చికుబుకు చికుబుకు రైలే ... అదిరెను దీని స్టైలే... రైలు పట్టాలు రైలు బండి, రైలు ప్రయాణం చాలా స్టైలుగా వుంటుంది. శ్రమ తెలియని ప్రయాణినికి రైలు ప్రత్యేక రైలు వెళుతున్నప్పుడు చిక్కుబుక్కు చిక్కుబుక్కు అన్న శబ్దం వస్తుంది కదా? ఎందుకో తెలుసా? ఒకే వరుసలోని రైలు పట్టాల మధ్య కాస్త ఖళీ స్ధలం వదలి వుంటారు. రైలు చక్రాలు ఈ ఖాళీ స్దలాలను దాటేటప్పుడు అలా శబ్దం వస్తుందన్న మాట. మరి ఎందుకు అలా ఖాళీ స్ధలం వదిలారు అన్నది ప్రశ్న? ఎందుకంటే వట్టాలు ఇనుప లోహంతో తయారు చేయబడ్డది. లోహలన్నీ ఎండాకాలంలో అధిక వేడికి వ్యాకోచం చెందుతాయి. రైలు పట్టాలు కూడా అలా ఎండాకాలంలో వ్యాకోచం చెంది పొడవు పెరిగి పట్టాలు వంగిపోకుండా వాటి మధ్య ఖాళీస్ధలం వదులుతారు. అవి పొడవు పెరిగితే ఖాళీ స్ధలంలోకి వ్యాపిస్తాయి. మరలా చలికాలంలో సంకోచించి యధాస్దానానికి వేళతాయి. మరి లోహాలు నిజంగా వేడిచేస్తే వ్యాకోచిస్తాయా ?..... చేసిచుద్దాం. పటములో చూపిన విధంగా రెండు ఖాళీ సీసాలు తీసుకోవాలి. వాటిలో బరువు కోసం కొద్దిగా ఇసుక నింపండి. మొదట సిసాకు తగిన కార్కు బిరడా బిగించండి. ఒక 10సెం.మీ పొడవు గల అల్యూమినియం కడ్డికానీ. స్వేట్టర్లు అల్లే అల్యూమినియం (needle) సూది గాని తీసుకోండి చొప్పించండి. రెండవ కోన రెండవ సిసాపై కాస్త ఒత్తిడితో క్రిందకు నొక్కుతున్నట్లుగా అమర్చాలి (రెండవ సీసా ఎత్తుకంటే కాస్త తక్కువ ఎత్తులో కార్కుకు సూది అమర్చినట్లయితే రెండవ కోన రెండవ సిసాపై కాస్త నొక్కుతున్నట్లుగా అమరుతుంది.) ఒక దళసరి కాగితపు ముక్క సూచిక ఆకారంలో కత్తిరించి ఒక చిన్న కాజాలు కుట్టే సూదికి గుచ్చి అమర్చాలి. ఈసూదిని రెండవ సీసా పై అల్యూమినియం కడ్డి క్రింద అమర్చాలి. సూచిక భూసమాంతరంగా వుండేటట్లు వుంచాలి. ఒక క్రోవ్వోత్తిని వెలిగించి అల్యూమినియం కడ్డిక్రింద వుంచి వేడి చేయాలి. (పటంలో) కాసేపటికి సమాంతరంగా వున్న పేపరు సూచిక మెల్లగా క్రిందివైపుగా వంగుతుంది ఎలా ? అల్యూమినియం కడ్డి వేడెక్కి వ్యాకోచించి దాని పొడవు పెరిగింది. కానీ మొదటి కోన కార్కులో వుంది కనుక స్వేచ్చగా వున్న రెండవ కోన సాగి దాని వత్తిడికి క్రిందనున్న చిన్న సూది దొర్లుతూపోతుంది. దానికి అమర్చిన కాగితపు సూచి క్రిందకు వంగుతూ జరిగింది. కనుక లోహాలు వేడిచేస్తే వ్యాకోచిస్తాయని తెలిసింది కదా. క్రోవ్యోత్తిని తీసివేస్తే కాసేపటికి కడ్డి చల్లారి సూచిక యధాస్ధితికి వస్తుంది. ఆధారం: యుంగంధర్