ఈ గాడిద ఎలా తయారైందో మీకిప్పటికీ అర్థమై వుంటుంది. కొంచెం లావుగా గట్టిగా వుండే ఇనప తీగ తీసుకోండి. కొంచెం ఓపిగ్గా ఈ గాడిదలాగా తయారు చెయ్యండి. రెండు మూడు రకాల అయస్కాంతాలు సంపాదించండి. గాడిదకాళ్ళకు గుండ్రటి అయస్కాంతాలు అమర్చండి. ఇప్పుడు గాడిదను ఒక టేబుల్ పై నిలబెట్టండి. టేబుల్ క్రింద ఇంకో రకం అయస్కాంతం పెట్టి మెల్లగా కదిలించండి. ఏమయింది…? మనగాడిద మహరాజులాగా పచార్లు ప్రారంభిస్తుంది… !