నీళ్ళ మీద బుగ్గ నిలచినయపుడు తళ్ళు వేగవచ్చి తాకుగాత; నిడెడు కుండ కింత విభ్రాంతి పడుదురు విశ్వదాభిరామ వినురవేమ... వేమనగారు జీవితం గురించి చెప్పిన పద్యము ఇది. నీళ్ళ మీద బుడగలు తేలుతూ వుంటాయి కదా! వెంటనే అలలు వచ్చి ఆ బుడగలను 'టప్ మని పేల్చి వేస్తాయి. అదే విధంగా కుండలు కూడా సులభంగా పగిలి పోతాయి కదా! అని జీవితం గురించి చెబుతూ ఎందుకు స్వార్థం, ఎందుకు అసూయ అని చిన్న మొట్టికాయ వేస్తాడు. నీటి బుడగ వాడుకుని ఓ సత్యం చెప్పారు కదా! నీరు ప్రాణికి జీవనాధారం 'జలధార జనాధార నీటిని వృధాచేయరాదు. “జలో రక్షతి రక్షితం:” నీటిని కాపాడుకోండి అది మిమ్మల్ని కాపాడుతుంది. సరేనా! మరి ఈ నీటితోనే మనం ఈ రోజు ఓ చిన్న మ్యాజిక్ చేద్దామా? ఎలాగంటారా? మనం చేసిచూద్దాం! నీటిలో నాణేన్ని మాయంచేద్దాం. కావలసిన పరికరాలు: ఒక నాణెం లోతైన వెడల్పాటి పాత్ర నీరు పారదర్శక గాజు గ్లాసు చేయువిధానం లోతైన వెడల్పాటి పాత్ర తీసుకొని దాని నిండుగా నీరు పోయండి. పాత్ర మధ్యలో అడుగు భాగంలో ఒక నాణేన్ని వంచండి. పాత్ర అంచు నుండి చూస్తే నాణెం కనిపిస్తూ వుంటుంది. ఎందువల్ల? నీరు పారదర్శక పదార్థం కదా! అందువల్ల ఇపుడు గాజు గ్లాసు తీసుకొని తలక్రిందులుగా చేసి నేరుగా నాణంపై నీటిలో బోర్తించండి. (బోర్లించునపుడు గాసును వంచకుండా బోర్తించాలి. దాని వల్ల గ్లాసులోని గాలి బయటకు రాకుండా బంధింపబడి వుంటుంది.) గ్లాసును నీటిలోనికి క్రిందికి దించుతూ వున్నప్పడు మెల్ల మెల్లగా నాణం కనుమరుగవుతూ పూర్తిగా కనబడకుండా పోతుంది. అంటే నాణెం మాయమవుతుంది. చూశారా నీటిలో చిత్రం. నాణెం కాస్త మాయం. ఇది ఎలా సాధ్యం..! అసలేం జరిగింది: పాత్రలో నీటి అడుగు భాగం కాంతి నిరోధకం (Opaque) గా వుంటుంది. వెండి అద్దంలాగ వెురునూ వుంటుంది. దానితో పాటు కాంతి దృగ్విషయమైన సంపూర్ణాంతర పరావర్తనం (Total internal reflection) వలన నాణెం కనిపించకుండా పోతుంది. వివరణ: కాంతి కిరణం నీటి నుండి గాలిలోనికి ప్రయాణించినపుడు కాంతికిరణం లంబానికి దూరంగా వంగుతుందని మీకు తెలుసు (నీరు దళసరి యానకం, గాలి పలుచని యూనకం). కిరణం యొక్క పతన కోణం పెరుగుతూవుంటే కాంతి వంగి ప్రయాణం చేయడం పెరుగుతూపోతుంది. నీటిలో నాణంపై పరావర్తనం చెందిన కాంతి కోణం 48 డిగ్రీలు అయినపుడు కాంతి వెలుపలికి రాలేక వెనుకకు మరలుతుంది. దీనినే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. అపుడు ఆ నాణెం మనకు కనిపించదు. అంటే నాణం పై నుండి బయలుదేరిన కాంతి మన కంటిని చేరదు. (జాగ్రత్త సుమా! పటంలో చూసిన విధంగా నాణంను ఏటవాలుగా చూడాలి. అప్పడే మాయం అవుతుంది. గ్లాసు పై నుండి నేరుగా చూస్తే నాణెం కనిపిసూనే వుంటుంది.) చూశారా నీటిలో చిత్రం. నాణెం కాస్త మాయం. ఈ సంపూర్ణాంతర పరావర్తనం ఆధారంగానే నేడు చాలా తంత్రీయత ద్వారా సమాచార వ్యవస్థ పనిచేస్తుంది. అలాంటి తంత్రీయాల్ని ఉపయోగించి, సమాచార వ్యవస్థలతో BSNL వంటి సంస్థలు ఇండ్లలోకి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. రచయిత: యుగంధర్ బాబు, సెల్. 9394782540