తోకలేని పిట్ట తొంబై ఆమడల దూరం పోతుంది. ఏది? ఆ....దే పోస్టుకార్డు. సేలఫోన్ (లాభమా? నష్టమా?) రాకముందు మనుషుల మధ్య క్షేమ సమాచారాల సులభ సాధనం పోస్ట్ కార్డు. ఆ పోస్టు కార్డుతో ఓ తమాషా చేద్దామా? ఉఫ్ అంటే ఎగిరిపోయే కార్డు ముక్క ఎంత ఊదీనా ఎగరదే? రండి చేసిచూద్దాం. ఒక పోస్టు కార్డు తీసుకోని (ఫోస్టాఫిసులో దొరుకుతుంది) కొంచెం నిలువు రేఖలో వుంచి పటములో చూపిన విధంగా టేబుల్ పై వుంచండి. ఇపుడు మీ స్నేహితునీతో ఓ పందెం కాయండి. ఉఫ్ మని గాలివుది టేబుల్ పై పోస్టు కార్డును ఎగరగొట్టాలీ అని. మీ స్నేహితుడు కార్డు క్రింద గాలి ఊదుతాడు. ఏమి జరగాలి? గాలికి కార్డు ముక్క ఎగిరిపోవాలి. అంతేకదా! కాని అలా జరగదు. కార్డుముక్క కదలదు. పైగా కార్డు ఇంకా గట్టిగా టేబుల్ కు అంటుకు పోతుంది. ఎంత గట్టిగా గాలిఊదితే అంత గట్టిగా అంటుకుపోతుంది. కార్డు ఎగరదు. మీరు పందెం గెలిచారు. ఎందువల్ల? అసలు ఏం జరిగింది. 18వ శతాబ్దంలో డానియల్ బెర్నోలి అనే ఓ స్వీడన్ శాస్త్రవేత్త గాలి పీడనం గూర్చి ఒక సూత్రం కనుగొన్నాడు. అదేమిటంటే గాలి వేగంగా ప్రయాణం చేస్తున్నపుడు దాని పీడనము తగ్గుతుంది. దీని ప్రకారం ఉన్న గలిపీడనము వలన కార్డు ముక్క టేబుల్ కు అంటుకుపోతుంది ఎగరకుండా. ఎంతగట్టిగా ఊదితే కార్డు క్రింద పీడనము అంత తగ్గి కార్డు పీడనము వలన కార్డు అంతగాట్టిగా అంటుకుని వుంటుంది. ఆధారం: యుగంధర్