ప్రపంచంలో ఆహారపు పంటలలో మొదటి స్థానం మొక్కజొన్నది, రెండవ స్థానం గోధుమ, మూడవ స్థానం వరి పంటది మరి నాల్లోస్థానం “ఉర్లగడ్డ" ది. ఉర్ల గడ్డను బంగాళాదుంప, ఆలుగడ్డ, ఉర్లగడ్డ అని పిలుస్తారు. అన్నటు ఈ ఉర్లగడ్డ (Potato) అంతరిక్షయానం కూడా చేసిందండోయ్. అవును! 1995 లో "కొలంబియా' అనే అంతరిక్ష నౌకలో వ్యోమగాములు ఈ ఉర్లగడ్డను తమతో తీసుకుపోయారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు సైతం చౌకగా దొరికే కూరగాయ ఈ ఆలుగడ్డ. ఐక్యరాజ్య సమితి ఈ ఉర్లగడ్డ గౌరవార్థం 2008 వ సంవత్సరాన్ని"అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం" (International Year of Potato) గా ప్రకటించారంటే మన ఆలుగడ్డ గట్టి గద్దే. కత్తికి లొంగని కాగితం" అని మనం చేసే ఈ ప్రయోగంలో ముఖ్యపాత్ర ఈ ఉర్లగడ్డదే. "కత్తితో కోసినా కాగితం చినగ కూడదూ, ఎవరైనా చేయగలరా? " అని మీ స్నేహితులతో, బంధువులతో ఓ సవాలు విసరండి. అందరూ ముక్త కంఠంతో "మేము చేయలేము" అంటారు. అపుడు నవ్వి మీరు చేసి చూపండి. ఎలాగంటారా? రండి చేసి చూద్దాం. కావలసిన పరికరాలు: కాగితం కత్తి ఉర్లగడ్డ (ఒకటి) చేయువిధానము: కాగితాన్ని తీసుకోండి (మీ నోటు బుక్ లో వేస్తుగా చిరిగిన కాగితమయినా ఫరవాలేదు). దానిని మధ్యగా మడవండి. పటంలో చూపిన విధంగా పదునైన కత్తి అంచును ఈ పేపరు మడతలో వుంచండి. ఇపుడు ఉర్లగడ్డను తీసుకొని దానిపై కాగితంతో సహాకత్తిని ఉంచి గట్టిగా నొక్కండి. ఉర్లగడ్డ రెండు ముక్కలవుతుంది. ఉర్లగద్దే రెండు ముక్కలయిందంటే కాగితం కూడా రెండు ముక్కలయి వుండాలి కదా. కానీ గమనిస్తే ఆశ్చర్యం. కాగితం చిరగకుండా అలాగే వుంటుంది. ఉర్లగడ్డ తడి వల్ల కాస్త తడిచి వుంటుంది. అంతే! చిరగకుండా అలా వుంటుంది. చూశారా, కత్తి కోస్తే కూడా కాగితం చిరిగిపోలేదు. అంటే కాగితం కత్తికి లొంగలేదు. అదే మన "కత్తికి లొంగని కాగితం" ప్రయోగం. ఇది ఎలా సాధ్యం? అసలు కథేంటీ? వివరణ: పల్స్ (గుజ్జు) తో తయారు చేసిన కాగితంలో పోగులు వుంటాయి. ఈ పోగులకంటే ఉ ర్లగడ్డలోని కండ మెత్తగా వుంటుంది. కాబట్టి కాగితంతో సహా కత్తిని ఉర్లగడ్డపై గట్టిగా నొక్కినప్పుడు. కత్తి ప్రయోగించే వత్తిడి కాగితంపై పడకుండా వత్తిడి అంతా క్రింద మెత్తగా వున్న ఉర్లగడ్డ మీదే పడుతుంది. కాబట్టి కాగితం చిరిగిపోక ముందే ఉర్లగడ్డ రెండు ముక్కలవుతుంది. మహా అయితే ఉర్లగడ్డ తడివల్ల కాగితం కాస్త తడుస్తుంది. కానీ చిరగదు. పల్స్ (గుజ్జు) తో తయారు చేసిన కాగితంలో పోగులు వుంటాయి. ఈ పోగులకంటే ఉ ర్లగడ్డలోని కండ మెత్తగా వుంటుంది. కాబట్టి కాగితంతో సహా కత్తిని ఉర్లగడ్డపై గట్టిగా నొక్కినప్పుడు. కత్తి ప్రయోగించే వత్తిడి కాగితంపై పడకుండా వత్తిడి అంతా క్రింద మెత్తగా వున్న ఉర్లగడ్డ మీదే పడుతుంది. కాబట్టి కాగితం చిరిగిపోక ముందే ఉర్లగడ్డ రెండు ముక్కలవుతుంది. మహా అయితే ఉర్లగడ్డ తడివల్ల కాగితం కాస్త తడుస్తుంది. కానీ చిరగదు. రచన:- యం.యస్ యుగంధర్ బాబు, సెల్;9894782540