మనం రాసుకోవడానికి ఉపయోగించే ఒక కాగితాన్ని తీసుకోండి. దానిపై పటంలో చూపిన విధంగా (పెన్సిన్ ఆనించి వున్న చిత్రాన్ని గమనించండి) చిత్రాన్ని దించి, ఆ అంచుల వెంబడి దానిని కత్తిరించండి. తరువాత ఆ అంచులన్నిటినీ మధ్య భాగం వైపుకి మడత పెట్టండి. ఇప్పుడు కాగితం పువ్వుని నీటిపైన వదిలి పెట్టండి. కొంచెం సేపు ఓపిక పట్టండి. ఆశ్చర్యం..... ఇంతకు ముందు మనం మడతబెట్టిన రెక్కలన్నీ మెల్ల మెల్లగా విచ్చుకుంటూ పైకి లేస్తాయి. కొద్ది సేపటిలోనే అదొక కలువ పువ్వులా మారి పోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే .... కాగితం అనేది ప్రధానంగా చెట్ల పీచుతో తయారవుతుంది. ఈ పీచులో చాలా సన్నగా వుండే కాలువల్లాంటి నిర్మాణం వుంటాయి. ఈ సన్నని గొట్టాల్లోకి నీరు ప్రవహించడం వలన, కాగిం పువ్వుని మనం మడతపెట్టిన చోట బిగువు సడలి, దాని రెక్కలు లేచి నిలబడతాయి. ఏదైనా వాడిపోయిన పువ్వుని నీళ్ళలో వేసినప్పుడు అది తిరిగి ఎలా విచ్చుకుంటుందో మీకు తెలిసిందేగా. సరిగ్గా ఈ కాగితం పువ్వు కూడా అలాగే విచ్చుకుంటుంది. అదీ సంగతి...