మనం ఒక మహా సముద్రం క్రింద వున్నాము. అది ఏ సముద్రం..? అదే గాలి సముద్రం. ఈ గాలి భూమిపై కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి భూగోళ చుటూ ఓ పొరలాగా, కవచంలాగ ఏర్పడి వుంది. ఎలాగైతే ద్రవ, ఘన పదార్థాలు భూమ్యాకర్షణకు లోబడి వుంటాయో, ఈ గాలి కూడా అదే విధంగా భూమ్యాకర్షణకు లోబడి వుంటుంది. ఈ విషయాన్ని 6,7 తరగతులలో నేర్చుకున్నారు కదా? ఇపుడు ఈ గాలితో ఓ రెండు మ్యాజిక్‌లు చేద్దామా. ఒకటి నీళ్ళగ్లాసు పై కర్చీఫ్ కప్పి తల క్రిందులుగా చేస్తా, నీరు క్రిందకు పడదు. రెండవది. నీటిని వేడి చేయకుండానే మసలకాగే నీటిలో ఏర్పడే బుడగలు నీటిలో సృష్టిస్తా…. ఎలా గంటారా?.... రండి! చేసిచూద్దాం. కావలసిన పరికరాలు: పెద్ద చేతిరుమాలు (హాండ్ కర్చీఫ్, కొంచెం పారదర్శకంగా వుండేది) చిన్న గాజు గ్లాసు నీరు చేయు విధానము: మొదటి మ్యాజిక్: గాసును తీసుకొని దానిలో మూడువంతుల వరకు నీటిని నింపండి. ఓ మెజీషియన్లాగ పోజుకొట్టి గ్లాసును మాయం చేసేటట్లు బిల్డప్ యిచ్చి గ్లాసును కర్చీఫ్‌తో కప్పండి. ఒక చేతో కర్చీఫ్‌తో కూడిన గాసును పైకి ఎత్తండి. కర్చీఫ్ అంచులను దగ్గరకు చేర్చి గ్లాసుక్రింద కర్చీఫ్ అంతటినీ ఒక్కటిగా చేర్చి రెండవ చేతితో గట్టిగా పట్టుకోండి. ఇపుడు మొదటి చేతితో కర్చీఫ్‌ను గ్లాసులోనికి నొక్కండి. గ్లాసులో నీరు మూడవ వంతు మాత్రమే వుంది. కనుక కర్చీఫ్ నీటి తలాన్ని దాదాపు తాకుతున్నట్లుగా కర్చీఫ్‌ను నొక్కండి. (ఒకవేళకరీఫ్ కాస్త తడి అయినా పరవాలేదు. మన మ్యాజిక్ ఇంకా బాగా వస్తుంది.) ఇపుడు పటము(1)లోలాగ రెండవ చేతితో కర్చీఫ్ సహాయంతో గ్లాసును తలక్రిందులుగా పట్టుకోండి. (పటం 3). ఈ స్థితిలో నీరు కర్చీఫ్ గుండా బయటకు రాదు. కర్చీఫ్ పుటాకార ఆకారం అలాగే వుంటుంది. అంతే మన మొదటి మ్యాజిక్ సక్సెస్. రెండవ మ్యాజిక్: మరలా గ్లాసును మొదటి స్థితికి తీసుకురండి ఒక చేతో గ్లాసును పట్టుకుని, కర్చీఫ్ అంచులు పట్టుకుని బిగుతుగాలాగి గ్లాసుపై బిగించండి. ఇపుడు కర్చీఫ్ పుటాకారం కాస్త మాయమై సమతల ఆకారం డోలుపై తోలుపొరలాగ చదునుగా వుంటుంది. మరలా కర్చీఫ్‌ను బిగించి పట్టుకొని గ్లాసును తిరిగీ తలక్రిందులు చేయండి. (పటము 2 లో లాగ). కర్చీఫ్ సమతలముగ్గా వుంధి కాబట్టి నీరు క్రిందకు దిగి కొత్త ఎత్తులో కనబడుతుంది. ఈ స్థితిలో కూడా నీరు బయటకురాదు. కానీ నీరు మరుగుతున్నట్లుగా నీటిలో బుడగలు ఏర్పడి కర్చీఫ్ గుండా శబ్దం చేస్తూ నీటి పైభాగానికి చేరుతుంది. కరీఫ్ పారదర్శకంగా వుంటే మనము చూడడానికి నీరు మరుగు తున్నటుగా కనిపిసుంది. చూశారా నిప్పలేకుండా నీటిని మరగ కాచామా గాలి సహాయంతో!. అదన్న మాట రెండవ మ్యాజిక్. ఇది ఎలా సాధ్యం? అసేలేం జరిగింది...! వివరణ: మొదటి మ్యాజిక్: నీరు కర్చీఫ్లో పుటాకార ఆకారం నుండి నీరు క్రిందకు ఎందుకు పడలేదు?. ఇక్కడ రెండు అంశాలు వున్నాయి. ఒకటి గాలి ఊర్ధ్వపీడనము (upward pressure of air) నీరు కర్చీఫ్ నుండి బయటకు రాకుండా బయటి గాలి నిలువరిస్తుంది. రెండు నీటి తలతన్యత (Surface tension of water) వల్ల నీరు కర్చీఫ్ నుండి బయటకురాదు. దారాల మద్యలో ఉన్ననీరు చీరితేగానీ బయటకురాదు. కానీ నీటి తలతన్యత నీటి పొరను గట్టిగా ముగనీయకుండా పట్టిపెడుతుంది. కానీ దారాల మధ్యలో ఉన్న నీరు చీలితేగానీ బయటకురాదు. కానీ తలతన్యత నీటి పొరను గట్టిగా మునగనీయకుండా పట్టి పెడుతుంది. రెండవ మ్యాజిక్: కర్చీఫ్ సమతలంగా చేసి తలక్రిందులుగా చేసినపుడు నీరు బయటకు రాలేదు కదా? దీనికి కారణం పైన చెప్పినట్లు నీటి తలతన్యత, గాలి ఊర్ధ్వపీడనం. సరే కర్చీఫ్ సమతలంగా వుంది కాబట్టి నీరు క్రిందకు దిగి నీటిపైన గ్లాసు అడుగు భాగం క్రింద శూన్యప్రదేశంలా ఏర్పడింది. ఈ శూన్యప్రదేశాన్ని చేరుకోవడానికి, భర్తీచేయడానికి బయట వెలుపల వున్నగాలి కర్చీఫ్ రంద్రాల గుండా నీటి పై భాగాన్ని చేరుకుంటుంది. ఇలా గాలి కర్చీఫ్ రంద్రాల గుండా ప్రవేశించేటప్పుడు శబ్దం వస్తుంది. నీటి బుడగలు ఏర్పడి, చూడడానికి నీరు మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది! అదన్నమాట. ఆధారం: యుగంధర్ బాబు, సెల్ : 93947823540