక్తి కావాలి. అందుకే తినాలి. టీచర్: మనం తినే ఆహారంలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయి? చైతన్య: కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్ధాలు), ఫాట్స్ (కొవ్వుపదార్ధాలు) మరియు ప్రోటీన్స్ (మాంసపుక్రుత్తులు)ఉంటాయి టిచర్. టీచర్: పిండి పదార్ధాలకు ఉదాహరణ చెప్పండి రుమాన్: అన్నం, చపాతీలు, పండ్లు మొదలైనవి టీచర్: కొవ్వు పదార్ధాలకు ఉదాహరణ చెప్పండి సుమిత్: నెయ్యి , డాల్డా, నూనెలు టీచర్: మంసపుకృత్తులకు ఉదాహరణ చెప్పండి హరిత: పాలు, గ్రుడ్డు, పప్పులు , మాంసం టీచర్: మన ఎముకలు ధృడంగా ఉండటానికి అవసరమైన కాల్షియం ఎందులో ఉంటుంది? చైతన్య: పాలు, గ్రుడ్డు, రాగులు టీచర్: మనకు రక్తం పెరగాడానికి అవసరమైన ఐరన్ ఎందులో ఉంటుంది? వరుణ్: ఆకుకూరలు, బెల్లం. ఖర్జూర , దానిమ్మ, మాంసం టీచర్: మనకు జబ్బులు రాకుండా నివారించే విటమిన్లు ఎందులో లభిస్తాయి? సాయి: పండ్లు , కారెట్లు, కూరగాయలు టీచర్: మనకు చూపు బాగా కనబడాలంటే అవసరమైన విటమిన్-ఎ ఎందులో ఉంటుంది? దిప్తిశ్రి: బొప్పాయి, కేరట్, దానిమ్మ, ఎరుపు , పసుపు రంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయలు టీచర్: మనకు చిగుళ్లనుండి రక్తం కారకుండా చేసి, పుండ్లు త్వరగా మానిపోయోల చేసే విటమిన్ సి ఎందులో ఉంటుంది? సుమన: ఉసరి, జామ, నిమ్మ వంటి పుల్లగా ఉండే అన్ని పండ్లలో ఉంటుంది. అప్పుడు టిచర్ అన్నది. చూడు చిన్నూ నువ్వు కూడా విన్నావుగా. అమ్మ పెట్టిన కేరెట్ రైస్ లో విటిమిన్ ఏ, దానిమ్మగింజల్లో ఐరన్, పల్లి పట్టిలో ప్రోటీన్లు, ఐరన్, పేరుగన్నంలో కాల్షియం ఉంటాయి. ఇవన్నీ తింటే నీకు శక్తితో పాటు చక్కటి ఆరోగ్యం కూడా వస్తుంది. మంచిగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నది నీకు తెలుసుకదా అన్నది టీచర్. “అవును టిచర్ ” అంటూ చిన్ను గబగబా వెళ్ళి లంచ్ బాక్స్ లోఉన్నవి తినేసి, ఫ్రెండ్స్ తో ఆడుకో సాగాడు. అప్పటినుండి చిన్ను అల్లరి పెట్టకుండా చక్కగా అన్నీ తింటున్నాడని వాళ్లమ్మ టిచర్ కి ధన్యవాదాలు తెలిపింది. మరి మీరు కూడా మంచి పోషక విలువలు కల్గిన తిండి తింటారు కదూ! ఆధారం: కె. శివబాబు